సన్‌రైజర్స్‌లోకి పాక్‌ ప్లేయర్‌.. ఆర్సీబీ కింగ్‌ మేకర్‌ సంచలన కామెంట్స్‌ | RCB Kingmaker Issues Brutal Verdict As SRH Owner Signs Abrar Ahmed In The Hundred | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌లోకి పాక్‌ ప్లేయర్‌.. ఆర్సీబీ కింగ్‌ మేకర్‌ సంచలన కామెంట్స్‌

Mar 13 2026 11:42 AM | Updated on Mar 13 2026 11:52 AM

RCB Kingmaker Issues Brutal Verdict As SRH Owner Signs Abrar Ahmed In The Hundred

హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో భారత యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను తీసుకోవడంపై భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో పెద్ద దుమారం రేగుతుంది. పాక్‌ ఆటగాడిని ఎలా తీసుకుంటారంటూ భారత క్రికెట్‌ అభిమానులు సన్‌రైజర్స్‌, ఆ ఫ్రాంచైజీ కో ఓనర్‌ కావ్యా మారన్‌పై సోషల్‌మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ తట్టుకోలేక ఎక్స్‌ ఏకంగా సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఖాతానే సస్పెండ్‌ చేసింది.

ఈ క్రమంలో ఆర్సీబీ గత ఎడిషన్‌లో (2025) ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర (హెడ్‌ కోచ్‌గా) పోషించిన ఆండీ ఫ్లవర్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాక్‌ ఆటగాళ్లను తీసుకుంటే తప్పేంటి అని అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు.

అతడి మాటల్లో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హండ్రెడ్‌ లాంటి లీగ్‌ల్లో ఉస్మాన్‌ తారిక్‌, అబ్రార్‌ అహ్మద్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ‌ఆడటం శుభపరిణామం. వీరి చేరిక పోటీని మరింత రసవత్తరంగా మారుస్తుంది. 

ఆండీ ఫ్లవర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కావ్యా మారన్‌ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నాయి. క్రీడలకు ఇతర విషయాలతో సంబంధం ఉండకూడదన్న విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆండీ ఫ్లవర్‌ ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా ఉండటంతో పాటు హండ్రెడ్‌ లీగ్‌లోని లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీకి కూడా హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌ తొట్టతొలి వేలంలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అబ్రార్‌ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీగా సన్‌రైజర్స్‌ లీడ్స్‌ నిలిచింది.

ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.

ఈ వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement