భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? గత కొన్ని సిరీస్‌లగా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే సుందర్ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉంటున్నాడు. కానీ ఓ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడితే..మరో మ్యాచ్‌లో స్పిన్నర్‌గా తన బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.
బ్యాటింగ్‌లో కూడా ఒక స్దానంలో పంపడం లేదు. ఒక మ్యాచ్‌లో మూడో స్దానం, మరో మ్యాచ్‌లో ఆరో స్దానం అలా అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంది. బౌలింగ్‌లో కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై తీవ్రస్దాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జట్టులో సుందర్ రోల్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గానే వాషీని జట్టులోకి తీసుకున్నట్లు టెన్ డెష్కాట్ తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేలలోనూ బ్యాట్‌తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడిని మూడో వన్డే నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంచు ప్రభావం కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించడం లేదు.
అందుకే సుందర్‌కు రాంచీలో 3 ఓవర్లు, రాయ్‌పూర్‌లో 4 ఓవర్లు మాత్రమే ఇచ్చాము. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. గత ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా సుందర్ కృషి చేస్తున్నాడు అని పోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్ పేర్కొన్నాడు.
చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది అతడినే


