breaking news
Strength and conditioning coach
-
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక నియామకం
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక నియామకం జరిగింది. సోహమ్ దేశాయ్ స్థానంలో టీమిండియా నూతన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రౌక్స్ నియమితుడయ్యాడు. అడ్రియన్ గతంలో (2002 జనవరి-2003 మే) కూడా భారత జట్టుకు సేవలందించాడు. అడ్రియన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. క్రికెటేతర ట్రైనింగ్ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను పెంపొందించడమే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ విధి. ఈ విధిలో అడ్రియన్ నిష్ణాతుడు. క్వాలిఫైడ్ స్పోర్ట్స్ సైంటిస్ట్‌గా అడ్రియన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అడ్రియన్.. ప్రస్తుతం లార్డ్స్‌లో ఉన్న టీమిండియాతో జతకట్టాడని బీసీసీఐ ఓ వీడియో ద్వారా తెలియజేసింది. అడ్రియన్ పర్యవేక్షణలో టీమిండియా అత్యంత కఠినమైన హై ఇంటెన్సిటి ట్రైనింగ్ తీసుకుంటుంది.2002 నాట్‌వెస్ట్ ట్రోఫీలో టీమిండియా విజయంలో అడ్రియన్ కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత అతను 2003-2007 వరకు సౌతాఫ్రికా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేశాడు. అడ్రియన్ ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 వరకు కేకేఆర్‌తో.. ఆతర్వాత పంజాబ్‌తో పని చేశాడు. అడ్రియన్ 22 ఏళ్ల విరామం తర్వాత కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే, జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత ఇదివరకే లండన్‌లో ల్యాండైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
తప్పుకున్న భారత జట్టు ట్రైనర్!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న శంకర్ బసు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. చెన్నై టెస్టు ముగిసిన తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బీసీసీఐకి లేఖ పంపించారు. గత ఏడాది శ్రీలంకతో సిరీస్‌కు ముందు జట్టుతో చేరిన బసు కారణంగానే ఇటీవల ఆటగాళ్ల ఫిట్నెస్ అద్భుతంగా మెరుగుపడింది. తమలో మార్పుకు బసునే కారణమంటూ కెప్టెన్ కోహ్లి కూడా తరచుగా ప్రశంసించాడు. అయితే జట్టులో కొంత మంది ఆటగాళ్లు గాయాలపాలు కావడానికి అదే కారణమని విని పించింది. తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా బసు ట్రైనింగ్ చేయించారంటూ కొందరు ఆటగాళ్లు బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శంకర్ బసు రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదంచలేదు.