breaking news
SA20 Auction
-
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో గంగూలీ మార్క్..
టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ.. ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా తన పనని మొదలు పెట్టాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 వేలంలో గంగూలీ తన మార్క్‌ను చూపించాడు. అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి వచ్చిన ప్రిటోరియా క్యాపిటల్స్.. తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ యజమాని కావ్య మారన్‌తో పోటీపడి మరి 1.7 మిలియన్ ర్యాండ్లు(సుమారు రూ. 85 లక్షలు)కు మహారాజ్‌ను ప్రిటోరియా దక్కించుకుంది. అతడిని సొంతం చేసుకోవడంలో గంగూలీది కీలక పాత్ర. ఆ తర్వాత సౌతాఫ్రికా టీ20 వేలంలో పది మిలియన్ ర్యాండ్లు దాటిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఐడెన్ మార్క్రమ్ కోసం కూడా ప్రిటోరియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ డర్బన్ సూపర్ జెయింట్స్ గట్టీ పోటీ ఇవ్వడంతో క్యాపిటల్స్ వెనక్కి తగ్గింది. మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.క్యాపిటల్స్‌లోకి బ్రెవిస్..ఇక మార్క్రమ్ను దక్కించుకోవడంలో విఫలమైన సౌరవ్ గంగూలీ.. సౌతాఫ్రికా సూపర్ స్టార్ డెవాల్డ్ బ్రెవిస్‌ను మాత్రం ఆఖరివరకు పోటీపడి మరి తమ జట్టులోకి తీసుకొచ్చాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఎస్ఎ టీ20 లీగ్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్ నిలిచాడు. బ్రెవిస్ కోసం జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా ఆఖరి వరకు ప్రయత్నించాడు. కానీ ప్రిటోరియా క్యాపిటల్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా గంగూలీ అండ్ కో ప్రోటీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడీని సైతం సొంతం చేసుకున్నారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ ఎంపికయ్యాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా గంగూలీ వ్యహరించిన సంగతి తెలిసిందే. -
వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్‌గా చరిత్ర
సౌతాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం (SAT20 Auction)లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా 2023లో ఎస్టీ20 లీగ్ మొదలు కాగా.. వరుసగా రెండు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ సాధించింది.అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మార్క్రమ్ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్ ఫైనల్ చేరగా.. ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాదికి ఇప్పటికే ఈ లీగ్‌లోని ఆరు జట్లు రిటెన్షన్ జాబితా విడుదల చేయగా.. మంగళవారం వేలానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎస్ఏటీ20 -2026 వేలంలో తొలుత ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.కాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ కెప్టెన్‌గా రెండుసార్లు టైటిల్ అందించిన ఘనత మార్క్రమ్కు ఉంది. అయితే, కారణమేమిటో తెలియదు గానీ.. వేలానికి ముందే సన్‌రైజర్స్‌తో అతడు బంధం తెంచుకున్నాడు. ఈ క్రమంలో వేలంలోకి రాగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.కాసేపటికే రికార్డు బద్దలుతద్వారా ఎస్‌ఏఈ టీ20 లీగ్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్‌గా మార్క్రమ్ రికార్డు సాధించాడు. అయితే, కాసేపటికే అతడి రికార్డును యువ తార డెవాల్డ్ బ్రెవిస్ బద్దలు కొట్టేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో లీగ్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్ చరిత్ర లిఖించాడు.అంతర్జాతీయ క్రికెట్లోనూకాగా ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడి.. 455 పరుగులు సాధించాడు. చివరగా అంటే 2025 సీజన్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. హిట్టర్‌గా పేరొందిన బ్రెవిస్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు.అయితే, సౌతాఫ్రికా తరపున టీ20లకే పరిమితమైన బ్రెవిస్.. ఈ ఏడాది టెస్టు, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 318 పరుగులు చేశాడు. ఇక ఆరు వన్డేల్లో 110, రెండు టెస్టుల్లో కలిపి 84 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గా ఉన్న ఐడెన్ మార్క్రమ్ ఈసారి డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 రిటెన్షన్స్ జాబితాసన్రైజర్స్ ఈస్టర్న్‌కేప్🏏ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్‌స్టో, ఏఎమ్ ఘజన్ఫర్, ఆడం మిల్నే.🏏రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్🏏వైల్డ్‌కార్డు: మార్కో యాన్సెన్ఎంఐ కేప్‌టౌన్🏏రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.🏏ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.జొహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్🏏రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా🏏ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్ప్రిటోరియా క్యాపిటల్స్🏏ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్ఫర్డ్డర్బన్ సూపర్ జెయింట్స్🏏ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్🏏రిటైన్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్🏏వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్పర్ల్ రాయల్స్🏏రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్🏏ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్.చదవండి: ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్