సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శన కారణంగానే అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
అతడితో పాటు ఈ జాబితాలో బంగ్లా దేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత నుంచి మెన్స్ క్రికెటర్ ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం.
దుమ్ములేపిన హార్మర్..
సైమన్ హార్మర్ ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.
హార్మర్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టి భారత్ గడ్డపై దక్షిణాఫ్రికా చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పాక్‌తో సిరీస్‌లో కూడా హార్మర్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ నామినేట్ అయ్యింది.
గత నెలలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లలో షెఫాలీ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ ఫైనల్‌లో పోరులో బ్యాటింగ్‌లో 87 పరుగులు చేసిన షెఫాలీ.. అనంతరం బౌలింగ్‌లో సునే లూస్, మరిజానే కాప్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు ఈ లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.
చదవండి: ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా?


