హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ | Steve Smith Bags Maiden PSL Century Against Hyderabad | Sakshi
Sakshi News home page

PSL 2026: హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ

Apr 22 2026 10:39 PM | Updated on Apr 22 2026 10:39 PM

Steve Smith Bags Maiden PSL Century Against Hyderabad

పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో ముల్తాన్ సుల్తాన్స్ స్టార్‌ ఓపెనర్ స్టీవ్ స్మిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్స్‌తో మ్యాచ్‌లో స్మిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కరాచీ నేష‌న‌ల్ స్టేడియంలో స్మిత్‌ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.

హునైన్ షా వేసిన ఒకే ఓవర్‌లో స్మిత్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్ర‌మంలో స్మిత్ కేవలం 47 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న స్మిత్‌.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

ముల్తాన్ సుల్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదేవిధంగా స్మిత్‌కు ఇది తన టీ20 కెరీర్‌లో మూడువ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. సిడ్నీ సిక్సర్స్ తరపున చేసిన 125 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌..231 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement