
ప్రో కబడ్డీ లీగ్ (PKL) సీజన్ 12 ఆగస్టు 29న వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఆరంభ వేడుకలో భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. వైభవ్ చేతల మీదుగా ఈ కబడ్డీ పండుగ లాంచ్ కానుంది.
ఈ వేడుకలో కబడ్డీ దిగ్గజం పర్దీప్ నర్వాల్‌కు (డుబ్కీ కింగ్) ప్రత్యేక సన్మానం జరగనుంది. PKL చరిత్రలో అత్యధిక రైడ్ పాయింట్లు (1801) సాధించిన నర్వాల్.. తన ఆటతీరుతో కబడ్డీకి కొత్త ఒరవడి తీసుకొచ్చాడు. అతని సేవలకు గుర్తుగా ప్రారంభ వేడుకలో ఘనంగా సత్కరించనున్నారు.
ఈ వేడుకలు ఆగస్టు 29వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. రైడర్ల జంప్‌లా, ఈ వేడుకపై అభిమానుల అంచనాలు కూడా అంబారాన్ని అంటుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ, పర్దీప్ నర్వాల్‌ను ఒకే వేదికపై చూసేందుకు క్రికెట్, కబడ్డీ అభిమానులు తహతహలాడుతున్నారు.
కబడ్డీ అభిమానుల దృష్టంతా వైభవ్‌పైనే ఉంది. వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టించి, క్రికెట్‌తో పాటు యావత్ క్రీడా ప్రపంచాన్నంతా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్ మొత్తం మెరుపులు మెరిపించిన వైభవ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు.
తొలి రోజు మ్యాచ్‌లు
తెలుగు టైటాన్స్ vs తమిళ తలైవాస్
బెంగళూరు బుల్స్ vs పునేరి పల్టన్