Multan Sultans
-
ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లో గురువారం హైదరాబాద్ కింగ్స్‌మెన్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా, ఆసీస్ మహిళా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్ కామేంటేటర్లుగా వ్యవహరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లీసా స్తాలేకర్ మాటల సందర్భంగా రమీజ్ రాజాను హగ్ చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇది సరదాగా చేసినప్పటికీ బహిరంగంగా ఇలా ప్రవర్తించడం పట్ల క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు రమీజ్ రాజా, లీసా స్తాలేకర్ హగ్ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ఏఐ పుణ్యమా అని లీసా హగ్ ఇవ్వగానే రమీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టినట్లుగా వీడియో, ఫొటోలు బయటికి వచ్చాయి. అయితే ఇవన్నీ నకిలీ ఫొటోలని కాసేపటికే తేలిపోయింది. ఎందుకంటే వీరిద్దరు హగ్ చేసుకున్న అనంతరం రమీజ్ రాజా ముద్దు పెట్టినట్లుగా వీడియోలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియర్‌గా అర్థమైంది. అయితే రమీజ్ రాజాకు హగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారడంతో లీసా స్తాలేకర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చర్చకు దారి తీయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇందులో తప్పేముంది. ఏదో సరదాగా హగ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (69 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నవాజ్ 18 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 15.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మాజ్ సదాఖత్ (64 నాటౌట్), ఉస్మాన్ ఖాన్ (64) జట్టును గెలిపించారు.ఇక లీసా స్తాలేకర్ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా సేవ లందించిన ఈ ఆల్‌రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్‌లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.Lisa Sthalekar's Instagram story. pic.twitter.com/N7C4JVOBtq— Sheri. (@CallMeSheri1_) May 2, 2026WTFFFF pic.twitter.com/293RiGywFW— Invader🇵🇸- (@sshayaannn) April 29, 2026 -
హైదరాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో ముల్తాన్ సుల్తాన్స్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్స్‌తో మ్యాచ్‌లో స్మిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ హైదరాబాద్ బౌలర్లను ఉతికారేశాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో స్మిత్ బౌండరీల వర్షం కురిపించాడు.హునైన్ షా వేసిన ఒకే ఓవర్లో స్మిత్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో స్మిత్ కేవలం 47 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ముల్తాన్ సుల్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదేవిధంగా స్మిత్‌కు ఇది తన టీ20 కెరీర్లో మూడువ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. సిడ్నీ సిక్సర్స్ తరపున చేసిన 125 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన స్మిత్..231 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు -
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
ఆస్ట్రేలియా స్టార్, ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వాహకులపై కౌంటర్ వేశాడు. తమ జట్టులోని సభ్యులంతా ఓ దుప్పటి, దిండు వెంట తెచ్చుకుని ఉంటే బాగుండేందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌తో పోటీపడి చేతులు కాల్చుకుంటున్నా పీసీబీ తీరు మారడం లేదు. ఐపీఎల్‌కు ధీటుగా టోర్నీని నిర్వహించాలనే ఆశతో మ్యాచ్‌లు షెడ్యూల్ చేస్తున్న పీసీబీకి గతంలో చేదు అనుభవాలే మిగిలాయి. క్రేజ్, ప్రసార హక్కుల విషయంలో ఐపీఎల్ అందనంత ఎత్తులో ఉండటం.. పీసీబీకి ప్రతికూల ఫలితాలు ఇచ్చింది.అయినప్పటికీ ఈసారి కూడా పీసీబీ వెనక్కి తగ్గలేదు. ఐపీఎల్ కంటే రెండు రోజులు ముందుగా.. అనగా మార్చి 26న టోర్నీని ఆరంభించగా.. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాల్సిన దుస్థితి. ఇంధన సంక్షోభం, పెరిగిన ధరల భారం ఇందుకు కారణం.మరోవైపు.. పీఎస్ఎల్ షెడ్యూల్ రూపకల్పనలోనూ పీసీబీ దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఆదివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో క్వెట్టా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం.. అదే వేదికపై రావల్పిండిజ్‌తో ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు.ఈ నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడికైనా వెళ్లి.. ఓ బ్లాంకెట్, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోతే బాగుండేది. మా షెడ్యూల్ అలా ఉంది మరి’’ అని ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధించి అలసటను కాస్త మర్చిపోయిందని ఆష్టన్ టర్నర్ పేర్కొన్నాడు.కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ముల్తాన్ సుల్తాన్స్.. రావల్పిండిజ్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన టర్నర్ బృందం ఎనిమిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.చదవండి: అతడి గురించే మా చర్చ.. అస్సలు భయమేలేదు: హార్దిక్ పాండ్యా -
ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేనందుకు సిగ్గుపడను.: పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తాను మాట్లాడే ఇంగ్లిష్‌పై గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రిజ్వాన్ అర్దం పర్దం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడతాడని సోషల్‌మీడియా అతన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. రిజ్వాన్ ఏం మాట్లాడతాడో అర్దం కాక సొంత అభిమానులే జట్టు పీక్కుంటుంటారు. రిజ్వాన్ ఇంగ్లిష్ విషయంలో ఫారిన్ మీడియా బాధలు వర్ణణాతీతం. వారు ఓ ప్రశ్న అడిగితే అతను ఇంకేదో సమాధానం చెబుతాడు. ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోవడం రిజ్వాన్ తప్పు కానప్పటికీ నిందులు ఎదుర్కొంటున్నాడు.I don't care on win and learn qoute trolling , I am not Educated, mujhe English Nahi aati but mujhe taleem Hasil karna chaye thi : Muhammad Rizwan pic.twitter.com/VmqmeHhsx5— ٰImran Siddique (@imransiddique89) April 11, 2025తాజాగా ఈ విషయంపై రిజ్వాన్ స్పందించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 (PSL) ప్రారంభానికి ముందు మాట్లాడుతూ.. తాను చదువు కొనసాగించలేనందు వల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాను. చదువుకునే రోజుల్లో క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. చదువు పూర్తి చేయనందుకు చింతిస్తున్నాను. కానీ క్రికెటర్‌గా దాని గురించి సిగ్గుపడను. భాష సరిగ్గా లేకపోయినా నిజం మాట్లాడుతున్నందుకు గర్విస్తున్నాను.చదువు పూర్తి చేయలేనందుకు బాధగా ఉంటుంది కానీ, ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేనందుకు ఎప్పుడూ బాధ పడను. నా దేశంలో అభిమానులు నా నుండి మంచి క్రికెట్ మాత్రమే ఆశిస్తారు. వారు నా నుండి ఇంగ్లిష్ డిమాండ్ చేయరు. ఏదిఏమైనప్పటికీ అభిమానులు నన్ను క్షమించాలి. చదువు పూర్తి చేయనందుకే ఈ కష్టాలు.అందుకే యువ క్రికెటర్లు ప్రతిభను మెరుగుపరుచుకుంటూనే భాషపై దృష్టి పెట్టాలని చెబుతూ ఉంటాను. పాక్ జట్టు కూడా నా నుంచి మంచి క్రికెట్ మాత్రమే ఆశిస్తుంది. ఇంగ్లిష్ మాట్లాడే సామర్థ్యం కాదు. నాకు క్రికెట్‌ను వదిలి ఇంగ్లిష్ నేర్చుకునేంత సమయం కూడా లేదు. ఒకవేళ అభిమానులు నన్ను ఇంగ్లిష్ నేర్చుకోమని అడిగితే క్రికెట్‌ను వదిలేసి ప్రొఫెసర్ని అవుతానని అన్నాడు.కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో మహ్మద్ రిజ్వాన్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. అతను ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సుల్తాన్స్ ఇవాళ (ఏప్రిల్ 12) రాత్రి కరాచీ కింగ్స్‌తో తలపడుతుంది. పీఎస్ఎల్ గత సీజన్లో సుల్తాన్స్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓడిపోయింది. పీఎస్ఎల్ 2025 ఎడిషన్ నిన్ననే ప్రారంభమైంది. ఈసారి పాక్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌తో పోటీపడుతుంది. రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరుగుతున్నాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు.


