
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.
వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో రోస్‌మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు