
టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ.. ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా తన పనని మొదలు పెట్టాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 వేలంలో గంగూలీ తన మార్క్‌ను చూపించాడు. అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి వచ్చిన ప్రిటోరియా క్యాపిటల్స్.. తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను సొంతం చేసుకుంది.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ యజమాని కావ్య మారన్‌తో పోటీపడి మరి 1.7 మిలియన్ ర్యాండ్లు(సుమారు రూ. 85 లక్షలు)కు మహారాజ్‌ను ప్రిటోరియా దక్కించుకుంది. అతడిని సొంతం చేసుకోవడంలో గంగూలీది కీలక పాత్ర. ఆ తర్వాత సౌతాఫ్రికా టీ20 వేలంలో పది మిలియన్ ర్యాండ్లు దాటిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఐడెన్ మార్‌క్రమ్ కోసం కూడా ప్రిటోరియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ డర్బన్ సూపర్ జెయింట్స్ గట్టీ పోటీ ఇవ్వడంతో క్యాపిటల్స్ వెనక్కి తగ్గింది. మార్‌క్రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.
క్యాపిటల్స్‌లోకి బ్రెవిస్..
ఇక మార్‌క్రమ్‌ను దక్కించుకోవడంలో విఫలమైన సౌరవ్ గంగూలీ.. సౌతాఫ్రికా సూపర్ స్టార్ డెవాల్డ్ బ్రెవిస్‌ను మాత్రం ఆఖరివరకు పోటీపడి మరి తమ జట్టులోకి తీసుకొచ్చాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
దీంతో ఎస్ఎ టీ20 లీగ్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్ నిలిచాడు. బ్రెవిస్ కోసం జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా ఆఖరి వరకు ప్రయత్నించాడు. కానీ ప్రిటోరియా క్యాపిటల్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా గంగూలీ అండ్ కో ప్రోటీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడీని సైతం సొంతం చేసుకున్నారు.
కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ ఎంపికయ్యాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా గంగూలీ వ్యహరించిన సంగతి తెలిసిందే.