ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్ర జట్ల ఓటమి | andhra teams defeated in national kabaddi championship quarter final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్ర జట్ల ఓటమి

Jan 4 2018 10:23 AM | Updated on Jan 4 2018 10:23 AM

andhra teams defeated in national kabaddi championship quarter final - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో తెలంగాణ జట్లు లీగ్‌ దశలోనే నిష్క్రమించగా... ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ) పురుషుల, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ 31–52తో ఉత్తరాఖండ్‌ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో కర్ణాటక 37–27తో తమిళనాడుపై గెలుపొందింది.

మహిళల విభాగంలో కేరళ 31–21తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మహిళల ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో ఇండియన్‌ రైల్వేస్‌ 37–19తో ఢిల్లీపై, ఉత్తర్‌ప్రదేశ్‌ 45–12తో ఒడిశాపై, పంజాబ్‌ 33–19తో బిహార్‌పై, ఛత్తీస్‌గఢ్‌ 27–23తో కర్ణాటకపై, హరియాణా 31–22తో చండీగఢ్‌పై, హిమాచల్‌ ప్రదేశ్‌ 24–21తో తమిళనాడుపై, మహారాష్ట్ర 41–21తో పశ్చిమ బెంగాల్‌పై విజయం సాధించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement