నికోల్స్‌ అద్వితీయ పోరాటం​.. భారత్‌పై సూపర్‌ శతకం | Henry Nicholls Surpasses Williamson: All Records He Created With Century In IND vs NZ 1st Test | Sakshi
Sakshi News home page

నికోల్స్‌ అద్వితీయ పోరాటం​.. భారత్‌పై సూపర్‌ శతకం

Nov 19 2026 10:41 AM | Updated on Nov 19 2026 10:52 AM

Henry Nicholls Surpasses Williamson: All Records He Created With Century In IND vs NZ 1st Test

source: X

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్‌తో ఇవాళ మొదలైన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ వన్‌ డౌన్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ అద్వితీయ పోరాటం చేస్తున్నాడు. ఓ పక్క వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి అద్భుతమైన సెంచరీ పూర్తి చేశాడు. 

ఏడో నంబర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (86)తో కలిసి జట్టును గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నాడు. 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి 225-5 స్కోర్‌ వరకు తీసుకొచ్చాడు. నికోల్స్‌-ఫిలిప్స్‌ ఆరో వికెట్‌కు అజేయమైన 155 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

నిప్పులు చెరిగిన పేసర్లు
ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా, పేసర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా బుమ్రా (3 వికెట్లు) ఆది నుంచే వికెట్లు తీస్తూ న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. అతడికి అన్షుల్‌ కంబోజ్‌, ఆకాశ్‌దీప్‌ (తలో వికెట్‌) కూడా సహకరించడంతో న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 0, కాన్వే 4, రచిన్‌ రవీంద్ర 15, డారిల్‌ మిచెల్‌ 1, టామ్‌ బ్లండెల్‌ 5 పరుగులు చేసి ఔటయ్యారు.

అరుదైన ఘనతలు
నికోల్స్‌ తన కెరీర్‌లో 12వ సెంచరీ పూర్తి చేసిన క్రమంలో పలు అరుదైన ఘనతలు సాధించాడు. 

- బేసిన్ రిజర్వ్ మైదానంలో భారత్‌పై న్యూజిలాండ్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు (103) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు కేన్ విలియమ్సన్ (89)పేరిట ఉండేది.

- అలాగే ఈ వేదికపై భారత్‌పై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి టెస్టు సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గానూ నిలిచాడు.

- బేసిన్ రిజర్వ్‌లో 1000 టెస్ట్‌ పరుగుల మైలురాయిని అందుకున్న న్యూజిలాండ్ ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో జాన్ రైట్, మార్టిన్ క్రో, బ్రెండన్ మెకల్లమ్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ ఈ ఘనత సాధించారు.

- భారత్‌పై టెస్టుల్లో శతకం సాధించిన 28వ న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

- బేసిన్ రిజర్వ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ తరఫున ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (ఫిలిప్స్‌తో కలిసి 155 పరుగులు*) నెలకొల్పిన జోడీగా నిలిచారు.

ఇదీ చదవండి: IND VS NZ 1st Test: బుమ్రా అరుదైన ఘనత


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement