
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం-2026 (SA20 Auction) ముగిసింది. వచ్చే ఏడాది జరిగే ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీ కోసం ఆరు జట్లు తమ ఆటగాళ్లను ఖరారు చేసుకున్నాయి. జొహన్నస్‌బర్గ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేలంపాటలో ప్రొటిస్ యువ తరంగం డెవాల్డ్ బ్రెవిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ప్రిటోరియా క్యాపిటల్స్ బ్రెవిస్ (Dewald Brevis)ను రూ. 8.31 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అంతకంటే ముందు డర్బన్ సూపర్ జెయింట్స్.. సౌతాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకుంది.
టాప్-5 ఖరీదైన ప్లేయర్లు వీరే
ఈ నేపథ్యంలో ఎస్‌ఏటీ20 చరిత్రలో ఖరీదైన ఆటగాళ్లుగా బ్రెవిస్, మార్క్రమ్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో వియాన్ ముల్దర్ (రూ. 4.50 కోట్లు- జోబర్గ్ సూపర్ కింగ్స్), గెరాల్డ్ కోయెట్జి (రూ. 3.73 కోట్లు- డర్బన్ సూపర్ జెయింట్స్), నండ్రీ బర్గర్ (రూ. 3.20 కోట్లు- జొబర్గ్ సూపర్ కింగ్స్) నిలిచారు.
మరి.. ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు.. వెరసి వచ్చే ఏడాది ఆరు ఫ్రాంఛైజీలకు సంబంధించి ఖరారైన జట్ల వివరాలు తెలుసుకుందామా?!
సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్
👉ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్‌స్టో, ఏఎమ్ ఘజన్‌ఫర్, ఆడం మిల్నే.
👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్
👉వైల్డ్‌కార్డు: మార్కో యాన్సెన్
ఎంఐ కేప్‌టౌన్
👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.
👉ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.
జొహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్
👉రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా
👉ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్
ప్రిటోరియా క్యాపిటల్స్
👉ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్
పర్ల్ రాయల్స్
👉రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్
👉ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్.
డర్బన్ సూపర్ జెయింట్స్
👉ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్
👉రిటైన్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్
👉వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్
వేలం ముగిసిన తర్వాత పూర్తి జట్లు
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు
ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, జానీ బెయిర్‌స్టో, AM ఘజన్‌ఫర్, ఆడమ్ మిల్నే, క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్జ్‌కే, అన్రిచ్ నోర్ట్జే, సెనురాన్ ముత్తుసామి, పాట్రిక్ క్రూగర్, లూథో సిపమ్లా, మిచెల్ వాన్ బ్యూరెన్, జోర్డాన్ హర్మన్, బేయర్స్ స్వనేపోల్, జేమ్స్ కోల్స్, క్రిస్ వుడ్, లూయిస్ గ్రెగరీ, సీజే కింగ్, జేపీ కింగ్.
ఎంఐ కేప్‌టౌన్ జట్టు
ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, కగిసో రబడా, నికోలస్ పూరన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, ట్రిస్టన్ లూస్, జాసన్ స్మిత్, టామ్ మూర్స్, డేన్ పీడ్ట్, టియాన్ వాన్ వారెన్, డాన్ లటేగన్, తబ్రేజ్ షంసీ, కరీం జనత్, జాకెవ్స్ స్నీమాన్.
జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు
ఫాఫ్ డు ప్లెసిస్, డోనోవన్ ఫెరీరా, జేమ్స్ విన్స్, అకేల్ హోసేన్, రిచర్డ్ గ్లీసన్, వియాన్ ముల్దర్, నండ్రీ బర్గర్, ప్రేనాలెన్ సుబ్రేయన్, డయాన్ ఫారెస్టర్, స్టీవ్ స్టోక్, జాంకో స్మిత్, నీల్ టిమ్మర్స్, శుభమ్ రంజానే, బ్రాండన్ కింగ్, రీలీ రొసోవ్, రివాల్డో మూన్‌సామీ, ఇమ్రాన్ తాహిర్, రీస్ టోప్లీ.
ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు
ఆండ్రీ రస్సెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి, డెవాల్డ్ బ్రెవిస్, లిజాద్ విలియమ్స్, క్రెయిగ్ ఓవర్‌టన్, సాకిబ్ మహమూద్, కోడీ యూసుఫ్, కానర్ ఈస్టర్‌హుజెన్, బ్రైస్ పార్సన్స్, గిడియాన్ పీటర్స్, జునైద్ దావూద్, విల్ స్మీడ్, మీకా- ఈల్ ప్రిన్స్, బయాండా మజోలా, విహాన్ ల్యూబ్, సిబోనెలో మఖాన్య.
పర్ల్ రాయల్స్ జట్టు
లువాన్-డ్రే ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జోర్న్ ఫార్చూయిన్, రూబిన్ హెర్మాన్, సికందర్ రజా, ముజీబ్-ఉర్-రహమాన్, ఒట్నీల్ బార్ట్‌మాన్, గుడకేష్ మోటీ, డెలానో పోట్‌గీటర్, కైల్ వెర్రెయిన్, కీగన్ లయన్-కాచెట్, అసా ట్రూడ్, హార్డస్ విల్‌జోన్, జాకన్ జొహన్స్ బేసర్, డాన్ లారెన్స్, ఇషాన్ మలింగ, ఎన్‌కొబానీ మొకొయెనా, విశేన్ హలాంబగే, ఎన్‌కబా పీటర్.
డర్బన్ సూపర్ జెయింట్స్
నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్క్వెస్ అకెర్‌మాన్, ఈథన్ బాష్, ఆండిలే సిమెలానే, టోనీ డీ జోర్జి, డయాన్ గలీమ్, తైజుల్ ఇస్లాం, ఎవాన్ జోన్స్, గిస్‌బెర్ట్ వేజ్, డేవిడ్ వీస్, డారిన్ డుపావిలోన్.
చదవండి: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్‌కు కూడా మంచి ఛాన్స్’