సౌతాఫ్రికాతో తొలి టీ20కి ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టు
భారత్- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.
టెస్టు సారథి గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించిన గిల్.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
మరోవైపు.. ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
జితేశ్ శర్మకే ప్రాధాన్యం
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్‌పై వేటు తప్పదన్న పఠాన్.. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.
శివం దూబేకు నో ఛాన్స్
అదే విధంగా.. హార్దిక్ వల్ల ఓ ఆల్‌రౌండర్‌కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌తో పాటు.. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్ పఠాన్.. శివం దూబేకు ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు.
ఇర్ఫాన్ ఓటు అర్ష్‌కే
ఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్ హర్షిత్ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్‌పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలనని హర్షిత్ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్‌దీప్‌కే ఓటు వేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టు
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.


