అండర్‌-19 బంగ్లాదేశ్‌ మాజీ ఆటగాడి ఆత్మహత్య

Former Bangladesh U-19 Player Committed   Suicide - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్‌ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాబోయే బంగాబందు టీ-20 టోర్నమెంట్‌లో చోటు దక్కకపోవడంతో నిరాశ చెంది బంగ్లాదేశ్ అండర్ -19 మాజీ ఆటగాడు మహమ్మద్ సోజిబ్(21) శనివారం రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. టోర్నమెంట్‌లో తనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సోజిబ్‌ తెలిపాడు. టీ-20 ఆటగాళ్ల జాబితాలో తన పేరు రాలేదని నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హష్మోత్ అలీ ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోజిబ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2017లో అండర్ -19 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక జట్టులో సోజిబ్ పాల్గొన్నాడు. అతడు 2018 అండర్ -19 ప్రపంచ కప్‌లో స్టాండ్-బై ప్లేయర్ గా ఉన్నాడు.  

చదవండి: మొదటి బంతికే డకౌట్‌, సారీ చెప్పిన బౌలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top