2025-26 యాషెస్ సిరీస్‌కు (Ashes Series) అదిరిపోయే ఆరంభం లభించింది. పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 21) మొదలైన తొలి మ్యాచ్‌లో (Australia vs England) ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. యాషెస్ సిరీస్ చరిత్రలో గడిచిన వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 2001 ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడ్డాయి.
యాషెస్ టెస్ట్ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన ఏకైక ఉదంతం 1909 ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ తొలి రోజు రికార్డు స్థాయిలో 20 వికెట్లు పడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా 147, ఆర్వాత ఇంగ్లండ్ 119 పరుగులకు ఆలౌటయ్యాయి.
ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఇవాళ మొదలైన యాషెస్ టెస్ట్‌లోనూ పునరావృతమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టాడు. అరంగేట్రం పేసర్ బ్రెండన్ డాగ్గెట్ 2, గ్రీన్ ఓ వికెట్ తీశారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (52) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఓలీ పోప్ (46), జేమీ స్మిత్ (33), డకెట్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాక్ క్రాలే, రూట్, మార్క్ వుడ్ డకౌట్లు కాగా.. స్టోక్స్ 6, అట్కిన్సన్ 1, కార్స్ 6 పరుగులకు ఔటయ్యారు.
అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ బౌలర్లు సైతం విరుచుకుపడ్డారు. కెప్టెన్ స్టోక్స్ 5, ఆర్చర్, కార్స్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను పతనం అంచుకు తీసుకెళ్లారు.
ఇప్పటివరకు ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (21), గ్రీన్ (24), స్టీవ్ స్మిత్ (17), స్టార్క్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అరంగేట్రం బ్యాటర్ వెదరాల్డ్, బోలాండ్ డకౌట్లు కాగా.. లబూషేన్ 9, ఖ్వాజా 2 పరుగులకు ఔటయ్యారు. లియోన్ (3), డగ్గెట్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు


