జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వేస్, హరియాణా జట్లు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. ఆతిథ్య తెలంగాణ జట్టు పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. హైదరాబాద్‌లోని గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ జట్టు 25–42తో పంజాబ్ జట్టు చేతిలో ఓడిపోయింది.
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రైల్వేస్ 46–27 పాయింట్ల తేడాతో కర్ణాటక జట్టుపై, హరియాణా 50–19 విదర్భ జట్టుపై, మహారాష్ట్ర 42–36తో గోవా జట్టుపై, మధ్యప్రదేశ్ 41–36తో ఢిల్లీ జట్టుపై, చండీగఢ్ 45–39తో ఉత్తరప్రదేశ్ జట్టుపై, తమిళనాడు 34–30తో రాజస్తాన్ జట్టుపై, హిమాచల్ ప్రదేశ్ 67–22తో గుజరాత్ జట్టుపై విజయం సాధించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో మహారాష్ట్రతో ఇండియన్ రైల్వేస్, హరియాణాతో మధ్యప్రదేశ్, తమిళనాడుతో చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పంజాబ్ తలపడతాయి.


