ఇషాన్ కిష‌న్‌పై యువ ప్లేయ‌ర్ సీరియ‌స్‌.. | Ishan Kishan Receives Fiery Send-Off From Teammate During Practice Match | Sakshi
Sakshi News home page

IPL 2026: ఇషాన్ కిష‌న్‌పై యువ ప్లేయ‌ర్ సీరియ‌స్‌..

Mar 22 2026 9:29 AM | Updated on Mar 22 2026 9:36 AM

Ishan Kishan Receives Fiery Send-Off From Teammate During Practice Match

ఐపీఎల్‌-2026 సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిద్ద‌మ‌వుతోంది. గ‌త సీజ‌న్‌లో లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎలాగైనా  సొంతం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్‌ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది.

ఈ క్రమంలో శనివారం ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు వింత అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ స్పిన్న‌ర్ జీషన్ అన్సారీ.. కిష‌న్‌పై సీరియ‌స్ అయ్యాడు.

అస‌లేమి జ‌రిగిందంటే?
మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 8వ ఓవ‌ర్ వేసిన జీష‌న్ అన్సారీ బౌలింగ్‌లో కిష‌న్ తొలి నాలుగు బంతుల‌ను రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్లుగా మ‌లిచాడు. అయితే ఆ త‌ర్వాత ఐదో బంతికి అన్సారీ అద్భుత‌మైన ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు.  కిషన్ డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

అయితే జీష‌న్ అన్సారీ మాత్రం కిష‌న్‌కు ఫైరీ సెంఢాప్ ఇచ్చాడు. కిష‌న్ వైపు వేలు చూపిస్తూ ఇక ఆడింది చాలు, పెవిలియ‌న్‌కు వెళ్లిపోమ‌ని సైగ చూశాడు. జీష‌న్ రియాక్ష‌న్ చూసి ప్ర‌తీ ఒక్క‌రూ షాక్ అయిపోయారు. కిష‌న్ మాత్రం న‌వ్వుతూ డ‌గౌట్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ దూరం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టును కిష‌న్ న‌డిపించ‌నున్నాడు.

చదవండి: IPL 2026: అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచ‌కోత‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement