కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్),అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే


