ఐపీఎల్-2026 సీజన్‌కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఈ ధనధాన్ క్రికెట్ పండగ మార్చి 28 నుంచి మొదలు కానుంది. అయితే ప్రస్తుతం అందరి కళ్లు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. గత సీజన్‌లో ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఈ ఏడాది ఎలా రాణిస్తాడో అని అందరూ వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు.
ఐపీఎల్-2025 సీజన్‌తో పాటు అండర్-19 క్రికెట్ స్ధాయిలో వైభవ్ దుమ్ములేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ సొంతం చేసుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.
ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ సత్తాచాటేందుకు వైభవ్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్‌కు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.
ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ కోసం ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు? అని సదరు విలేఖరి ప్రశ్నించాడు.
అందుకు వైభవ్ నవ్వుతూ.. మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుండి మూడు వేల పరుగులు చేస్తానని చెబుతా అని బదులిచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.
అయితే ఇదే ప్రశ్నకు వైభవ్ తర్వాత సీరియస్‌గా సమాధనమిచ్చాడు. నేను ఇన్ని పరుగులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోలేదు. నేను సహజశైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. నా వ్యక్తిగత మైలురాయిల కంటే జట్టుకు ట్రోఫీ అందించడమే నా ప్రధాన లక్ష్యం" అని అతడు చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2026: ఇషాన్ కిషన్‌పై యువ ప్లేయర్ సీరియస్..


