మహిళల సీనియర్ క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో (Nathan Keilty) బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తై కైలీ భారత మహిళా క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైతే చరిత్ర అవుతుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైనట్లవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లుగా పనిచేశారు.
ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో అతనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి క్లూ ఇచ్చాడు.
కాగా, ఇటీవలికాలంలో క్రికెట్ జట్ల సక్సెస్‌లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్‌నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ప్లేయర్‌కు వీరు వేర్వురుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు.
దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పోలిస్తే విదేశీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎగబడుతుంటాయి. భారత పురుషుల జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రూక్స్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నియమించుకుంది.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు బెదిరింపులు


