'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో' | Vaibhav Sooryavanshi "Demigod": Ajit Agarkar Sent Selection Plea | Sakshi
Sakshi News home page

'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

Apr 22 2026 8:28 PM | Updated on Apr 22 2026 8:33 PM

Vaibhav Sooryavanshi "Demigod": Ajit Agarkar Sent Selection Plea

క్రికెట్ ప్ర‌పంచానికి ప్ర‌స్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అత‌డే భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్‌ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్‌ను అతడు సూచించాడు.

"వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్‌కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్‌, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్‌కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.

ప్లేయింగ్ ఎలెవన్‌లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌పై ఒక అవగాహన వచ్చేది. వైభ‌వ్‌కు జాతీయ జ‌ట్టు త‌ర‌పున కూడా రాణించే స‌త్తాఉంది. బుమ్రా లాంటి బౌల‌ర్‌కు మొద‌టి బంతికి వైభ‌వ్ సిక్స్ బాదాడు. ఆ త‌ర్వాత హేజిల్‌వుడ్‌ను ఓ ఆడుకున్నాడు. 

బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెట‌ర్ భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు. అతనే సచిన్ టెండూల్క‌ర్‌. ఈ రోజు అత‌డిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభ‌వ్‌కు క్రికెట్‌లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ కేవ‌లం 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.
చదవండి: IPL 2026: ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌

Advertisement
 
Advertisement
Advertisement