మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 0-3 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయం చివరి రెండు టెస్ట్‌లకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఇంగ్లండ్ మరో స్టార్ బౌలర్ మార్క్ వుడ్ సేవలను కూడా కోల్పోయింది. వుడ్ మోకాలి గాయం కారణంగా రెండో టెస్ట్‌కు ముందే తప్పుకున్నాడు. తాజాగా ఆర్చర్ కూడా వైదొలగ డంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత బలహీనపడింది. ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్‌ను నాలుగో టెస్ట్‌కు తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ఈసీబీ ప్రకటించింది.
పోప్ ఔట్
గాయం కారణంగా ఆర్చర్ సిరీస్ మొత్తానికే దూరం కాగా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్‌ను ఈసీబీ నాలుగో టెస్ట్ నుంచి తప్పించింది. పోప్ గత మూడు టెస్ట్‌ల్లో కేవలం 125 పరుగులే చేశాడు. పోప్ స్థానంలో నాలుగో టెస్ట్‌లో జేకబ్ బేతెల్‌ను ఆడించనున్నట్లు ఈసీబీ తెలిపింది.
ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ తుది యాధాతథంగా కొనసాగనుంది. రేపటి నుంచి (డిసెంబర్ 26) మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో యాషెస్ టెస్ట్ ప్రారంభం కానుంది.
5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ చివరి రెండు టెస్ట్‌లైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆర్చర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడం ఇంగ్లండ్ కష్టాలను మరింత తీవ్రం చేసింది.
యాషెస్ నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్


