
జస్ప్రీత్ బుమ్రా.. యార్కర్లకు పెట్టింది పేరు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఐపీఎల్ ఏ ప్లాట్‌ఫామ్ అయినా బుమ్రాను మించిన బౌలర్ మరొకరు లేరు. అతడు సంధించే బంతులు మిస్సైల్‌లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
ఇప్పుడు ఆ అనుభవం వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్‌కు ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా మ్యాజిక్ చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో బుమ్రా వేసిన యార్కర్‌కు గ్రీవ్స్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.
ఆ ఓవర్‌లో ఆఖరిని బంతిని బుమ్రా అద్బుతమైన యార్కర్‌గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని బ్యాట్‌తో ఆపడంలో గ్రీవ్స్ విఫలమయ్యాడు. అతడు బ్యాట్ కిందకు దించడంలో ఆలస్యం కావడంతో 142.7 కి.మీ వేగంతో పడిన బంతిని ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు కరేబియన్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. సిరాజ్, బుమ్రాతో పాటు కుల్దీప్ రెండు, సుందర్ ఓ వికెట్ సాధించారు. విండీస్ బ్యాటర్లలో గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Two fiery deliveries, two similar results 🔥🔥
Jasprit Bumrah, you absolute beauty!#TeamIndia @IDFCfirstbank | @Jaspritbumrah93 pic.twitter.com/JNcPGJxK8I— BCCI (@BCCI) October 2, 2025