వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్‌ బ్రెవిస్‌.. కాస్ట్‌లీ ప్లేయర్‌గా చరిత్ర | SA20 2026 Auction: Brevis Breaks Markram Most expensive player Record | Sakshi
Sakshi News home page

వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్‌ బ్రెవిస్‌.. కాస్ట్‌లీ ప్లేయర్‌గా చరిత్ర

Sep 9 2025 6:37 PM | Updated on Sep 9 2025 7:09 PM

SA20 2026 Auction: Brevis Breaks Markram Most expensive player Record

సౌతాఫ్రికా యువ క్రికెటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వేలం (SAT20 Auction)లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా 2023లో ఎస్‌టీ20 లీగ్‌ మొదలు కాగా.. వరుసగా రెండు సీజన్లలో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ టైటిల్‌ సాధించింది.

అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మార్క్రమ్‌
ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌ ఫైనల్‌ చేరగా.. ఎంఐ కేప్‌టౌన్‌ తొలిసారి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాదికి ఇప్పటికే ఈ లీగ్‌లోని ఆరు జట్లు రిటెన్షన్‌ జాబితా విడుదల చేయగా.. మంగళవారం వేలానికి షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఏటీ20 -2026 వేలంలో తొలుత ఐడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.

కాగా సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ కెప్టెన్‌గా రెండుసార్లు టైటిల్‌ అందించిన ఘనత మార్క్రమ్‌కు ఉంది. అయితే, కారణమేమిటో తెలియదు గానీ.. వేలానికి ముందే సన్‌రైజర్స్‌తో అతడు బంధం తెంచుకున్నాడు. ఈ క్రమంలో వేలంలోకి రాగా.. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.

కాసేపటికే రికార్డు బద్దలు
తద్వారా ఎస్‌ఏఈ టీ20 లీగ్‌ చరిత్రలో ఖరీదైన ప్లేయర్‌గా మార్క్రమ్‌ రికార్డు సాధించాడు. అయితే, కాసేపటికే అతడి రికార్డును యువ తార డెవాల్డ్‌ బ్రెవిస్‌ బద్దలు కొట్టేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో లీగ్‌ హిస్టరీలోనే కాస్ట్‌లీ ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్‌ చరిత్ర లిఖించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోనూ
కాగా ఐపీఎల్‌లో 2022లో అరంగేట్రం చేసిన డెవాల్డ్‌ బ్రెవిస్‌.. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడి.. 455 పరుగులు సాధించాడు. చివరగా అంటే 2025 సీజన్‌లో అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. హిట్టర్‌గా పేరొందిన బ్రెవిస్‌ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు.

అయితే, సౌతాఫ్రికా తరపున టీ20లకే పరిమితమైన బ్రెవిస్‌.. ఈ ఏడాది టెస్టు, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 318 పరుగులు చేశాడు. ఇక ఆరు వన్డేల్లో 110, రెండు టెస్టుల్లో కలిపి 84 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గా ఉన్న ఐడెన్‌ మార్క్రమ్‌ ఈసారి డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025 రిటెన్షన్స్‌ జాబితా
సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌
🏏ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్‌స్టో, ఏఎమ్‌ ఘజన్‌ఫర్‌, ఆడం మిల్నే.
🏏రిటైన్డ్‌ ప్లేయర్లు: ట్రిస్టన్‌ స్టబ్స్‌
🏏వైల్డ్‌కార్డు: మార్కో యాన్సెన్‌

ఎంఐ కేప్‌టౌన్‌
🏏రిటైన్డ్‌ ప్లేయర్లు: ట్రెంట్‌ బౌల్ట్‌, రషీద్‌ ఖాన్‌, రియాన్‌ రికెల్టన్‌, కగిసో రబడ, జార్జ్‌ లిండే, కార్బిన్‌ బాష్‌.
🏏ముందస్తు ఒప్పందం: నికోలస్‌ పూరన్‌.

జొహన్నస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌
🏏రిటైన్డ్‌ ప్లేయర్లు: ఫాఫ్‌ డుప్లెసిస్‌, డొనొవాన్‌ ఫెరీరా
🏏ముందస్తు ఒప్పందం: జేమ్స్‌ విన్స్‌, అకీల్‌ హొసేన్‌

ప్రిటోరియా క్యాపిటల్స్‌
🏏ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్‌, విల్‌ జాక్స్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌

డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌
🏏ముందస్తు ఒప్పందం: సునిల్‌ నరైన్‌
🏏రిటైన్డ్‌ ప్లేయర్లు: నూర్‌ అహ్మద్‌
🏏వైల్డ్‌ కార్డ్‌: హెన్రిచ్‌ క్లాసెన్‌

పర్ల్‌ రాయల్స్‌
🏏రిటైన్డ్‌ ప్లేయర్లు: లువామన్‌-డి- ప్రిటోరియస్‌, డేవిడ్‌ మిల్లర్‌, జార్జ్‌ ఫార్చూన్‌
🏏ముందస్తు ఒప్పందం: సికందర్‌ రజా, ముజీబ్‌-ఉర్‌- రహమాన్‌.

చదవండి: ఆల్‌టైమ్‌ ఆసియా టీ20 జట్టు: భారత్‌ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement