ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా రాజస్తాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మోహ్సిన్ తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.
జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైభవ్.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వైభవ్‌కు వేసిన మొహ్షిన్ ఖాన్.. ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా మలిచాడు.
తొలి ఐదు బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ సూర్యవంశీ, ఆరో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వైభవ్‌కు మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ ఖాన్ నిలిచాడు. అతడి ధాటికి వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.
చదవండి: PSL 2026: హైదరాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ


