breaking news
Mohsin Khan
-
భారీ విజయంతో కర్ణాటక బోణీ
తిరువనంతపురం: స్పిన్నర్ మోసిన్ ఖాన్ (6/29) తిప్పేయడంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక భారీ విజయం సాధించింది. కేరళ సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో కర్నాటక ఇన్నింగ్స్ 164 పరుగుల తేడాతో కేరళపై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో కర్ణాటక జట్టుకిది తొలి గెలుపు. సౌరాష్ట్ర, గోవాలతో జరిగిన గత రెండు మ్యాచ్‌లు కూడా ‘డ్రా’గానే ముగిశాయి. డబుల్ సెంచరీతో భారీస్కోరుకు బాట వేసిన కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం 10/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ... సొంతగడ్డపై కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఫాలోఆన్ ఆడిన కేరళ 79.3 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ కృష్ణప్రసాద్ (33; 5 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు ని«దీశ్ (9), అక్షయ్ చంద్రన్ (0)లను పేసర్ విద్వత్ కావేరప్ప వరుస బంతుల్లో అవుట్ చేయడంతోనే కేరళ పతనం మొదలైంది. కెప్టెన్ అజహరుద్దీన్ (15)ను శిఖర్ పెవిలియన్ చేర్చగా మిగతా బ్యాటర్లకు మోసిన్ స్పిన్ ఉచ్చు బిగించడంతో కేరళ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. నిజానికి 140 పరుగులకే 9 వికెట్లను కోల్పోయిన కేరళ 150 పరుగుల్లోపే ఆలౌట్ ఖాయమనిపించింది. అయితే ఆఖరి వరుస బ్యాటర్ ఇడెన్ ఆపిల్ టామ్ (68 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటంతో కర్ణాటక విజయం కాస్త ఆలస్యమైంది.మిగతా మ్యాచ్‌ల్లో గ్రూప్ ‘ఎ’లో జార్ఖండ్ ఇన్నింగ్స్ 196 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై జయభేరి మోగించింది. వడోదరలో వర్షం వల్ల బరోడా, ఉత్తర ప్రదేశ్ మ్యాచ్‌లో అసలు టాస్ కూడా పడలేదు. మ్యాచ్ పూర్తిగా వర్షార్పణమైంది. ‘బి’లో సౌరాష్ట్ర–మహారాష్ట్ర, పంజాబ్–గోవా, మధ్యప్రదేశ్–చండీగఢ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విహారి, మురాసింగ్‌ల పోరాటంతో... అగర్తలా: హనుమ విహారి (253 బంతుల్లో 141; 19 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ మణిశంకర్ మురాసింగ్ (130 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల పోరాటంతో త్రిపుర డ్రాతో గట్టెక్కడమే కాదు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. దీంతో గ్రూప్ ‘సి’లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర కీలకమైన 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 273/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన త్రిపుర 103.2 ఓవర్లలో 385 పరుగుల వద్ద ఆలౌటైంది. తద్వారా బెంగాల్ (336)పై తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు ఆధిక్యం లభించింది. మూడో రోజే విహారి శతక్కొట్టగా, ఆఖరి రోజు మురాసింగ్ వన్డేను తలపించే విధంగా ధాటిగా ఆడి సెంచరీ సాధించాడు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. విహారి అవుటయ్యాక టెయిలెండర్ రాణా దత్త (27; 4 ఫోర్లు) కూడా మురాసింగ్‌కు అండగా నిలిచాడు. బెంగాల్ బౌలర్లలో భారత వెటరన్ సీమర్ షమీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కైఫ్ 4, ఇషాన్ పొరెల్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బెంగాల్ 25 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు. శ్రమించి గెలిచిన హరియాణా అహ్మదాబాద్: గ్రూప్ ‘సి’లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సులువైన 62 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా హరియాణా తెగ కష్టపడింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి ఈ ఆరు పదుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. మొత్తానికి గ్రూప్ ‘సి’లోనే కాదు... ఈ సీజన్లోనే అన్ని గ్రూపుల్లో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా హరియాణా ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. మంగళవారం 113/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 60.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.ఇంకో 24 పరుగులు చేసి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ (2)ని పార్థ్‌వత్స (2/38), క్షితిజ్ పటేల్ (37; 2 ఫోర్లు)ను నిఖిల్ కశ్యప్ (4/59) అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఆధిక్యం పొందిన హరియాణా ముందు కేవలం 62 పరుగుల లక్ష్యమే ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హరియాణా టాప్–6 బ్యాటర్లు లక్ష్యయ్ (1), అంకిత్ (1), శాండిల్యా (3), నిశాంత్ (13), అమన్ (3), ధీరు సింగ్ (13)లను గుజరాత్ బౌలింగ్ త్రయం విశాల్ (3/23), సిద్ధార్థ్ దేశాయ్ (2/25), బిష్ణోయ్ (1/13) మూకుమ్మడిగా అవుట్ చేయడంతో 43 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. పార్థ్ వత్స (14 నాటౌట్), యశ్వర్ధన్ (13 నాటౌట్) అజేయంగా నిలువడంతో హరియాణా 4 వికెట్ల తేడాతో గెలిచి నిట్టూర్చింది. ఇదే గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల అద్భుత ప్రతిభతో ఉత్తరాఖండ్ 17 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందింది. 123 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు 71/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ 48.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు మాత్రమే చేసి మిగతా సగం (5) వికెట్లను కోల్పోయింది. మయాంక్ మిశ్రా (5/45), సుచిత్ (2/12), అవనీశ్ (2/27) సర్వీసెస్ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. -
పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ వివాహ బంధం.. అలా.. ముగిసింది!
ఒకరి కోసం ఒకరు పుట్టరు.. ఒకరి కోసం ఒకరు అని జతకడతారు! హిందీ హీరోయిన్ రీనా రాయ్.. పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ కూడా అలాగే ప్రేమించుకొని నిఖాతో జతకట్టారు! పెళ్లిళ్లు నిజంగానే స్వర్గంలో నిర్ణయం అయితే విడాకుల ప్రస్తావన ఉండేది కాదేమో! ఆకర్షణలు, అభిప్రాయాలు, జీవన శైలులు, సంస్కృతి, సంప్రదాయాలు, కులం, మతం వేదికగా జరుగుతాయి కాబట్టే వీటిల్లో ఏ ఒక్కటి సర్దుబాటు కాకపోయినా విడాకుల ప్రస్తావన.. పరిష్కారంగా ఉంటుంది. రీనా, మొహిసిన్ల ప్రేమ.. పెళ్లి కూడా అలాగే ముగిసిపోయింది. ఆ కథే ఈ వారం.. శత్రుఘ్న సిన్హాతో ప్రేమ వైఫల్యం రీనా రాయ్‌ను చాలా కలచివేసింది. సరిగ్గా ఆ సమయంలోనే పరిచయం అయ్యాడు.. మొహిసిన్ ఖాన్. అతని చెలిమి ఆమెకు గొప్ప ఊరటైంది. ఆ ఆదరణ ఆమె మనసుకు అయిన గాయాన్ని మాన్చేసింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. ఈ జంట తరచూ కలసుకోవడం.. కలసి బయటకు వెళ్లడం.. సహజంగానే సినిమా పత్రికలకు ఆసక్తిరేపాయి. రీనా, మొహిసిన్ డేటింగ్ అంటూ కథనాలనూ ప్రచురించాయి. అవి అటు క్రికెట్‌ను.. ఇటు బాలీవుడ్‌నూ ఆకర్షించాయి. కరాచీలో.. ఇరు రంగాల్లోని ఈ ఇరువురి అభిమానులు వీళ్ల ప్రేమకథనాలను ఆస్వాదిస్తూండగా.. ఆ జంట పెళ్లి వార్త బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ ఇద్దరూ కరాచీలో రహస్యంగా నిఖా చేసుకుని ముంబై వచ్చారు. ఆ టైమ్‌లో రీనా, మొహిసిన్ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థాయిలో ఉన్నారు. ‘మొహిసిన్ సంగతేమో కానీ ఈ పెళ్లితో రీనా తన కెరీర్‌కు తానే ఎండ్ కార్డ్ వేసుకుంది’ అని అభిప్రాయపడ్డారు ఆమె శ్రేయోభిలాషులంతా! వాళ్ల అంచనాలకు విరుద్ధంగా పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది రీనా. సర్దుకుపోవాల్సిందే.. బ్రిటిష్ పౌరసత్వంతో లండన్‌లో స్థిరపడాలనేది మొహిసిన్ ఖాన్ నిర్ణయం. అది రీనాకు నచ్చకపోయినా భర్త కోసం సరేననుకుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబై రావడం.. అయిపోగానే లండన్ వెళ్లిపోవడం ఆమె షెడ్యూల్లో భాగమయ్యాయి. ఈలోపు ఆ జంటకు బిడ్డ పుట్టింది. పాపను పెంచడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది రీనా. మొహిసిన్ నటించాలనుకున్నాడు. అతని ఉత్సాహానికి అడ్డు చెప్పలేదు రీనా. క్రికెటర్ మొహిసిన్ ఖాన్ బాలీవుడ్ స్క్రీన్ మీద హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ సినీ ప్రేక్షకులు అతణ్ణి పెద్దగా ఆదరించలేదు. దాంతో ఆ కుటుంబం లండన్, ముంబైల రాకపోకలు ఆగిపోయి లండన్‌లోనే ఉండడం మొదలైంది. అది రీనాకు చాలా కష్టమైపోయింది. అంతేకాదు మొహిసిన్ ఖాన్ విలాసవంతమైన జీవన శైలికీ ఆమె ఇబ్బంది పడింది. అప్పుడు తన తల్లికి ఫోన్ చేసింది ‘పెళ్లంటే ఏంటీ.. ఇలాగే ఉంటుందా?’ అని. ‘తప్పదు. సర్దుకుపోవాల్సిందే. అసలు పెళ్లంటేనే సర్దుబాటు’ అంటూ నచ్చచెప్పింది రీనా వాళ్లమ్మ. ప్రయత్నించింది రీనా. కానీ సఖ్యత కుదరలేదు. ఆ బంధం నిలవలేదు. కూతురి కస్టడీ మొహిసిన్ ఖాన్‌కే దక్కింది. రీనా తర్వాత మొహిసిన్ ఖాన్ మళ్లీ రెండుసార్లు వివాహబంధంలో ఇమిడే ప్రయత్నం చేశాడు. అప్పుడుగానీ బిడ్డ కస్టడీని రీనాకు అప్పగించలేదు కోర్టు. ఇప్పుడు ఆ కూతురు(సనమ్)తోనే కలసి ముంబైలో ఓ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తోంది రీనా. జీవితం పట్ల రిగ్రెట్స్గానీ లేవు, శత్రుఘ్న సిన్హా, మొహిసిన్ మీద కంప్లయింట్స్గానీ ఏమాత్రం లేవని చెప్తుంది రీనా రాయ్. - ఎస్సార్ -
పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు సహజం
వరుస అత్యాచార ఘటనలతో ఓ వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంటే, మరోవైపు అక్కడి అధికార పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉంటున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలోఅతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమేనంటూ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొహిసిన్ ఖాన్ గురువారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సెలవిచ్చారు. యువతీ యువకుల మధ్య సంబంధాలు చెడితే అత్యాచారం చేశారంటూ బాధిత మహిళలు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా ఉన్నాయని, కావాలంటే వెళ్లి గూగుల్ సెర్చ్‌లో వెతుక్కోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సెలవిచ్చారు. బడౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, చెట్టుకు ఉరివేసి హత్య..అత్యాచారాన్ని అడ్డుకుందని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు.. మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం.. తాజాగా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం, ఉరి ఇలా రాష్ట్రంలో వారం పది రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్బంగా ఆ ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం అఖిలేష్ యాదవ్ నిన్న పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా యూపీలో జరిగిన సంఘటనలను మీడియానే అధికంగా చేసి చూపుతోందంటూ ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, సీం అఖిలేష్ యాదవ్‌లు మీడియాపై రుసరుసలాడిన సంగతి తెలిసిందే.


