సాక్షి, విజయవాడ: భవానీపురంలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుంది.

42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధితులు రోడ్డునపడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులతో బాధితుల వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బందోబస్త్ మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. కూల్చివేతలను బాధితులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.




