న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం | Womens CWC 2025: Team India Wins Over New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం

Oct 23 2025 11:26 PM | Updated on Oct 23 2025 11:33 PM

Womens CWC 2025: Team India Wins Over New Zealand

మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు (గురువారం) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలుపొందింది. 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దాంతో భారత మహిళల జట్టు 53 పరుగుల తేడాతో గెలిచారు.

వర్షం​ కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 10, రిచా ఘోష్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు.  ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్‌ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.

వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్‌ (55 బంతుల్లో 76 నాటౌట్‌; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్‌ ఆడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement