బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే? | India vs Bangladesh series on? BCB makes room for 3 ODIs and T20Is in Sep | Sakshi
Sakshi News home page

IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?

Mar 22 2026 11:51 AM | Updated on Mar 22 2026 11:55 AM

India vs Bangladesh series on? BCB makes room for 3 ODIs and T20Is in Sep

భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుప‌డుతున్నాయా? ఈ ఏడాది ఆగస్టులో బంగ్లా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా వెళ్ల‌నుందా? అంటే అవునానే స‌మాధానం వినిపిస్తోంది. వాస్తవానికి గతేడాది జూలైలో బంగ్లాదేశ్ టూర్‌కు భారత్ వెళ్లాల్సి ఉండేది. కానీ అదే సమయంలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. 

దీంతో ఈ వైట్‌బాల్ సిరీస్‌ను 2026 ఆగస్టుకు వాయిదా వేశారు. కానీ ఆ తర్వాత భారత్‌-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో ఈ వైట్‌బాల్ సిరీస్‌లపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ ఐపీఎల్ నుంచి ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ తప్పించింది.

అందుకు నిరసనగా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లా-భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడ ఇక కష్టమే అని అంతా భావించారు. కానీ బంగ్లాదేశ్‌లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో భారత్‌-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ ప్రకారం జరగనున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆగస్టులో కాకుండా ఈ సిరీస్‌లో సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

"భారత్ పర్యటను సెప్టెంబర్‌కు ఐర్లాండ్ సిరీస్‌ను మరో విండోలో నిర్వహించాలని కోరాము. కానీ వారి బీజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఐరీష్ పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని" ఓ బీసీబీ సీనియర్ అధికారి క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
చదవండి: ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్‌ సూర్యవంశీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement