ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా! | Lisa Sthalekar Breaks Silence On Viral Ramiz Raja Hugging Video | Sakshi
Sakshi News home page

ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!

May 2 2026 4:57 PM | Updated on May 2 2026 5:20 PM

Lisa Sthalekar Breaks Silence On Viral Ramiz Raja Hugging Video

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్‌లో గురువారం హైద‌రాబాద్ కింగ్స్‌మెన్‌, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య ఎలిమినేట‌ర్ 1 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ మాజీ క్రికెట‌ర్ ర‌మీజ్ రాజా, ఆసీస్ మ‌హిళా మాజీ క్రికెట‌ర్ లీసా స్తాలేక‌ర్ కామేంటేట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో లీసా స్తాలేక‌ర్ మాట‌ల సంద‌ర్భంగా రమీజ్ రాజాను  హ‌గ్ చేసుకున్నారు. 

అయితే వీరిద్ద‌రు ఇది స‌రదాగా చేసిన‌ప్ప‌టికీ బ‌హిరంగంగా ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు ర‌మీజ్ రాజా, లీసా స్తాలేక‌ర్ హ‌గ్ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారిపోయింది. ఏఐ పుణ్య‌మా అని లీసా హ‌గ్ ఇవ్వ‌గానే ర‌మీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన‌ట్లుగా వీడియో, ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే ఇవ‌న్నీ న‌కిలీ ఫొటోల‌ని కాసేప‌టికే తేలిపోయింది. 

ఎందుకంటే వీరిద్ద‌రు హ‌గ్ చేసుకున్న అనంత‌రం ర‌మీజ్ రాజా ముద్దు పెట్టిన‌ట్లుగా వీడియోలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. అయితే ర‌మీజ్ రాజాకు హ‌గ్ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారడంతో లీసా స్తాలేక‌ర్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చ‌ర్చ‌కు దారి తీయ‌డం నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 

అస‌లు ఇందులో త‌ప్పేముంది. ఏదో స‌ర‌దాగా హ‌గ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. షాన్ మ‌సూద్ (69 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మ‌హ్మ‌ద్ న‌వాజ్ 18 ప‌రుగులు సాధించాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 15.2 ఓవ‌ర్ల‌లోనే 2 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. మాజ్ స‌దాఖ‌త్ (64 నాటౌట్‌), ఉస్మాన్ ఖాన్ (64) జ‌ట్టును గెలిపించారు.

ఇక లీసా స్తాలేకర్‌ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా సేవ లందించిన ఈ ఆల్‌రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్‌లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement