Photo Credit: Twitter
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ కొత్త హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ‘ఎక్స్’ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే లంక దిగ్గజం మహేల జయవర్దనే ముంబై హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
అతడి స్థానంలో తాజాగా పొలార్డ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న పొలార్డ్ ఇకపై పూర్తిస్థాయి హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నాడు. 2010 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఆటగాడిగా కొనసాగిన పొలార్డ్ జట్టు గెలిచిన ఐదు టైటిల్స్‌లోనూ (2013, 2015, 2017, 2019, 2020) సభ్యుడిగా ఉన్నాడు.
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 2023 ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. తనను హెడ్‌కోచ్‌గా నియమించడంపై పొలార్డ్ స్పందించాడు. ‘‘ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవం. ముంబై నా జీవితంలో, కెరీర్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ జట్టుతో, ఆటగాళ్లతో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఒక ఆటగాడిగా, ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నాను.
ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ (నీలం-బంగారు రంగు) జెర్సీకి హెడ్‌కోచ్‌గా ప్రాతినిధ్యం వహించడం వల్ల బాధ్యత మరింత పెరిగినట్లయింది. నాపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాష్ అంబానీతో పాటు యావత్ ముంబై ఇండియన్స్ కుటుంబానికి నేను కృతజ్ఞుడను.
ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పనిచేస్తూ, జట్టు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, మన ప్రతిభను మరింతగా పెంచుతూ, పల్టాన్‌కు సంబరాలు చేసుకునేందుకు మరెన్నో కారణాలు అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను,” అని పొలార్డ్ అన్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో కీరన్ పొలార్డ్ 189 మ్యాచ్‌లాడి 3,412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్థసెంచరీలున్నాయి. ఇక బౌలింగ్‌లో 69 వికెట్లు పడగొట్టాడు.
Mumbai Indians elevate Kieron Pollard as Head Coach A defining figure in MI’s success, the remarkable 16-year association of Kieron Pollard within the #OneFamily enters a new chapter. Read more - https://t.co/ORZz4gruIr https://t.co/BMI38BYH1f
— Mumbai Indians (@mipaltan) October 24, 2026
ఇదీ చదవండి:


