కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు | Sensational Verdict Of Kadapa Pocso Court | Sakshi
Sakshi News home page

కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు

Dec 3 2025 8:24 PM | Updated on Dec 3 2025 8:28 PM

Sensational Verdict Of Kadapa Pocso Court

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగికదాడి కేసులో నిందితుడికి యావజీవ కారాగారా శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజ్జీవ జైలు శిక్ష విధిసూ.. పోక్సోకోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీసీ, రైల్వే సిబ్బందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి రూ.10 లక్షల 50 వేలు పరిహారం అందించాలని గుంతకల్ ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి 19న తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. రాజంపేట-నందలూరు మధ్య ఈ ఘటన  చోటు చేసుకుంది. బాలిక వాష్ రూమ్ వెళ్ళినప్పుడు రాం ప్రసాద్‌రెడ్డి ఆమెపై లైంగికదాడి చేశాడు.

హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఆర్ఎం కార్యాలయం నుంచి కడపకు రిఫర్‌ చేశారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే టీసీల నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా భావించిన కోర్టు.. నిర్లక్ష్యానికి కారణమైన టీసీ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్‌ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement