టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.
2025 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్‌లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 97/0గా ఉంది.
తుది జట్లు..
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబా
చదవండి: IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు


