దక్షిణ మధ్య రైల్వే జట్టుకు టైటిల్‌ | SCR women bag title in Kabaddi Championship | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వే జట్టుకు టైటిల్‌

Oct 27 2018 10:01 AM | Updated on Oct 27 2018 10:01 AM

SCR women bag title in Kabaddi Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా రైల్వే మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్‌ లోని రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఎస్‌సీఆర్‌ 37–17తో సెంట్రల్‌ రైల్వేపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో వెస్ట్రన్‌ రైల్వే, నార్తర్న్‌ రైల్వే వరుసగా 3, 4 స్థానాలను సాధించాయి. బహుమతి ప్రధానోత్సవంలో ఎస్‌సీఆర్‌ జీఎం వినోద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ వరదన్, హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement