చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Sooryavanshi Shatters Long-Standing IPL Record, | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Apr 22 2026 9:35 PM | Updated on Apr 22 2026 10:31 PM

Vaibhav Sooryavanshi Shatters Long-Standing IPL Record,

ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ నిరాశ‌ప‌రిచాడు. వైభవ్‌ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను సూర్యవంశీ కోల్పోయాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్ సింగిల్ డిజిత్ స్కోరే పరిమితమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ కొట్టడంతో వైభవ్ ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 

వైభవ్ కేవలం  222 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాక్సీ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.
చదవండి: 'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

Advertisement
 
Advertisement
Advertisement