Ashes 4th Test: చెలరేగిన ఇరు జట్ల బౌలర్లు.. తొలి రోజే 20 వికెట్లు | 20 Wickets fell on day 1 of 4th Ashes test | Sakshi
Sakshi News home page

Ashes 4th Test: చెలరేగిన ఇరు జట్ల బౌలర్లు.. తొలి రోజే 20 వికెట్లు

Dec 26 2025 1:17 PM | Updated on Dec 26 2025 1:30 PM

20 Wickets fell on day 1 of 4th Ashes test

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ (డిసెంబర్‌ 26) యాషెస్‌ సిరీస్‌ 2025-26 నాలుగో టెస్ట్‌ (బాక్సింగ్‌ డే టెస్ట్‌) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలుత ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేసింది. 

ఆతర్వాత ఆసీస్‌ బౌలర్లు కూడా అదే పని చేశారు. మొత్తంగా ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఆసీస్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్ట్‌ల్లో తొలి రోజే 20 వికెట్లు పడటం 1909 తర్వాత ఇదే తొలిసారి.  

చెలరేగిన  టంగ్‌
జోష్‌ టంగ్‌ (11.2-2-45-5) చెలరేగడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు అట్కిన్సన్‌ (14-4-28-2), బ్రైడన్‌ కార్స్‌ (12-3-42-1), స్టోక్స్‌ (8-1-25-1) సహకరించారు. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు మైఖేల్‌ నెసర్‌ (35) టాప్‌ స్కోరర్‌ కాగా.. హెడ్‌ (12), జేక్‌ వెదరాల్డ్‌ (10), ఉస్మాన్‌ ఖ్వాజా (29), అలెక్స్‌ క్యారీ (20), కెమరూన్‌ గ్రీన్‌ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్‌ (6), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (9), స్టార్క్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్‌ డకౌటయ్యాడు.

ఇంగ్లండ్‌ ఇంకా ఘోరం
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కుప్పకూలింగి. నెసర్‌ 4, బోలాండ్‌ 3, స్టార్క్‌ 2, గ్రీన్‌ ఓ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (41), అట్కిన్సన్‌ (28), స్టోక్స్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్‌ క్రాలే (5), డకెట్‌ (2), బేతెల్‌ (1), జేమీ స్మిత్‌ (2), విల్‌ జాక్స్‌ (5), కార్స్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్‌ డకౌటయ్యాడు.

కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement