టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్‌ | Women's CWC 2025: Indian Bowlers Restricted Bangladesh For 119 Runs In Rain Hit 27 Overs Game | Sakshi
Sakshi News home page

టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్‌

Oct 26 2025 9:20 PM | Updated on Oct 26 2025 9:23 PM

Women's CWC 2025: Indian Bowlers Restricted Bangladesh For 119 Runs In Rain Hit 27 Overs Game

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.

బంగ్లా ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన షర్మిన్‌ అక్తర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్‌ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్‌ 2, కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా 9, షోర్నా అక్తర్‌ 2, నహీద అక్తర్‌ 3, రబేయా ఖాన్‌ 3, నిషిత అక్తర్‌ 4 (నాటౌట్‌), మరుఫా అక్తర్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్‌, దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది. 
చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement