
శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ (PC: BCCI)
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 టోర్నీ మంగళవారం మొదలైంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.
అనంతరం సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్‌తో సూర్యకుమార్ సేన తమ లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా యువ స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అరంగేట్రంలోనే డకౌట్.. ఆ తర్వాత
కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్‌లో సత్తా చాటి.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రంలోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు.
ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో ఓపెనర్‌గా పాతుకుపోయిన అభిషేక్.. ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లలో కలిపి 33కు పైగా సగటుతో 193కు పైగా స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ
ఇక మరోవైపు.. దాదాపు ఏడాది కాలం తర్వాత వైస్ కెప్టెన్‌గా టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. టెస్టుల్లో ఇప్పటికే సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.
యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు
ఇక ఆసియా కప్-2025లో తొలి మ్యాచ్‌కు అభిషేక్, గిల్ సిద్ధమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘యూఏఈ పిచ్‌లపై కూడా అభిషేక్ శర్మ దూకుడైన ఆట కొనసాగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా అతడో సూపర్ ప్లేయర్. యువరాజ్ సింగ్ అప్‌గ్రేడ్ వర్షన్ లాంటోడు.
గిల్‌కు మంచి అవకాశం
ఇక ఈ టోర్నీలో పరుగులు చేయాలనే ఒత్తిడి శుబ్‌మన్ గిల్‌పై తప్పక ఉంటుంది. 140- 150కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఈసారి ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడు అయ్యేందుకు గిల్‌కు మంచి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2025లో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా.. 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. 15 మ్యాచ్‌లు ఆడి 650 పరుగులతో టాప్-4లో నిలిచాడు.