‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’ | Tamim Iqbal Ends Silence On Bangla-T20 World Cup Row Blames BCB | Sakshi
Sakshi News home page

ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే: తమీమ్‌ ఇక్బాల్‌

May 12 2026 12:58 PM | Updated on May 12 2026 2:02 PM

Tamim Iqbal Ends Silence On Bangla-T20 World Cup Row Blames BCB

2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణ‌యం అప్ప‌ట్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. త‌మ దేశంలో మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ తొల‌గించ‌డంపై బీసీబీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆటగాళ్ల భ‌ద్ర‌తకు సంబం ధించి కార‌ణాలు ఎత్తిచూపుతూ ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ మ్యాచ్ వేదిక‌ల‌ను భార‌త్ నుంచి శ్రీలంక‌కు మార్చాల‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన అభ్య‌ర్థ‌న‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) తోసిపుచ్చింది. 

అయితే ఆట‌గాళ్ల భ‌ద్ర‌తపై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని పేర్కొన్న ఐసీసీ మ్యాచ్ వేదిక‌ల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొలుగున్నట్లు బీసీబీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్ రావ‌డం, ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్ స‌జావుగా సాగిపోయింది. 

తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక అధ్య‌క్షుడు త‌మీమ్ ఇక్బాల్ స్పందించాడు. ఆనాడు ఐసీసీ మాటను వినకుండా బీసీబీ తప్పు చేసిందని, ఆ టోర్నీ ఆడకపోవడం వల్ల ఆర్థికంగా తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బంగ్లాదేశ్ జ‌ట్టు వైదొల‌గడం వెనుక అప్ప‌టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుబట్టాడు. 

‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వివాదం జ‌రిగిన‌ప్పుడు మొద‌ట నేనే గ‌ళం విప్పాను. నిజానికి గ‌త బీసీబీ ప‌రిపాల‌న విభాగం వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రైన‌ది కాదు. ఈ విష‌యంలో ఐసీసీ కూడా ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించింది. అప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక ప‌రిష్కారం క‌నుగొన‌డానికి ఆస్కారం ఉండేది. కానీ బీసీబీ ఐసీసీ మాట విన‌కుండా త‌ప్పు చేసింది. దీనివ‌ల్ల బంగ్లాదేశ్ జ‌ట్టు తీవ్రంగా న‌ష్ట‌పోయింది. 

ఇక‌ 1996-97 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌డం కోసం కెన్యాపై ఐసీసీ ట్రోఫీని గెలిచిన‌ప్పుడు బంగ్లాదేశ్ అంత‌టా ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకున్నారు. ఆనాటి సంబరాలు మమ్మ‌ల్ని క్రికెట్‌వైపు ఆకర్షించాయి. ప్ర‌తీ ఒక్క‌రు మిన్హాజుల్ అబెదిన్ నన్ను, ఖలీద్ మషూద్, అక్రమ్ ఖాన్ లాగా త‌యార‌వ్వాల‌నుకున్నారు. అప్ప‌టి నుంచే బంగ్లా క్రికెట్ క్ర‌మంగా ఎదుగుతూ వ‌చ్చింది. 

స‌రైన చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొల‌గ‌డం బాధాక‌రం. ఆ జ‌ట్టులో ఉన్న కొంద‌రు ఆట‌గాళ్ల వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడ‌క‌పోవ‌చ్చు. అయితే ఇప్పుడు స‌మ‌స్య‌లు అన్నీ స‌మ‌సిపోయాయి. బీసీసీఐతో మంచి సంబంధాలు కొన‌సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్ర‌స్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మ‌న్హాస్‌తో నాకు మంచి అనుబంధముంది. ఇద్ద‌రం క‌లిసి ఐపీఎల్‌లో ఒకే జ‌ట్టుకు ఆడాం.  

ఢాకా ప్రీమియ‌ర్ లీగ్ ఆడేందుకు ఆయ‌న చాలాసార్లు బంగ్లాదేశ్‌కు వ‌చ్చారు. నేను అధ్య‌క్ష హోదాలో ఇంకా ఆయ‌న్ను క‌ల‌వ‌లేదు. బ‌హుశా అది త్వ‌ర‌లో జ‌ర‌గ‌వ‌చ్చు. ఇక ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌లో భ‌ద్ర‌త చాలా బాగుంది. త్వ‌ర‌లోనే బీసీసీఐతో స‌మావేశం జ‌రిపి ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వ‌హించేందుకు క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. త్వ‌రలోనే భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య సిరీస్‌తో ఇరు దేశాల మ‌ధ్య క్రీడా బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్‌.. ఇదిగో సాక్ష్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement