విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్‌ ముందు అతి భారీ లక్ష్యం | Women's CWC 2025: South Africa Set Huge Target To Pakistan In Rain Affected 40 Over Game | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్‌ ముందు అతి భారీ లక్ష్యం

Oct 21 2025 8:22 PM | Updated on Oct 21 2025 8:41 PM

Women's CWC 2025: South Africa Set Huge Target To Pakistan In Rain Affected 40 Over Game

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 21) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. 

కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌ (90), సూన్‌ లస్‌ (68 నాటౌట్‌), మారిజన్‌ కాప్‌ (67 నాటౌట్‌), నదినే డి క్లెర్క్‌ (41) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.

ఆఖర్లో నదినే డి క్లెర్క్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 38వ ఓవర్‌లో 2 సిక్సర్లు, 39వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదింది. 40వ ఓవర్‌లో బౌండరీ కొట్టిన అనంతరం ఔటైంది. ఆ ఓవర్‌లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. అయినా అంతిమంగా భారీ స్కోర్‌ చేయగలిగింది. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ముగ్గురు (తజ్మిన్‌ బ్రిట్జ్‌, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్‌ రావడం విశేషం. పాక్‌ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. కెప్టెన్‌ ఫాతిమా సనా ఓ వికెట్‌ పడగొట్టింది.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ పోటీపడుతున్నాయి. అక్టోబర్‌ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన పాకిస్తాన్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. 

చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్‌ డకౌట్‌.. తడబడిన సౌతాఫ్రికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement