Pro Kabaddi League
-
హెడ్‌కోచ్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో రెండోసారి చాంపియన్‌గా అవతరించేందుకు యు ముంబా జట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి మూడు సీజన్లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు ఒకసారి విజేతగా (2015లో), రెండుసార్లు రన్నరప్‌గా (2014, 2016) నిలిచిన యు ముంబా జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. గత మూడు సీజన్లలో అయితే యు ముంబా జట్టు పూర్తిగా నిరాశపరిచింది. రెండుసార్లు పదో స్థానంలో, ఒకసారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.ఈ నేపథ్యంలో యు ముంబా మళ్లీ టైటిల్ ట్రాక్‌లో పడాలనే ఉద్దేశంలో ఫ్రాంచైజీ శిక్షణ బృందంలో మార్పులు చేసింది. భారత జట్టు మాజీ కెప్టెన్, మూడు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు రాకేశ్ కుమార్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. మూడో పీకేఎల్ సీజన్లో యు ముంబా జట్టుతో చేరిన రాకేశ్... అంతకుముందు పట్నా పైరేట్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2017లో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.‘కింగ్ ఆఫ్ కబడ్డీ’గా పేరొందిన రాకేశ్‌ను తమ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించినందుకు ఆనందంగా ఉందని యు ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. ‘ఈసారి హెడ్ కోచ్‌గా యు ముంబా జట్టుతో చేరినందుకు సంతోషంగా ఉంది. వచ్చే సీజన్లో యు ముంబాకు మంచి ఫలితాలు అందించేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని 41 ఏళ్ల రాకేశ్ వ్యాఖ్యానించాడు. గతంలో హరియాణా స్టీలర్స్ జట్టుకు, ఇండియన్ రైల్వేస్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రాకేశ్ 2006, 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరిన్ని క్రీడా వార్తలువరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీకి కైనన్ న్యూఢిల్లీ: హైదరాబాద్ సీనియర్ ట్రాప్ షూటర్ కైనన్ చెనాయ్ ఈ సీజన్‌ను వరల్డ్ కప్ టోర్నీతో మొదలు పెట్టనున్నాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే సీజన్ మూడో వరల్డ్‌కప్‌లో పాల్గొనే 12 మంది సభ్యులతో కూడిన భారత షాట్‌గన్ జట్టును సోమవారం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. సైప్రస్ రాజధాని నికోసియాలో మే 3 నుంచి 12వ తేదీ వరకు ఈ సీజన్‌లోని మూడో షాట్‌గన్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగుతుంది.జాతీయ సెలెక్షన్ పాలసీ ప్రకారం భారత ర్యాంకింగ్స్‌లో 4 నుంచి 6 స్థానాల మధ్య ఉన్న షూటర్లను మూడో వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేశారు. 34 ఏళ్ల కైనన్ 2016 రియో ఒలింపిక్స్‌లో ట్రాప్ ఈవెంట్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. గత 15 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కైనన్ తన కెరీర్లో వరల్డ్ కప్ టోర్నీలలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి 3 పతకాలు... ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 4 పతకాలు సాధించాడు. అర్జెంటీనా, పెరూలలో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఈవెంట్స్‌తో కూడిన రెండు వరల్డ్‌కప్‌లు జరుగుతాయి. అనంతరం సైప్రస్‌లో కేవలం షాట్‌గన్ ఈవెంట్లో మాత్రమే వరల్డ్‌కప్ జరుగుతుంది.భారత షూటింగ్ జట్టు: పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగం: కైనన్ చెనాయ్, శార్దుల్ విహాన్, భౌనీశ్ మెండిరట్టాపురుషుల స్కీట్ విభాగం: మేరాజ్ అహ్మద్ ఖాన్, అభయ్ సింగ్ సెఖోన్, రితురాజ్ సింగ్ బుండేలామహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగం: సబీరా హారిస్, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి. మహిళల స్కీట్ విభాగం: యశస్వి రాథోడ్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్ట్రాప్ మిక్స్డ్ టీమ్: కైనన్ చెనాయ్, సబీరా హారిస్, శార్దుల్ విహాన్, కీర్తి గుప్తా. భారత మహిళల జట్టుకు తొలి ఓటమి షార్జా: పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. రష్యా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రష్యా తరఫున గ్లాఫిరా జుకోవా (25వ నిమిషంలో), వాలెంటీనా స్మిర్నోవా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న రష్యా జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది.తొలి మూడు నిమిషాల్లోనే రష్యా గోల్ చేసినంత పని చేసింది. కానీ రష్యా ప్లేయర్లు కొట్టిన షాట్లు గురి తప్పాయి. భారత్ తరఫున మనీషా 31వ నిమిషంలో కొట్టిన షాట్‌ను రష్యా గోల్‌కీపర్ కీరా పెతుకోవా నిలువరించింది. రెండో అర్ధభాగంలో భారత జట్టు పక్కా ప్రణాళికతో ఆడి రష్యా జోరుకు అడ్డకట్ట వేసింది. అయితే ఇంజ్యూరీ సమయంలో మరో గోల్‌ను సమర్పించుకుంది.భారత జట్టుకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్‌లో 68 నిమిషాలు మైదానంలో ఉంది. ఆ తర్వాత సౌమ్య స్థానంలో మౌసుమి ముర్ము సబ్‌స్టిట్యూట్‌గా వచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 69వ స్థానంలో ఉన్న భారత జట్టు ఈ టోర్నీలోని తొలి మ్యాచ్‌లో 2–0తో జోర్డాన్ జట్టుపై గెలిచింది. భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను బుధవారం దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. -
ప్రొ కబడ్డీ లీగ్-2024 ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)–11వ సీజన్ ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో పాట్నా పైరేట్స్‌ను 32-23 తేడాతో చిత్తు చేసిన హరియాణా.. తొలిసారి పీకేఎల్ ట్రోఫీని ముద్దాడింది.హరియాణా విజేతగా నిలవడంలో శివం పటారే కీలక పాత్ర పోషించాడు. శివం పటారే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. 21 ఏళ్ల పటారే నాలుగు టాకిల్స్ పాయింట్స్, ఐదు టచ్ పాయింట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మొహమ్మద్రెజా షాడ్లోయ్ 5 టాకిల్స్‌తో ప్రత్యర్ధి జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్‌లో రైడర్ దేవాంక్(5 టచ్ పాయింట్లు), గురుదీప్ సింగ్(6 టాకిల్ పాయంట్లు) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు. ఇక టోర్నీ అసాంతం హరియాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్లో 22 మ్యాచ్‌లు ఆడిన హరియాణా 16 విజయాలు సాధించగా.. ఆరింట ఓటమి చవిచూసింది. ప్రొ కబడ్డీ లీగ్-2024 సీజన్ ఆరంభం నుంచి ఆఖరి వరకు టేబుల్ టాపర్‌గానే హరియాణా(84 పాయింట్లు) కొనసాగింది. Presenting to you the 🌟 #𝐏𝐊𝐋𝟏𝟏 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🌟@HaryanaSteelers win their maiden #ProKabaddi title 🏆💙#ProKabaddiOnStar #LetsKabaddi #PKLFinal #HaryanaSteelers #PatnaPirates pic.twitter.com/m5xDX2QJlW— ProKabaddi (@ProKabaddi) December 29, 2024 -
టైటిల్ వేటలో...
పుణే: రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)–11వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా... హరియాణా స్టీలర్స్‌తో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్ కోసం తలపడనుంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్... ఇప్పటికే మూడుసార్లు టైటిల్ ముద్దాడిన పట్నా మధ్య రసవత్తర పోరు ఖాయమే. తొలిసారి చాంపియన్‌గా నిలవాలనుకుంటున్న హరియాణా స్టీలర్స్‌కు జైదీప్ సారథ్యం వహిస్తుండగా... మన్‌ప్రీత్ సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నేరుగా సెమీఫైనల్‌కు చేరిన స్టీలర్స్... తుదిపోరులోనూ అదే జోరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది. స్టీలర్స్ తరఫున శివమ్ పాతరె, వినయ్, జైదీప్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీ యోధాస్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చిన శివమ్, వినయ్ ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని స్టీలర్స్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. డిఫెన్స్‌లో రాహుల్, సంజయ్ కీలకం కానున్నారు. మరోవైపు గతంలో వరుసగా మూడు సార్లు పీకేఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న పట్నా... ఇప్పుడు నాలుగో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. యువ ఆటగాళ్లు దేవాంక్ దలాల్, అయాన్ లోచాబ్ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన పైరేట్స్.. అదే జోష్‌లో టైటిల్ పట్టాలని చూస్తోంది. -
టైటిల్ పోరుకు హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా స్టీలర్స్ 28–25 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. తాజా సీజన్లో తిరుగులేని ఆధిపత్యంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన హరియాణా స్టీలర్స్ సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి హరియాణా 12–11తో ముందంజలో నిలిచింది. ద్వితీయార్ధంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఒత్తిడిలోకి నెట్టి చివరి వరకు దాన్ని కొనసాగించి స్టీలర్స్ తుదిపోరుకు చేరింది. హరియాణా తరఫున శివమ్ పతారె 7, వినయ్ 6 రెయిడ్ పాయింట్లు సాధించారు. రాహుల్ సత్పాల్ (5 పాయింట్లు) ట్యాక్లింగ్‌లో అదరగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 15 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 18 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే డిఫెన్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన స్టీలర్స్ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు మరో రెండు ఎక్స్ట్రా పాయింట్లు సాధించి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున స్టార్ రెయిడర్ గగన్ గౌడ 10 పాయింట్లతో పోరాడగా... భవానీ రాజ్‌పుత్, హితేశ్ చెరో 5 పాయింట్లు సాధించారు. రెండో సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరెట్స్ 32–28 పాయింట్ల తేడాతో మరో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది.ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖర్లో ఒత్తిడిని అధిగమించిన పైరేట్స్ విజయతీరానికి చేరింది. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 8 పాయింట్లు సాధించగా... శుభమ్ షిండే (5 పాయింట్లు), అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. ఢిల్లీ జట్టు తరఫున అశు మలిక్ (9 పాయింట్లు), మోహిత్ దేశ్వాల్ (7 పాయింట్లు) పోరాడారు. ఆదివారం జరగనున్న తుదిపోరులో హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడనుంది. -
సెమీస్‌లో యూపీ యోధాస్, పట్నా పైరేట్స్
పుణే: గత ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌లో 11వ స్థానంతో సరిపెట్టుకున్న యూపీ యోధాస్ ఈసారి మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ యోధాస్ 46–18 పాయింట్ల తేడా మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును చిత్తుగా ఓడించింది. రెయిడర్ భవానీ రాజ్‌పుత్ 12 పాయింట్లతో మెరిసి యూపీ యోధాస్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. హితేశ్ 6 పాయింట్లు రాబట్టగా... గగన్ గౌడ, సుమిత్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. భవానీ రాజ్‌పుత్ 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లాడు. 9 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. రెండుసార్లు దొరికిపోగా, మూడుసార్లు పాయింట్ సాధించకుండానే వెనక్కి వచ్చాడు. మరోవైపు పింక్ పాంథర్స్ జట్టు సమష్టిగా విఫలమైంది. ఆ జట్టు రెయిడర్లుగానీ, డిఫెండర్లుగానీ ఆకట్టుకోలేకపోయారు. డిఫెండర్ రెజా మీర్బాఘేరి ఐదు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ కేవలం రెండు రెయిడింగ్ పాయింట్లు సాధించి నిరాశపరిచాడు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 31–23 పాయింట్ల తేడాతో మాజీ విజేత యు ముంబా జట్టును ఓడించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్లు దేవాంక్ 8 పాయింట్లు, అయాన్ 10 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండర్ గుర్దీప్ ఐదు పాయింట్లతో రాణించాడు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు... అజిత్ చౌహాన్ 5 పాయింట్లు సాధించారు.నేడు జరిగే సెమీఫైనల్స్‌లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి), దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్లో, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సెమీస్ బెర్త్ ఎవరిదో!
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్‌లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్‌గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్‌తో పాటు శివమ్ చౌధరీ యోధాస్‌కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్పై ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. -
ఆఖరి బెర్త్ యు ముంబాదే
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్... ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరకు గ్రూప్ దశతోనే పోరాటాన్ని ముగించింది. మంగళవారం ముగిసిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 36–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. యు ముంబా జట్టు ఆఖరి పోరులో 48 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఉంటే టైటాన్స్ ఆరో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేది. కానీ యు ముంబా విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంతో లీగ్ దశకే పరిమితమైంది. కీలక పోరులో ముంబా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు, అజిత్ చవాన్ 6 పాయింట్లు, సునీల్ కుమార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 12 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 22 మ్యాచ్‌లాడి 12 విజయాలు, 8 పరాజయాలు, 2 ‘టై’లతో 71 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ తరఫున శివమ్ చౌధరీ 13 పాయింట్లు, సురేందర్ గిల్ 9 పాయింట్లతో రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుశీల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. నేడు విశ్రాంతి రోజు. గురువారం జరగనున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
PKL 11: సెమీస్‌కు దూసుకెళ్లిన దబంగ్ ఢిల్లీ
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదకొండో సీజన్లో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టు ఎదురులేని విజయాలతో సెమీఫైనల్స్‌కు దూసుకు వెళ్లింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 41–35తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొంది.. సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా వరుసగా గత 15 మ్యాచ్‌లుగా దబంగ్ ఢిల్లీ ఒక్కటీ ఓడిపోలేదు. వీటిలో పదమూడింట గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. తద్వారా టాప్–2లో నిలిచి ఢిల్లీ నేరుగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గుజరాత్‌తో జరిగిన పోరులో ఢిల్లీ కెప్టెన్, రెయిడర్ అశు మలిక్ 17 సార్లు కూతకెళ్లి 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు అతడి సహచరుల్లో ఆల్‌రౌండర్ ఆశిష్ 7, రెయిడర్ నవీన్ 6, డిఫెండర్ ఆశిష్ 4 పాయింట్లు సాధించారు.ఆరు జట్లు నాకౌట్కుమరోవైపు.. గుజరాత్ తరఫున ఆల్‌రౌండర్ జితేందర్ యాదవ్ (7) ఆకట్టుకోగా, కెప్టెన్ గుమన్ సింగ్ (5), హిమాన్షు (5) రాణించారు. ఇదివరకే టాప్‌లో నిలిచిన హరియాణా స్టీలర్స్‌తో పాటు ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా సెమీస్‌కు అర్హత సంపాదించాయి. తర్వాత 3, 4, 5, 6వ స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో ఆడి ఇందులోంచి రెండు జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి.తమిళ్ తలైవాస్‌పై గెలుపుఇదిలా ఉంటే.. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 42–32తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. పుణేరి రెయిడర్లు ఆర్యవర్ధన్ నవలే (10), అజిత్ (7) అదరగొట్టారు. డిఫెండర్లలో గౌరవ్ ఖత్రి (5), అమన్ (4) రాణించారు. తలైవాస్ తరఫున ఆల్‌రౌండర్ హిమాన్షు (8), రెయిడర్ సచిన్ (7) పోరాడారు. కెప్టెన్, డిఫెండర్ నితేశ్ కుమార్ 5, అమిర్ హుస్సేన్ 4 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్‌తో యు ముంబా తలపడతాయి. -
హరియాణా స్టీలర్స్ ‘టాప్’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్ లీగ్ దశలో హరియాణా స్టీలర్స్ జట్టు అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 47–30 పాయింట్లతో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. హరియాణా తరఫున శివమ్ పటారె అత్యధికంగా 14 పాయింట్లు స్కోరు చేశాడు. మొహమ్మద్ రెజా, వినయ్ 6 పాయింట్ల చొప్పున సాధించగా... రాహుల్ 5 పాయింట్లు సంపాదించాడు. యు ముంబా తరఫు సతీశ్ కన్నన్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హరియాణా జట్టు 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా 84 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 42–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున హిమాన్షు 13 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ రెయిడర్ సుశీల్ 15 పాయింట్లతో మెరిసినా తన జట్టును గెలిపించుకోవడంలో విఫలమయ్యాడు. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8 గంటల నుంచి); పుణేరి పల్టన్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. ఇప్పటికే హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్, జైపూర్ పింక్ పాంథర్స్ ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. చివరిదైన ఆరో బెర్త్ కోసం యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్లు రేసులో ఉన్నాయి. బెంగాల్ వారియర్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో యు ముంబా గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌ను దక్కించుకుంటుంది. -
పట్నా, గుజరాత్ మ్యాచ్ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో భాగంగా శనివారం పట్నా పైరెట్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 10 పాయింట్లతో సత్తా చాటగా... సుధాకర్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 9 పాయింట్లు సాధించగా... గుమన్ సింగ్, జితేందర్ యాదవ్ చెరో 8 పాయింట్లతో మెరిశారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పట్నా 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... గుజరాత్ 18 రెయిడ్ పాయింట్లకు పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో వెనుకబడిన పట్నా 11 పాయింట్లతో సరిపెట్టుకోగా... గుజరాత్ 20 ట్యాకింగ్స్‌తో సత్తాచాటింది. ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు చివరకు సమంగా ముగిసింది. పట్నా జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో పాటు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... గుజరాత్ 21 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 13 పరాజయాలు, 3 ‘టై’లతో 38 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 33–31 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అశు మాలిక్ 12 పాయింట్లతో రాణించగా... జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లతో పోరాడాడు. ఢిల్లీ, జైపూర్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
టైటాన్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో తెలుగు టైటాన్స్ 12వ విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 48–36తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టును కెప్టెన్, రెయిడర్ పవన్ సెహ్రావత్ ముందుండి నడిపించాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన కెపె్టన్ 11 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. 4 బోనస్ పాయింట్లు కలుపుకొని మొత్తం 15 పాయింట్లు సాధించాడు. స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (11) కూడా క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్లలో అంకిత్ (6), అజిత్ పవార్ (3) రాణించారు. పుణేరి జట్టులో రెయిడర్ అజిత్ (10 పాయింట్లు) అదరగొట్టాడు. సబ్‌స్టిట్యూట్‌గా ఆలస్యంగా మైదానంలోకి దిగిన అజిత్ 13 సార్లు కూతకెళ్లి 10 పాయింట్లు చేశాడు. మిగతా సహచరుల్లో రెయిడర్ ఆర్యవర్ధన్ నవలె (8), డిఫెండర్లు అమన్ (5), దాదాసో పూజారి (3) రాణించారు.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 31–28తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందడంతో ప్లే ఆఫ్స్‌కు ఐదో జట్టుగా అర్హత సాధించింది. జైపూర్ జట్టులో కెప్టెన్, రెయిడర్లు అర్జున్ దేశ్వాల్ (9), అభిజిత్ మాలిక్ (7) నిలకడగా స్కోరు చేశారు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మీర్బఘేరి (5), అంకుశ్ రాఠి (3) మెరుగ్గా ఆడారు. బెంగాల్ వారియర్స్ తరఫున రెయిడర్లు ప్రణయ్ (8), అర్జున్ రాఠి (7) ఆకట్టుకున్నారు. డిఫెండర్లలో వైభవ్ గార్జే 4 పాయింట్లు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్... గుజరాత్ జెయంట్స్‌తో పోటీ పడనుండగా, దబంగ్ ఢిల్లీ... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తలపడుతుంది. -
యూపీ యోధాస్ జోరు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధాస్ జోరుకు గుజరాత్ జెయింట్స్ చేతులెత్తేసింది. దీంతో యూపీ యోధాస్ 59–23 స్కోరుతో ఏకపక్ష విజయం సాధించింది. రెయిడర్లు గగన్ గౌడ (19 పాయింట్లు), భవాని రాజ్‌పుత్ (11 పాయింట్లు) అదరగొట్టగా, డిఫెండర్లు సుమిత్ (5), అశు సింగ్ (4), మహేందర్ సింగ్ (4) రాణించారు. 18 సార్లు కూతకెళ్లిన గగన్ గౌడ 13 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం విశేషం. తొలి అర్ధభాగం మొదలైన ఎనిమిది నిమిషాలకే యోధాస్ ఆటగాళ్లు గుజరాత్‌ను ఆలౌట్ చేశారు. 12–7తో అక్కడ మొదలైన ఆధిపత్యం ఆఖరిదాకా కొనసాగింది. ఈ అర్ధభాగం ముగిసేలోపే మళ్లీ 18వ నిమిషంలో జెయంట్స్ ఆలౌటైంది. గుజరాత్ ఆటగాళ్లలో రెయిడర్ గుమన్ సింగ్ (7), ఆల్‌రౌండర్ జితేందర్ యాదవ్ (6), రెయిడర్ రాకేశ్ (5) రాణించారు. ఇదివరకే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించిన యూపీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 43–37తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (15) పదేపదే పాయింట్లు తెచ్చిపెట్టగా, డిఫెండర్లు సునీల్ కుమార్ (5), పర్వేశ్ (4), మన్జీత్ (4), ఆల్‌రౌండర్ రోహిత్ రాఘవ్ (4) సమష్టిగా రాణించారు. పైరేట్స్ తరఫున రెయిడర్ దేవాంక్ (12), అయాన్ (7), డిఫెండర్లు దీపక్ (4), శుభమ్ (4) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్... తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్, యూపీ యోధాస్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో పట్నా పైరేట్స్, యూపీ యోధాస్ జట్లు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 41–37 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. తద్వారా 20 మ్యాచ్‌ల్లో 13 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 73 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పైరేట్స్... పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు 21 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 10 పరాజయాలతో 61 పాయింట్లతో ఉన్న తెలుగు టైటాన్స్ పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కీలక పోరులో పట్నా పైరేట్స్ తరఫున దేవాంక్ 14 పాయింట్లతో విజృంభించగా... దీపక్, అంకిత్ చెరో ఆరు పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. టైటాన్స్ తరఫున పవన్ సెహ్రావత్, విజయ్ మలిక్ చెరో 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా యూపీ యోధాస్ కూడా ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టింది. యోధాస్ బుధవారం బరిలోకి దిగకపోయినా... లీగ్‌లో 20 మ్యాచ్‌లాడి 11 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 31 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తలైవాస్ 60–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను మట్టికరిపించింది. తలైవాస్ తరఫున మోయిన్, హిమాన్షు చెరో 13 పాయింట్లతో చెలరేగారు. ఈ ఇద్దరూ సూపర్ రెయిడ్లతో విజృంభించడంతో తలైవాస్ ఏకపక్ష విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ యోధాస్; యు ముంబాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
అర్జున్ సూపర్ రెయిడింగ్.. జైపూర్ ఘన విజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 35–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తన సూపర్ రెయిడింగ్‌తో ఆకట్టుకున్న అర్జున్ ప్రత్యర్థి డిఫెన్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. బెంగళూరు బుల్స్ స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... బుల్స్ 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. తాజా సీజన్లో 20 మ్యాచ్‌లాడిన పింక్ పాంథర్స్ 11 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. మరోవైపు 20 మ్యాచ్‌లాడిన బుల్స్ 2 విజయాలు, 17 పరాజయాలు, ఒక ‘టై’తో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. తాజా సీజన్లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... యూపీ యోధాస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 31–24 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 11 పాయింట్లు సాధించగా... స్టీలర్స్ తరఫున వినయ్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. లీగ్‌లో ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లాడిన యోధాస్ 11 విజయాలు 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్న స్టీలర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. లీగ్‌లో భాగంగా నేడు తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
PKL 11: ప్లే ఆఫ్స్‌లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ పరిస్థితి?
అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఈ సీజన్లో టాప్-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.ఇక ప్రొ కబడ్డి లీగ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి.మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లుహరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బెంగాల్‌తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.ఈ క్రమంలో.. నాలుగు బోనస్ పాయింట్లతోపాటు 12 టచ్ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్ 9 పాయింట్లు, ఆశిష్ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున విశ్వాస్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్ కుమార్ ఐదు పాయింట్లు, కెప్టెన్ ఫజల్ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.రేసులో పుణేరి పల్టన్ఇక మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది. తెలుగు టైటాన్స్ ఏస్థానంలో ఉందంటే?ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్‌లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.చదవండి: తమిళ్ తలైవాస్ అవుట్ -
తమిళ్ తలైవాస్ అవుట్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చింది. ఈ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న తలైవాస్... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 27–34 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. తమిళ్ తలైవాస్ తరఫున హిమాన్షు, నితీశ్ కుమార్ చెరో 7 పాయింట్లతో రాణించగా... పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్, నీరజ్ నర్వాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 13 రెయిడ్ పాయింట్లు సాధించగా... తలైవాస్ 7 రెయిడ్ పాయింట్లకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. తాజా సీజన్లో 19 మ్యాచ్‌లాడిన తలైవాస్ 6 విజయాలు, 12 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. పీకేఎల్ ముగింపు దశకు చేరుకుంటుండగా... మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచినా... తలైవాస్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేదు. జైపూర్ పింక్ పాంథర్స్ 19 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 59 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 30–27 పాయింట్ల తేడాతో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ సీజన్లో 19 మ్యాచ్‌లాడిన యూపీ యోధాస్ 10 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 36–32తో గుజరాత్ జెయంట్స్‌పై విజయం సాధించింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్ ఆశిష్ నర్వాల్ (6) కూడా రాణించాడు. ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ (18) అదరగొట్టాడు. ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్ ఒకసారి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్‌లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గుమన్ సింగ్ (9), రాకేశ్ (10) రెయిడింగ్‌లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్‌కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చిoది. ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్‌పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్ అషు మాలిక్ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్ నవీన్ (7), డిఫెండర్లు యోగేశ్ (4), ఆశిష్ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (9), రెయిడర్ శివమ్ పతారే (6) ఆదుకున్నారు.సంజయ్, నవీన్, వినయ్ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్... యు ముంబాతో యూపీ యోధాస్ తలపడుతుంది. -
38 పాయింట్ల తేడాతో...
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ 38 పాయింట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన ఈ పోరులో పల్టన్ 56–18 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన పల్టన్ ఓవరాల్‌గా 26 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగళూరు బుల్స్ 11 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. డిఫెన్స్‌లోనూ ఆకట్టుకున్న పల్టన్ 15 పాయింట్లతో మెరిస్తే... బుల్స్ 7 ట్యాకిల్ పాయింట్లే సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన పల్టన్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే... బుల్స్ ఒక్కసారి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. పల్టన్ తరఫున రెయిడర్లు ఆకాశ్ షిండే, మోహిత్ గోయత్, ఆర్యవర్ధన్ తలా 8 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 8 విజయాలు, 8 పరాజయాలు, 3 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 42–38 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. పట్నా తరఫున అయాన్ 13, దేవాంక్ 12 పాయింట్లతో రాణించగా... తలైవాస్ తరఫున మోయిన్ 11 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో 18 మ్యాచ్‌లాడిన పైరెట్స్ 11 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 63 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 27–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 10 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో రాణించగా... ఆశు మలిక్ 9 పాయింట్లతో అతడికి సహకరించాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... టైటాన్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే టైటాన్స్ రెండుసార్లు ఆలౌటై... ప్రత్యర్థి కి 4 పాయింట్లు సమర్పించుకోగా... ఢిల్లీ జట్టు ఒకేసారి ఆలౌటైంది. తాజా సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 10 విజయాలు, 9 పరాజయాలతో 55 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో స్థానంలో నిలవగా... దబంగ్ ఢిల్లీ 18 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో 61 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 11 పాయింట్లతో రాణించగా... బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. పాయింట్ల పట్టికలో యూపీ యోధాస్ (59 పాయింట్లు) నాలుగో స్థానానికి చేరగా... బెంగాల్ వారియర్స్ (40 పాయింట్లు) 9వ స్థానంలో ఉంది. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరెట్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
ప్లే ఆఫ్స్‌లో స్టీలర్స్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా హరియాణా స్టీలర్స్ నిలిచింది. బుధవారం జరిగిన పోరులో స్టీలర్స్ 37–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడిన హరియాణా 15 విజయాలు, 4 పరాజయాలతో 77 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు ‘ప్లే ఆఫ్స్’లో చోటు ఖాయం చేసుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన పోరులో స్టీలర్స్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. హరియాణా తరఫున వినయ్ 9 పాయింట్లు, శివమ్ 8 పాయింట్లతో సత్తా చాటగా... మొహమ్మద్ రెజా 6 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ తరఫున జతిన్ (5 పాయింట్లు) కాస్త పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగళూరు 14 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. మరోవైపు ఈ సీజన్లో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలు, 15 పరాజయాలు, ఒక ‘టై’తో 19 పాయింట్లతో ఉన్న బెంగళూరు బుల్స్... పట్టిక అట్టడుగున (12వ స్థానంలో) కొనసాగుతోంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 47–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. లీగ్‌లో భాగంగా గురువారం దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), యూపీ యోధాస్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అర్జున్ అదరహో
పుణే: స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దాంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జైపూర్ పింక్‌పాంథర్స్ తొమ్మిదో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోరులో పింక్‌పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సూపర్ రెయిడ్లతో అర్జున్ అదరగొట్టగా... నీరజ్ నర్వాల్ (8 పాయింట్లు) అతడికి సహకరించాడు. గుజరాత్ జెయింట్స్ జట్టు తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ చెరో 9 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 18 మ్యాచ్‌లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ 9 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్ కేవలం ఐదు విజయాలతో పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 44–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. వారియర్స్ తరఫున విశ్వాస్ 14 పాయింట్లు, ప్రణయ్ 9 పాయింట్లతో రాణించగా... బెంగళూరు తరఫున స్టార్ రెయిడర్, ‘డుబ్కీ కింగ్’ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దేవాంక్ ధమాకా
పుణే: స్టార్ రెయిడర్ దేవాంక్ దలాల్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ పదో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 38–28 పాయింట్ల తేడాతో మాజీ విజేత జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే దేవాంక్ తన రెయిడింగ్‌తో వరుస పాయింట్లు కొల్లగొట్టగా... అతడికి అయాన్ (6 పాయింట్లు), దీపక్ (5 పాయింట్లు), అంకిత్ (5 పాయింట్లు) సహకరించారు. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడాడు. తాజా సీజన్లో 17 మ్యాచ్‌లాడిన పట్నా పైరేట్స్ 10 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 58 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 17 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 49 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ఏడో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34–33 పాయింట్ల తేడాతో యు ముంబాపై విజయం సాధించింది.గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ సుంగ్రోయా చెరో 10 పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టు తరఫున అజిత్ చవాన్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పదో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. తెలుగు కెపె్టన్ విజయ్ మాలిక్ 19 సార్లు కూతకెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఆశిష్ నర్వాల్ (9) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ (14), మన్జీత్ (7) అదరగొట్టారు. దీంతో ఇరుజట్ల మధ్య ఆఖరిదాకా హోరాహోరీ సమరం జరిగింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 36–33తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. యూపీ రెయిడర్ గగన్ గౌడ (15) చెలరేగాడు.17 సార్లు కూతకెళ్లిన గగన్ క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్ (6) రాణించగా, కెప్టెన్ సుమిత్ 3, అశు సింగ్, మహేందర్, హితేశ్ తలా 2 పాయింట్లు చేశారు. పల్టన్ జట్టులో పంకజ్ మోహితే (11), మోహిత్ గోయత్ (7) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... యూ ముంబాతో గుజరాత్ జెయంట్స్ తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ తడాఖా
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన తలైవాస్ 40–27 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున మోయిన్ షఫాఘి 13 పాయింట్లతో సత్తా చాటగా... సౌరభ్, హిమాన్షు చెరో 7 పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 16 మ్యాచ్‌లాడిన తమిళ్ తలైవాస్ 6 విజయాలు, 9 పరాజయాలు, ఒక ‘టై’తో 38 పాయింట్లు సంపాదించింది. ప్రస్తుతం తలైవాస్ తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ 16 మ్యాచ్‌ల్లో పదో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారమే జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 42–36 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. హరియాణా జట్టు తరఫున శివమ్ 11 పాయింట్లు, మొహమ్మద్ రెజా 9 పాయింట్లు సాధించగా.. సంజయ్ ధుల్, వినయ్ చెరో 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. పట్నా తరఫున దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఇరు జట్లు రెయిడింగ్‌లో చెరో 19 పాయింట్లు సాధించగా... డిఫెన్స్‌లో సత్తా చాటిన స్టీలర్స్ విజాయన్ని ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో 17 మ్యాచ్‌లాడిన స్టీలర్స్ 13 విజయాలు, 4 పరాజయాలతో 67 పాయింట్లు సాధించింది. తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. పట్నా పైరేట్స్ 53 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 8 గంటలకు), తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
రెండు మ్యాచ్‌లూ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 32–32 పాయింట్లతో... జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, నవీన్ 8 పాయింట్లతో రాణించారు. యోధాస్ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్‌లో పింక్ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి. జైపూర్ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్‌బీర్ 7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు డిఫెన్స్‌లో దుమ్మురేపాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. పింక్ పాంథర్స్ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
టైటాన్స్‌కు మరో పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు ఏడో పరాజయం ఎదురైంది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 33–36తో యూపీ యోధాస్ చేతిలో ఓటమి పాలైంది. స్టార్ రెయిడర్ విజయ్ 11 పాయింట్లతో సత్తా చాటినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన యోధాస్ విజేతగా నిలిచింది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 24 పాయింట్లతో ముందంజ వేసింది. యూపీ యోధాస్ ప్రధాన రెయిడర్ గగన్ నారంగ్ 15 పాయింట్లతో విజృంభించాడు. తాజా సీజన్లో 16 మ్యాచ్‌లాడిన టైటాన్స్ తొమ్మిందిట గెలిచింది. ఏడింటిలో ఓడింది. 49 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–32తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అజిత్ సూపర్ రెయిడింగ్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో యు ముంబా జట్టు తమ ఖాతాలో తొమ్మిదో విజయం జమ చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన యు ముంబా మంగళవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది. యు ముంబా తరఫున అజిత్ చవాన్ 12 పాయింట్లతో సత్తా చాటగా... సునీల్ కుమార్, మన్జీత్, సోమ్‌బీర్ తలా 5 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున పంకజ్ మోహిత్ 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యు ముంబా 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 14 పాయింట్లకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. తాజా సీజన్లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 51 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 16 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లు సాధించిన పుణేరి పల్టన్ ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన పోరు 34–34 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్ 7 పాయింట్లు సాధించగా... ప్రదీప్ నర్వాల్, సుశీల్ చెరో 6 పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: దుమ్ములేపిన దబాంగ్ ఢిల్లీ.. తమిళ్ తలైవాస్ చిత్తు
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తమిళ్ తలైవాస్‌పై దబంగ్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో సత్తా చాటడంతో.. ఆదివారం జరిగిన పోరులో దబంగ్ 32–21 పాయింట్లతో తలైవాస్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ జట్టు తరఫున నవీన్ కుమార్, ఆశు మలిక్ (5 పాయింట్లు) రాణించారు.ఇక తలైవాస్ తరఫున మోయిన్ (8 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 18 రెయిడ్ పాయింట్లు, 12 ట్యాకిల్ పాయింట్లు సాధించగా... తలైవాస్ ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది.తాజా సీజన్లో 15 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లు నమోదు చేసుకుంది. 48 పాయింట్లతో ఢిల్లీ మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 15 మ్యాచ్‌ల్లో 9వ పరాజయం మూటగట్టుకున్న తలైవాస్ 33 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.బెంగాల్ వారియర్స్‌పై పట్నా గెలుపుమరోవైపు... హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–35 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 13 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో ఆకట్టుకోగా... వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 11 పాయింట్లతో పోరాడాడు. ఇరు జట్లు అటు రెయిడింగ్, ఇటు ట్యాక్లింగ్‌లో సమంగా నిలిచినా... ఎక్స్‌ట్రాల రూపంలో 4 పాయింట్లు సాధించిన పైరేట్స్ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం నుంచి పుణే వేదికగా పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలుత బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడతాయి. చదవండి: బిగ్‌బాష్ లీగ్ విజేత మెల్బోర్న్ రెనెగేడ్స్ -
తెలుగు టైటాన్స్ ఓటమి
నోయిడా: స్టార్ రెయిడర్ విజయ్ 17 పాయింట్లతో పోరాడినా... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–41 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. విజయ్ ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు), అర్జున్ దేశ్వాల్ (11 పాయింట్లు) సత్తా చాటారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 22 రెయిడ్ పాయింట్లు సాధించింది. ట్యాక్లింగ్‌లో పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధించగా... టైటాన్స్ 7 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. టైటాన్స్ మూడు సార్లు ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 6 పాయింట్లు దక్కాయి.తాజా సీజన్లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 6 పరాజయాలతో 48 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టైటాన్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... జైపూర్ పింక్ పాంథర్స్ (46 పాయింట్లు) పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరెట్స్ 54–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 17 పాయింట్లు, అయాన్ 13 పాయింట్లతో విజృంభించగా... బుల్స్ తరఫున జై భగవాన్ 9 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. 25 పాయింట్ల తేడాతో నెగ్గిన పట్నా జట్టు పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
హరియాణా స్టీలర్స్ దూకుడు
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న హరియాణా స్టీలర్స్... లీగ్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్ 42–30తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన స్టీలర్స్ ఓవరాల్‌గా 23 రెయిడ్ పాయింట్లు, 13 ట్యాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యరి్థని రెండుసార్లు ఆలౌట్ చేయడం ద్వారా మరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. స్టీలర్స్ తరఫున వినయ్ (9 పాయింట్లు), నవీన్ (6 పాయింట్లు), రాహుల్ (6 పాయింట్లు) రాణించారు. తలైవాస్ తరఫున మోయిన్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన స్టీలర్స్ 12 విజయాలు, 3 పరాజయాలతో 61 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 14 మ్యాచ్‌లాడిన తలైవాస్ 5 విజయాలు, 8 పరాజయాలు, ఒక ‘టై’తో 33 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 34–33తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. పల్టన్ తరఫున ఆకాశ్ షిండే 12 పాయింట్లతో అదరగొట్టగా... గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ 16 పాయింట్లతో పోరాడినా లాభం లేకపోయింది. తాజా సీజన్లో 15 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లతో పల్టన్ మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరెట్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
యు ముంబాపై తెలుగు టైటాన్స్ గెలుపు
నోయిడా: స్టార్ రెయిడర్లు ఆశిష్ కుమార్, విజయ్ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిన టైటాన్స్... గురువారం జరిగిన పోరులో 41–35 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై ఘనవిజయం సాధించింది. అటు రెయిడింగ్, ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి సత్తా చాటగా... యు ముంబా జట్టు టైటాన్స్‌ను ఒకేసారి ఆలౌట్ చేయగలిగింది. తాజా లీగ్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 9 విజయాలు, 5 పరాజయాలతో 48 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 46 పాయింట్లతో ఉన్న యు ముంబా మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 33–29తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: ప్రొ కబడ్డి లీగ్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ వేదిక ఖరారైంది. పుణే వేదికగా ఈ మెగా టోర్నీ టైటిల్ పోరు జరుగనుంది. ఈసారి లీగ్‌ను మూడు నగరాల్లో నిర్వహిస్తుండగా... హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నోయిడా వేదికగా పోటీలు జరుగుతున్నాయి.ఇక.. డిసెంబర్ 3 నుంచి మూడో అంచె మ్యాచ్‌లు పుణేలో జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్‌తో పాటు తుదిపోరును పుణేలోనే నిర్వహించనున్నారు. బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాడ్మింటన్ హాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.డిసెంబర్ 29నఇక గ్రూప్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు.. మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో తలపడతాయి. కాగ.. డిసెంబర్ 26న రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు... డిసెంబర్ 27న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 29న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.ఎనభై మ్యాచ్‌లు ముగిసేసరికి ప్రొ కబడ్డి లీగ్ 2024 పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఇలా..1. హర్యానా స్టీలర్స్: ఆడినవి 14.. గెలిచినవి 11.. ఓడినవి మూడు.. పాయింట్లు 562. యు ముంబా: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 4.. టై.. ఒకటి.. పాయింట్లు 453. దబాంగ్ ఢిల్లీ: 14... గెలిచినవి 6... ఓడినవి ఐదు.. టై.. మూడు.. పాయింట్లు 434. తెలుగు టైటాన్స్: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 5.. పాయింట్లు 435. పట్నా పైరేట్స్: ఆడినవి 13... గెలిచినవి 7.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 436. పుణెరి పల్టన్: ఆడినవి 14... గెలిచినవి 6.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 427. జైపూర్ పింక్ పాంథర్స్: ఆడినవి 13.. గెలిచినవి 7.. ఓడినవి ఐదు.. టై ఒకటి.. పాయింట్లు 408. యూపీ యోధాస్: ఆడినవి 13... గెలిచినవి 6.. ఓడినవి 6.. టై ఒకటి.. పాయింట్లు 389. తమిళ్ తలైవాస్: ఆడినవి 13.. గెలిచినవి 5.. ఓడినవి 7.. టై ఒకటి.. పాయింట్లు 3310. బెంగాల్ వారియర్స్: ఆడినవి 13... గెలిచినవి 3.. ఓడినవి 8.. టై 2.. పాయింట్లు 2511. గుజరాత్ జెయింట్స్: ఆడినవి 13.. గెలిచివని 4.. ఓడినవి 8.. టై ఒకటి.. పాయింట్లు 2512. బెంగళూరు బుల్స్: ఆడినవి 14.. గెలిచినవి 2.. ఓడినవి 12.. పాయింట్లు 16.చదవండి: రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్ -
హరియాణా ‘టాప్’ షో
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టీలర్స్ బుధవారం జరిగిన పోరులో 38–28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. లీగ్‌లో హరియాణాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మ్యాచ్ ఆరంభంలోనే ఐదు పాయింట్లు సాధించిన హరియాణా అదే జోరులో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 22–14తో నిలిచిన స్టీలర్స్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ద్వితీయార్ధంలోనూ చెలరేగి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టీలర్స్ జట్టు అటు రెయిడింగ్‌తో పాటు ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకుంటే... కేవలం రెయిడింగ్నే నమ్ముకున్న పల్టన్‌కు పరాజయం తప్పలేదు. స్టీలర్స్ తరఫున శివమ్ 13 పాయింట్లు సాధించగా... పుణేరి పల్టన్ తరఫున పంకజ్ 11 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో 14 హోయ్చ్లు ఆడిన హరియాణా స్టీలర్స్ 11 విజయాలు, 3 పరాజయాలతో 56 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... పుణేరి పల్టన్ 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లతో 42 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 39–37 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. గుజరాత్ తరఫున గుమన్ సింగ్ 12 పాయింట్లతో సత్తా చాటగా... వారియర్స్ తరఫున మణిందర్ 11 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
యోధాస్‌పై తలైవాస్ పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో తలైవాస్ 40–26 స్కోరుతో యూపీ యోధాస్‌పై ఘనవిజయం సాధించింది. డిఫెండర్ మొయిన్ షఫాగి (8 పాయింట్లు) అదరగొట్టగా, రెయిడర్లు నరేందర్ ఖండోలా (6), మసన ముత్తు (6) రాణించారు. డిఫెండర్లు రోనక్, ఆశిష్, నితీశ్, అమిర్ హుస్సేన్ తలా 2 పాయింట్లు చేశారు.యూపీ తరఫున గగన్ గౌడ 8, అశు సింగ్ 5, భవానీ రాజ్‌పుత్ 3 పాయింట్లు సాధించారు. నిజానికి తొలి అర్ధభాగంలో చకచకా పాయింట్లు సాధించిన యోధాస్ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. 17–12తో పైచేయి సాధించిన యూపీ ద్వితీయార్ధంలో మరో 9 పాయింట్లే చేసి ఏకంగా 28 పాయింట్లను సమర్పించుకుంది. తొలి అర్ధభాగంలో తలైవాస్ ఒకసారి ఆలౌట్ కాగా, రెండో అర్ధభాగంలో తలైవాస్ ఆటగాళ్ల దూకుడుకు యూపీ యోధాస్ ఏకంగా మూడు సార్లు ఆలౌట్ కావడం విశేషం. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 39–39తో ‘టై’ అయ్యింది. పట్నా రెయిడర్ దేవాంక్ (15) క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టగా, డిఫెండర్ దీపక్ (7) ఆకట్టుకున్నాడు. దబంగ్ జట్టులో రెయిడర్ అశు మలిక్ (11), ఆల్‌రౌండర్ ఆశిష్ (7), రెయిడర్ నవీన్ కుమార్ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో హరియాణా స్టీలర్స్‌తో పుణేరి పల్టన్... బెంగాల్ వారియర్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. -
పల్టన్ ఫటాఫట్
నోయిడా: డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు బెంగాల్ వారియర్స్ చేతులెత్తేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టన్ అర్ధసెంచరీని మించిన పాయింట్లను అవలీలగా చేసింది. కూతకెళ్లిన రెయిడర్లు, డిఫెండర్లు క్రమం తప్పకుండా పాయింట్లను సాధించారు. దీంతో పల్టన్ 51–34 స్కోరుతో 17 పాయింట్ల తేడాతో వారియర్స్‌పై జయభేరి మోగించింది. ఆట మొదలైన 7 నిమిషాలకే బెంగాల్ ఆలౌటైంది. మళ్లీ తొలి అర్ధభాగం ముగిసే దశలో ఆలౌట్ కావడంతో 24–11తో పుణేరి పూర్తి ఆధిపత్యంతో బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఐదు నిమిషాలకే మ్యాచ్‌లో మూడోసారి ఆలౌటైంది. 11 నిమిషాల వ్యవధిలో నాలుగోసారి ఆలౌటైంది. పుణేరి జట్టు మ్యాచ్‌లో ఒకే ఒక్కసారి అది కూడా మ్యాచ్ ముగిసే ఆఖరి నిమిషంలో ఆలౌట్ కాగా... అప్పటికే పాయింట్ల ఫిఫ్టీ కొట్టింది. పల్టన్ రెయిడర్లు ఆకాశ్ షిండే (9 పాయింట్లు), మోహిత్ గోయత్ (9), పంకజ్ మోహితె (6), డిఫెండర్లు మోహిత్ (5), గౌరవ్ ఖత్రి (3) రాణించారు. బెంగాల్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ (13) అదరగొట్టాడు. మిగతా వారిలో కెప్టెన్, డిఫెండర్ ఫజల్ అత్రాచలి (3), ప్రణయ్ రాణే (5) మెరుగ్గా ఆడారు. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–42తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. యూపీ ఆటగాళ్లలో గగన్ గౌడ (11), భవాని రాజ్‌పుత్ (10), హితేశ్ (8)లు రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ దేవాంక్ (18) ఆకట్టుకున్నాడు. అయాన్ (10) రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ తలపడనుండగా, యు ముంబాతో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా మూడు విజయాల తర్వాత పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–31 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ 15 పాయింట్లతో సత్తాచాటగా.. ఆశీష్ నర్వాల్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రతీక్ దహియా 11 పాయింట్లతో రాణించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 16 రెయిడ్ పాయింట్లు సాధించగా... తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో జెయింట్స్ 12 పాయింట్లతో సత్తాచాటగా... టైటాన్స్ 6 పాయింట్లకే పరిమితమై పరాజయం పాలైంది. తాజా సీజన్లో 13 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు, 5 పరాజయాలతో 43 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా... 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–30 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున వినయ్, శివమ్ చెరో 11 పాయింట్లతో కదంతొక్కగా... జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. హరియాణా స్టీలర్స్ 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలు 3 పరాజయాలతో 51 పాయింట్లతో పట్టిక ‘టాప్’లో నిలిచింది. లీగ్‌లో భాగంగా ఆదివారం పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో యూపీ యోధాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీ దూకుడు
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో దబంగ్ ఢిల్లీ ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 35–21 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. దబంగ్ ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ అశు మలిక్ 9 పాయింట్లతో సత్తా చాటగా.. యోగేశ్ దహియా 5 పాయింట్లు సాధించాడు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడినా అతడికి సహచరుల నుంచి సరైన తోడ్పాటు లభించలేదు. లీగ్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన దబంగ్ ఢిల్లీ 6 విజయాలు, 5 పరాజయాలు, 2 ‘టై’లతో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని మూడో స్థానానికి చేరింది. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 40–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ రెయిడర్ భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లతో విజృంభించగా... డిఫెన్స్‌లో హితేశ్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. తమిళ్ తలైవాస్ తరఫున విశాల్ చాహల్, నితీశ్ కుమార్ చెరో ఆరు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 5 విజయం నమోదు చేసుకున్న యూపీ యోధాస్ 33 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా... గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో పరాజయం మూటగట్టుకున్న తమిళ్ తలైవాస్ 28 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌దే పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 31–29తో బెంగాల్ వారియర్స్ పై నెగ్గింది. కెప్టెన్ విజయ్ మలిక్ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కీలక దశలో రెయిడింగ్‌కు వెళ్లిన విజయ్ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్ విజయానికి కారణమైంది. డిఫెన్స్‌లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది. ఆల్‌రౌండర్ శంకర్ గడాయ్, డిఫెండర్ అంకిత్, రెయిడర్ మన్జీత్ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున రెయిడర్ ప్రణయ్ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్ విజయ్ మలిక్ చేసిన పోరాటంతో విజయం దక్కింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 32–26తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో రెయిడర్ వినయ్ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా 4, రెయిడర్ శివమ్ 5, డిఫెండర్ సంజయ్ 4 పాయింట్లు చేశారు. బుల్స్ జట్టులో ఒక్క అక్షిత్ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్ రెయిడర్, కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్ రావల్ (4), జై భగవాన్ (3) మెరుగ్గా ఆడారు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన హరియాణా 9 విజయాలతో టాప్‌లో నిలువగా, 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ దూకుడు
నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో ‘టేబుల్ టాపర్’ హరియాణా స్టీలర్స్‌ను మట్టికరిపించిన టైటాన్స్... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్ జట్టు రెయిడింగ్‌లో విఫలమైనా... డిఫెన్స్‌లో రాణించింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించగా... సాగర్ నర్వాల్, అజిత్ పవార్, మన్జీత్ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్ 8 పాయింట్లు, మన్జీత్ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో టైటాన్స్ 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ తడాఖా
నోయిడా: తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు పది మ్యాచ్‌లాడిన హరియాణా స్టీలర్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓడి, ఎనిమిదింట విజయం సాధించిది. అలాంటి మేటి ప్రదర్శన కనబరుస్తున్న హరియాణాపై తెలుగు టైటాన్స్ సాధికార విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ పోరులో కీలకమైన ఆటగాడు, కెప్టెన్ పవన్ సెహ్రావత్ గాయంతో బరిలోకి దిగలేదు. అయినా సరే టైటాన్స్ 49–27తో స్టీలర్స్‌కు ఊహించని పరాజయాన్ని రుచి చూపించింది. ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ రెయిడర్లు, డిఫెండర్లు సత్తా చాటుకోవడంతో హరియాణా ఆలౌటైంది. సరిగ్గా ప్రథమార్ధం ముగిసే సమయానికి (20 నిమిషాలు) మళ్లీ ఆలౌట్ చేసిన టైటాన్స్ ఆధిక్యాన్ని 23–11కు పెంచకుంది. ద్వితీయార్ధంలో స్టీలర్స్ పాయింట్లు చేసినప్పటికీ క్రమం తప్పకుండా తెలుగు టైటాన్స్ చేస్తున్న స్కోరును ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. రెయిడర్లు ఆశిష్ నర్వాల్ (11 పాయింట్లు), కెపె్టన్ విజయ్ మలిక్ (8) అదరగొట్టారు. డిఫెండర్ సాగర్, ఆల్‌రౌండర్ శంకర్ చెరో 5 పాయింట్లు చేశారు. హరియాణా తరఫున కెప్టెన్ రాహుల్ (6), ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), రెయిడర్ జయసూర్య (5) రాణించారు. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టు ఆరో విజయంతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అనంతరం హోరాహోరిగా జరిగిన రెండో మ్యాచ్‌లో యు ముంబా 38–37 ఒకే ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (10) ఆకట్టుకున్నాడు. అమిర్ మొహమ్మద్, కెప్టెన్ సునీల్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగళూరు జట్టులో ప్రదీప్ నర్వాల్ (10), సుశీల్ (6), నితిన్ రావల్ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి)... బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
హరియాణా పాంచ్ పటాకా
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హరియాణా స్టీలర్స్ జట్టు జోరు కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న హరియాణా స్టీలర్స్ లీగ్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హరియాణా స్టీలర్స్ 36–29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.స్టీలర్స్ తరఫున స్టార్ రైడర్ వినయ్ 10 పాయింట్లతో సత్తా చాటగా... డిఫెన్స్‌లో మొహమ్మద్ రెజా (8 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. తమిళ్ తలైవాస్ తరఫున మొయిన్ 7 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హరియాణా జట్టు 21 రెయిడ్ పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించగా... 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమై తమిళ్ తలైవాస్ పరాజయం పాలైంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు సాధించిన హరియాణా స్టీలర్స్ 41 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు 11 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 6 పరాజయాలు ఒక ‘టై’తో 28 పాయింట్లు సాధించిన తమిళ్ తలైవాస్ జట్టు పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. పుణేరి పల్టన్‌పై జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపు మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 30–28 పరుగుల తేడాతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ 8 పాయింట్లు, అంకుశ్ 6 పాయింట్లతో రాణించారు. పుణేరి పల్టన్ తరఫున ఆకాశ్ షిండే 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో జైపూర్ జట్టు కీలక సమయంలో ఆధిక్యం చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... ట్యాకెలింగ్లో జైపూర్ 14 పాయింట్లు, పుణేరి పల్టన్ 10 పాయింట్లు సాధించాయి. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు 9 మ్యాచ్‌లాడిన పుణేరి పల్టన్ 5 విజయాలు, 2 ఓటములు, 2 ‘టై’లతో 33 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అశు రెయిడింగ్ అదుర్స్
నోయిడా: స్టార్ రెయిడర్ అశు మలిక్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో దబంగ్ ఢిల్లీ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ జట్టు 35–25 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. 12 రెయిడ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లతో అశు మలిక్ విజృంభించగా... అతడికి డిఫెన్స్‌లో యోగేశ్ దహియా (5 పాయింట్లు) సహకరించాడు. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్ రావల్ 7 పాయింట్లు సాధించగా... స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఫలితంగా మ్యాచ్ ఏ దశలోనూ బెంగళూరు జట్టు ఢిల్లీకి పోటీనివ్వలేకపోయింది. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 5 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 32 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. పది మ్యాచ్‌ల్లో 8వ పరాజయంతో బెంగళూరు జట్టు పట్టికలో 11వ స్థానానికి పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 46–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. తలైవాస్ తరఫున విశాల్ 12 పాయింట్లతో రాణించగా... బెంగాల్ తరఫున విశ్వాస్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన తమిళ్ తలైవాస్ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
దేవాంక్ ధమాకా
నోయిడా: స్టార్ రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 52–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున దేవాంక్ 10 రెయిడ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు సాధించగా... అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. సందీప్ కుమార్ (8 పాయింట్లు), దీపక్ రాఠి (5 పాయింట్లు) కూడా రాణించడంతో పట్నా జట్టు ఘనవిజయం సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన పట్నా 6 విజయాలు, 4 పరాజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లు, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. 9 మ్యాచ్‌లాడిన జైపూర్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్ సెహ్రావత్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్‌పుత్ 12, భరత్ 11 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ లీగ్‌లో నాలుగో మ్యాచ్ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ 10 పాయింట్లు, అజిత్ చవాన్ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్ తరఫున మోయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్‌లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైన తమిళ్ తలైవాస్ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
హరియాణా స్టీలర్స్ ‘టాప్’ షో
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్ 37–32 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో హరియాణా జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా... 36 పాయింట్లు ఖాతాలో వేసుకున్న స్టీలర్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరింది. హరియాణా తరఫున వినయ్, మొహమ్మద్ రెజా చెరో 6 పాయింట్లతో సత్తా చాటారు. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 7 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 47–28 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. తాజా సీజన్లో గుజరాత్‌కు ఇది రెండో విజయం కాగా... బెంగాల్‌కు మూడో పరాజయం. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), తమిళ్ తలైవాస్‌తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
ఢిల్లీ, పుణేరి హోరాహోరీ
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హోరాహోరీ సమరాలు కొనసాగుతున్నాయి. మంగళవారం దబంగ్ ఢిల్లీ–పుణేరి పల్టన్ మధ్య జరిగిన పోరు 38–38 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్ 17 పాయింట్లతో సత్తాచాటగా... మోహిత్ దేశ్వాల్ (6 పాయింట్లు) అతడికి సహకరించాడు. ఇతర ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తన సూపర్ రెయిడ్లతో అషు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ జట్టు పోటీలో నిలిచింది. మరోవైపు పల్టన్ తరఫున ఆకాశ్ షిండే (8 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు), అమన్ (6 పాయింట్లు) రాణించారు. ఓవరాల్‌గా దబంగ్ ఢిల్లీ మ్యాచ్‌లో 24 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పుణేరి పల్టన్ 18 పాయింట్లకే పరిమితమైంది. ట్యాకిలింగ్‌లో ఢిల్లీ 9 పాయింట్లు సాధిస్తే... పల్టన్ 13 పాయింట్లతో సత్తాచాటింది. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... దంబగ్ ఢిల్లీ జట్టుకు ఒక సూపర్ రెయిడ్ పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 5 విజయలు, 2 పరాజయాలు, 2 ‘టై’లతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ప్లేస్‌లో కొనసాగుతోంది. 10 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి పట్టిక ఐదో స్థానంలో ఉంది. అర్జున్ అదరహో..పీకేఎల్‌లో భాగంగా మంగళవారమే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఘనవిజయం సాధించింది. షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 39–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో దుమ్మురేపాడు. రెండుసార్లు పీకేఎల్ టైటిల్ సాధించిన జైపూర్ జట్టను అర్జున్ ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టాడు. రెయిండింగ్‌లో అర్జున్ దూకుడు కనబరిస్తే... డిఫెన్స్‌లో లక్కీ శర్మ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ నర్వాల్ గైర్హాజరీలో బరిలోకి దిగిన బెంగళూరు బుల్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రధాన ఆటగాడు దూరం కావడంతో... ఆ జట్టు పింక్ పాంథర్స్‌కు పోటీనివ్వలేకపోయింది. అజింక్యా పవార్ (9 పాయింట్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పింక్ పాంథర్స్ 19 పాయింట్లు సాధించింది. ట్యాకిలింగ్‌లో బుల్స్ 8 పాయింట్లకు పరిమితం కాగా... జైపూర్ 14 పాయింట్లతో సత్తాచాటింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం కాగా... 3 పరాజయాలు, ఒక ‘టై’తో 25 పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన తమ్మిది మ్యాచ్‌ల్లో ఏడో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. -
పట్నా పైరేట్స్ ప్రతాపం
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40–27 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ 10 పాయింట్లతో టాపర్‌గా నిలవగా... దేవాంక్ (6 పాయింట్లు), సందీప్ (5 పాయింట్లు) సహకరించారు. గుజరాత్ ఆటగాళ్లలో అంతా సమష్టి ప్రదర్శన చేసినా అది ఓటమి నుంచి తప్పించుకునేందుకు సరిపోలేదు. గుమన్ సింగ్, పార్తీక్ దహియా చెరో 5 పాయింట్లు స్కోరు చేశారు. తొలి అర్ధభాగంలో 21–16తో ముందంజలో నిలిచిన పట్నా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నెగ్గిన గుజరాత్ టీమ్‌కు ఇది వరుసగా ఏడో పరాజయం కావడం విశేషం. పట్టికలో ప్రస్తుతం పట్నా పైరేట్స్ నాలుగో స్థానంలో (27 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ చివరి స్థానంలో (7 పాయింట్లు) కొనసాగుతున్నాయి. నేడు జరిగే పోటీల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్... పుణేరీ పల్టన్‌తో దంబగ్ ఢిల్లీ తలపడతాయి. హరియాణా స్టీలర్స్ హ్యాట్రిక్ మరోవైపు హరియాణా స్టీలర్స్ జట్టు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. లీగ్‌లో వరుసగా మూడో విజయంతో స్టీలర్స్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 48–39 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాను ఓడించింది. విశాల్, శివమ్, మొహమ్మద్ రెజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్లు విశాల్, శివమ్ చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా... ఆల్‌రౌండర్ రెజా 10 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. రెయిడర్ అజిత్ ఒక్కడే ఏకంగా 18 పాయింట్లు సాధించగా... మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 23–23 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో అనూహ్యంగా వెనుకబడిపోయింది. ముంబా 16 పాయింట్లు మాత్రమే సాధించగా... హరియాణా ఖాతాలో 25 పాయింట్లు చేరాయి. 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించిన హరియాణా మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 29 పాయింట్లతో ముంబా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
PKL 11: యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో మాజీ చాంపియన్ యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్‌పై గెలిచింది.యు ముంబా తరఫున అజిత్ చవాన్, రోహిత్ రాఘవ్ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.ఇక తాజా సీజన్లో యు ముంబా 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఓటమిమరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్ తరఫున రాహుల్ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు... గుజరాత్ జెయింట్స్ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్ అస్థానంలో కొనసాగుతోంది. -
PKL 11: దుమ్ములేపిన టైటాన్స్.. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషంలో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(PKL) పదకొండో సీజన్లో భాగంగా.. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఆట ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో పుణెరికి చెక్ పెట్టి వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.కాగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు.ఇక పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటగా.. అతడికి తోడుగా అజిత్ కుమార్ ఆరు,మోహిత్ గోయత్ ఐదు పాయింట్లతో రాణించారు. అయినప్పటికీ ఆఖరికి ఓటమి నుంచి పుణెరి తప్పించుకోలేకపోయింది.ఆధిపత్యం చేతులు మారగాకాగా ఆట ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా రాణించారు. ఇక తన మూడు రెయిడ్స్ లో పవన్ నాలుగు పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటలో ఆధిపత్యం కనబరిచింది. ఈ క్రమంలో పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది.ఇలాంటి దశలో పంకజ్ బోనస్ పాయింట్‌తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్ బోనస్, సూపర్ రెయిడ్‌తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది.తొలి అర్ధభాగం 20–20తో సమంగా అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు.మరో రెయిడర్ విజయ్ మాలిక్ కూడా ఆకట్టుకోగా.. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.ఆఖరికి టైటాన్స్ పైచేయిరెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి.ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది. విజయ్ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా.. టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్ ఒక రెయిడ్ పాయింట్‌తో పాటు అజిత్ కుమార్‌ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
ఢిల్లీ ధమాకా
హైదరాబాద్, నవంబర్ 8: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీ కేసీ అదరగొట్టింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-26తో తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో తమ కంటే మెరుగైన స్థితిలో ఉన్న తలైవాస్‌పై ఢిల్లీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్(12) మరోమారు సూపర్-10 ప్రదర్శనతో విజృంభిస్తే..ఢిపెండర్లు యోగేశ్(7), అశిష్ మాలిక్(7), మను(5) రాణించారు. మరోవైపు అనూహ్య ఓటమి ఎదుర్కొన్న తలైవాస్ తరఫున నరేందర్(6), సచిన్(4), సాహిల్(4), మోయిన్(4) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ 24 పాయింట్లతో మూడో స్థానంలోకి వచ్చింది. తలైవాస్ మూడో ఓటమితో 5వ స్థానానికి పరిమితమైంది. ఢిల్లీ దూకుడు:ప్రొ కబడ్డీ లీగ్‌లో రైవలరీ వీక్ రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో ముందంజ వేయాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ప్రతీ జట్టు తుదికంటా పోరాడుతున్నాయి. ఓవైపు ఢిల్లీ వరుస ఓటములతో సతమతమవుతుంటే మరోవైపు తమిళ్ తలైవాస్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. శుక్రవారం తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తమదైన దూకుడు కనబరిచింది. స్టార్ రైడర్ నవీన్ గైర్హాజరీలో అషు మాలిక్ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ 17వ నిమిషంలో అషు మాలిక్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు 14వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన నరేందర్‌ను యోగేశ్ ఔట్ చేయడంతో ఢిల్లీకి పాయింట్ వచ్చింది. ఆ తర్వాత రైడ్లలో కూడా నరేందర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే అదనుగా ఢిల్లీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ఓవైపు రైడింగ్‌కు తోడు డిఫెన్స్‌తో తలైవాస్‌కు చెక్ పెడుతూ ప్రథమార్ధం ముగిసే సరికి ఢిల్లీ 16-10తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అషు మాలిక్ విజృంభణ: ప్రథమార్ధంలో పెద్దగా జోరు కనబర్చని ఢిల్లీ రైడర్ అషు మాలిక్..కీలకమైన ద్వితీయార్ధంలో పంజా విసిరాడు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్ పక్కా అన్న రీతిలో చెలరేగుతూ ఢిల్లీని ఆధిక్యంలో నిలుపడంలో కీలకమయ్యాడు. 20వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన మను..అమిఈర్, అనూజ్‌ను ఔట్ చేసి ఢిల్లీకి రెండు పాయింట్లు అందించాడు. ఈ క్రమంలో 18వ నిమిషంలో అషు మాలిక్..సచిన్‌ను ఔట్ చేయడంతో తలైవాస్ తొలిసారి ఆలౌటైంది. ఓవైపు రైడింగ్‌లో అషు మాలిక్ అదరగొడితే డిఫెన్స్‌లో యోగేశ్, అశిష్ మాలిక్..తలైవాస్ పనిపట్టారు. ఎక్కడా పట్టు వదలకుండా పాయింట్ల వేటలో తలైవాస్‌పై ఢిల్లీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తలైవాస్ తరఫున నరేందర్, సచిన్, సాహిల్ రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. -
జైపూర్పై పట్నా పైరేట్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ లో పట్నా పైరేట్స్ జట్టు నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన లీగ్ పోరులో ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జైపూర్ పింక్ పాంథర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా 43–41 తేడాతో పింక్ పాంథర్స్ ను ఓడించింది. పట్నా తరఫున అయాన్ 14 పాయింట్లతో సత్తా చాటగా... మరో రెయిడర్ దేవాంక్ కూడా 11 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. జైపూర్ జట్టులో కెప్టెన్, స్టార్ రెయిడర్ అర్జున్ దేశాల్ 20 పాయింట్లతో విజృంభించినా జట్టును గెలిపించలేకపోయాడు. హోరాహోరీ పోరుపోటాపోటీగా సాగిన తొలి అర్ధభాగంలో తొలుత జైపూర్ పైచేయి సాధించినా.. చివరకు పట్నా ఆధిక్యంలోకి వచ్చింది. రెయిడ్ మిషన్ అర్జున్ దేశ్వాల్ ఆరంభం నుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. బోనస్‌తో తమ జట్టు ఖాతా తెరిచిన అతను వరుస టచ్ పాయింట్లతో చెలరేగాడు. అటువైపు పట్నా ఆటగాళ్లు దేవాంక్, అయాన్ కూడా విజయవంతమైన రెయిడ్స్‌తో ఆకట్టుకున్నారు. దాంతో తొలి ఐదు నిమిషాలు ఆట హోరీహోరీగా సాగింది.కానీ, డిఫెండర్లు ఆశించిన మేర రాణించలేకపోవడంతో పట్నా వెనుకబడింది. దీన్ని జైపూర్ సద్వినియోగం చేసుకుంది. కోర్టులో మిగిలిన అయాన్‌ను ఔట్ చేసి పదో నిమిషంలోనే పట్నాను ఆలౌట్ చేసి 14–10తో ముందంజ వేసింది. ఆపై అర్జున్ సూపర్ రైడ్‌తో పాటు సూపర్10 పూర్తి చేసుకున్నాడు. దాంతో జైపూర్ ఆధిక్యం 19–13కి పెరిగింది. ఈ దశలో పట్నా అనూహ్యంగా పుంజుకుంది. దేవాంక్, అయాన్ రెయిండింగ్‌లో జోరు కొనసాగించడగా... డిఫెన్స్‌లోనూ మెరుగైంది. అర్జున్ను ట్యాకిల్ చేసి కోర్టు బయటకి పంపించింది.దాంతో 19–19తో స్కోరు సమం చేసింది. ఆవెంటనే కోర్టులో మిగిలిన అభిజీత్‌ను ట్యాకిల్ చేసి జైపూర్‌ను ఆలౌట్ చేసిన పట్నా 22–20తో ఆధిక్యంలోకి వచ్చింది. అర్జున్ను మరోసారి ట్యాకిల్ చేసిన ఆ జట్టు 25–21తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.ఆఖర్లో పట్నా మ్యాజిక్ రెండో అర్ధభాగం మొదలైన వెంటనే జైపూర్ మళ్లీ జోరు పెంచింది. ముఖ్యంగా అర్జున్ దేశ్వాల్ చెలరేగిపోయాడు. ఒకే రెయిడ్‌లో ఏకంగా ఐదుగురు పట్నా ఆటగాళ్లను ఔట్ చేశాడు. తన మరో రైడ్‌లో కోర్టులో మిగిలిన అక్రమ్ షేక్‌ను కూడా టచ్ చేసి వచ్చాడు. దాంతో 24వ నిమిషంలో పట్నాను రెండోసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 27–25తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది.అయినా పట్నా వెనక్కు తగ్గలేదు. అయాన్ రెయిడింగ్‌లో హవా చూపెట్టగా.. డిఫెండర్లు కూడా పట్టుదలగా ఆడారు. అర్జున్ను మరోసారి ట్యాకిల్ చేశాడు. నీరజ్‌ను సూపర్ ట్యాకిల్ చేసి మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 40–40తో స్కోరు సమం చేసింది. ఈ దశలో రెయిడ్ కు వెళ్లిన అర్జున్ ప్రత్యర్థికి దొరికిపోయాడు. కానీ, పట్నా డిఫెండర్ లైన్ దాటడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. ఆపై, డూ ఆర్ డై రెయిడ్‌లో దేవాంక్ బోనస్ సాధించడంతో పట్నా 42–41తో ఒక పాయింట్ అధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ చివరి రెయిడ్ కు వచ్చిన సోంబీర్ ను ట్యాకిల్ చేసిన పట్నా మూడు రెండు తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
దబాంగ్ ఢిల్లీ గెలుపు బాట
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ దబాంగ్ ఢిల్లీ కేసీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్‌ను ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 33–30 తేడాతో బెంగాల్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్, స్టార్ రెయిడర్ పది పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు. అతనికి తోడు వినయ్ 8 పాయింట్లు, ఆశీష్ ఆరు పాయింట్లతో రాణించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో రెయిడర్ నితిన్ కుమార్ 15 పాయింట్లతో అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్, డిఫెండర్ ఫజెల్ అత్రాచలి 5 పాయింట్లతో హైఫైవ్ ఖాతాలో వేసుకున్నాడు.హోరాహోరీలో ఢిల్లీ పైయిఆరంభంలో ఆట హోరాహోరీగా సాగినా దబాంగ్ ఢిల్లీ క్రమంగా జోరు పెంచి తొలి అర్ధభాగంలో పైచేయి సాధించింది. మణిందర్ బోనస్‌తో బెంగాల్ వారియర్స్ జట్టు ఖాతా తెరిచాడు. ఆవెంటనే ఢిల్లీ స్టార్ రెయిడర్ బోనస్ సాధించినా ఫజెల్ అత్రాచలి అతడిని ట్యాకిల్ చేశాడు. తర్వాతి రెయిడ్‌లో విజయ్ కూడా ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కగా.. డూ ఆర్ డై రెయిడ్‌లో నితిన్ కుమార్ అషు మాలిక్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు.దాంతో బెంగాల్ 4–1తో ఆరంభ ఆధిక్యం దక్కించుకుంది. కానీ, ఆశీష్ వరుస రెయిడ్లలో విజయవంతం కావడంతో ఢిల్లీ 6–6తో స్కోరు సమం చేసింది. అషు మాలిక్ రెయిండింగ్‌లో జోరు పెంచగా.. డిఫెన్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. మణిందర్‌తో పాటు విశ్వాస్ను ట్యాకిల్ చేసి బెంగాల్ ను ఆలౌట్ చేసి 14–8తో ఆధిక్యాంలోకి వెళ్లింది. బెంగాల్ జట్టులో నితిన్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టినా.. ఆధిక్యాన్ని కాపాడుకున్న ఢిల్లీ19-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.ఢిల్లీదే జోరురెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటగాడు నితిన్ జోరు చూపెడూ సూపర్ 10 పూర్తి చేసుకున్నాడు. దాంతో బెంగాల్ నెమ్మదిగా ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. డిఫెన్స్‌లోనూ కాస్త మెరుగైంది. అటు రెయిడింగ్‌లో నితిన్‌కు తోడు సుశీల్ కూడా వెంటవెంటనే రెండు రెయిడ్ పాయింట్లు రాబట్టాడు. డూ ఆర్ డై రెయిడ్‌కు వచ్చిన అంకిత్ మానెను అద్భుతంగా ట్యాకిల్ చేసిన ఫజెల్ అత్రాచలి హై ఫైవ్ పూర్తి చేసుకున్నాడు. దాంతో మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా బెంగాల్27–31తో ఢిల్లీ ఆధిక్యాన్ని నాలుగు పాయింట్లకు పరిమితం చేసింది.ఈ దశలో అషు మాలిక్ ఎమ్టీ రైయిడ్‌తో సమయం వృథా చేసే ప్రయత్నం చేశాడు. చివర్లో నితిన్ మెరుపు వేగంతో రెండు పాయింట్లు తీసుకురావడంతో స్కోరు 29–31తో ఉత్కంఠా మారింది. అయితే, డూ ఆర్ డై రెయిడ్‌కు వెళ్లిన అషు మాలిక్.. మయూర్ కదమ్‌ను డైవింగ్ హ్యాండ్ టచ్‌తో ఢిల్లీకి మరో పాయింట్ అందించాడు. ఆ వెంటనే నితిన్ మరో టచ్ పాయింట్ తెచ్చినా.. ఆఖరి రెయిడ్‌కు వచ్చిన అషు మాలిక్.. ఫజెల్ అత్రాచలి పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో ఢిల్లీ మూడు పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది. -
టైటాన్స్ అదుర్స్.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
హైదరాబాద్, నవంబర్ 6: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్-8వ సీజన్ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్ నార్వల్(9), విజయ్ మాలిక్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్ జట్టులో సచిన్ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్(4), నరేందర్(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్లో సచిన్ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్ విజయంతో టైటాన్స్ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్ 21 పాయింట్లతో మూడులో ఉంది.ఇరు జట్లు హోరాహోరీగా..లీగ్ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్ 18వ నిమిషంలో విజయ్ మాలిక్ రైడ్‌తో టైటాన్స్ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్ కూడా జతకలువడంతో టైటాన్స్ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్ ఇద్దరిని పవన్ ఔట్ చేయడం ద్వారా తలైవాస్ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్ 11వ నిమిషంలో కిషన్, అశిష్‌ను ఔట్ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్ రైడర్ అశిష్ నార్వల్..అభిషేక్‌ను ఔట్ చేసి పాయింట్ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్ సూపర్ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.పవన్, సచిన్ దూకుడుఓవైపు టైటాన్స్ తరఫున పవన్, మరోవైపు తలైవాస్‌కు సచిన్ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్ 14వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్ ఔట్ కావడంతో తలైవాస్ గెలుపు ఆశలపై టైటాన్స్ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్, సచిన్ రైడింగ్ జోరు అభిమానులను కట్టిపడేసింది. -
యు ముంబా ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా ఉత్కంఠ విజయం అందుకుంది. ఆధిపత్యం చేతులూ మారుతూ సాగిన పోరులో ఆఖరి క్షణాల్లో పట్నాను ఆలౌట్ చేసిన ముంబా పైచేయి సాధించింది. అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజృంభించడంతో బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో యు ముంబా 42–40 తేడాతో పట్నాను ఓడించింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చవాన్ తో పాటు మంజీత్ (5) ఆకట్టుకున్నాడు. పట్నా జట్టులో దేవాంక్ 15 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ముంబాకు ఇది నాలుగో విజయం కాగా.. ఆరు మ్యాచ్‌ల్లో పట్నా మూడోసారి ఓడిపోయింది.హోరాహోరీలో ముంబా పైచేయితొలి అర్ధభాగంలో ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్, అయాన్ అదరగొట్టగా.. అటు యు ముంబా రెయిడర్ అజిత్ చవాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని దేవాంక్ పట్నా పైరేట్స్ జట్టు ఖాతా తెరవగా.. మంజీత్ ముంబాకు తొలి పాయింట్ అందించాడు. దేవాంక్ జోరుతో పట్నా 9–6తో ముందంజ వేసింది. కానీ, డిఫెన్స్‌లో మెరుగైన ముంబా వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో 11–11తో స్కోరు సమం చేసింది.డూ ఆర్ డై రైడ్‌లో సందీప్ ఓ పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన సునీల్, మంజీత్‌ను అయాన్ ఔట్ చేశాడు. దాంతో ముంబైని ఆలౌట్ చేసిన పట్నా 16–12తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో అజిత్ తన రెయిడింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా రెండు సూపర్ రెయిడ్స్‌తో ఐదుగురిని కోర్టు బయటకు పంపించాడు. దాంతో పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న ముంబా 21–17తో ఆధిక్యంలోకి వచ్చింది. అదే జోరుతో 24–-21తో మూడు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగించింది. దేవాంక్ దూకుడు.. చివర్లో ముంబా మ్యాజిక్విరామం నుంచి వచ్చిన వెంటనే పట్నా పైరేట్స్ జట్టు పుంజుకుంది. అటువైపు అజిత్ రెయిండింగ్ జోరు కొనసాగించినా.. పైరేట్స్ ఆటగాడు దేవాంక్ ముంబా డిఫెండర్లను ఏమార్చాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని వస్తూ ఒకే రెయిడ్‌లో మూడు పాయింట్లు రాబట్టాడు. దాంతో పైరేట్స్ 30–28తో మళ్లీ ఆధిక్యం అందుకుంది. పట్నా డిఫెండర్లు కూడా పుంజుకొని ముంబా రెయిడర్లను నిలువరించారు. ఈ క్రమంలో జఫర్దానేష్ను ట్యాకిల్ చేసిన పట్నా జట్టు ముంబాను రెండోసారి ఆలౌట్ చేసి తన ఆధిక్యాన్ని 33–29కి పెంచుకుంది.దేవాంక్ మరో రెండు టచ్ పాయింట్లు రాబట్టడంతో పైరేట్స్ ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అజిత్‌కు తోడు ఆల్‌రౌండర రోహిత్ వెంటవెంటనే రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా 36–37తో ప్రత్యర్థికి చేరువై మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఆపై డూ ఆర్ డై రైడ్‌లో అజిత్ విజయం సాధిచడంతో స్కోరు 37–37తో సమం అయింది. చివరి నిమిషంలో పైరేట్స్ కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలగా.. దీన్ని ముంబా సద్వినియోగం చేసుకుంది. పట్నా ఆటగాడు సందీప్ ఓ పాయింట్ తెచ్చి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి క్షణాల్లో అతడిని ట్యాకిల్ చేసిన ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి రెండు పాయింట్లతో ఉత్కంఠ విజయం అందుకుంది -
యూ ముంబాదే విజయం
హైదరాబాద్, నవంబర్ 5: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూ ముంబా 32-26తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. మంజీత్(9 పాయింట్లు), జాఫర్దనేశ్(5), సోమ్‌బీర్(3)..యూ ముంబా విజయంలో కీలకమయ్యారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక టై ఎదుర్కొన్న ముంబా ప్రస్తుతం 19 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు పోరాడి ఓడిన ఢిల్లీ 14 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. ఢిల్లీ తరఫున అషు మాలిక్(11) సూపర్-10 సాధించినా లాభం లేకపోయింది. యోగేశ్(6), రింకూ నార్వల్(2) ఆకట్టుకున్నారు.ఆది నుంచే హోరాహోరీ: యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ ఆది నుంచే హోరాహోరీగా తలపడ్డాయి. స్టార్ రైడర్ నవీన్‌కుమార్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగగా, యూ ముంబా సమిష్టి తత్వాన్ని నమ్ముకుంది. ఇరు జట్లు తమ తొలి రైడ్లలో పాయింట్లను సొంతం చేసుకోలేకపోయాయి. లీగ్‌లో వరుస ఓటములతో ఢిల్లీ తల్లడిల్లుతుంటే యూ ముంబా ప్రయాణం పడుతూలేస్తూ అన్నట్లు సాగుతున్నది. సందీప్‌ను ఔట్ చేసిన అజిత్ చవాన్..ముంబాకు తొలి పాయింట్ అందించగా, డూ ఆర్ డైకు వెళ్లిన ఢిల్లీ రైడర్ అషు మాలిక్..పర్వేశ్‌ను ఔట్ చేసి ఢిల్లీ పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గేర్ మార్చిన యూ ముంబాకు మంజీత్ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు అందించి మంచి జోష్ నింపాడు.మరోవైపు అషు మాలిక్ వరుస రైడ్లలో ఢిల్లీకి పాయింట్లు అందిస్తూ పోవడంతో ఇరు జట్లు స్కోరు సమంగా సాగింది. ఢిల్లీ రైడర్ వినయ్ ఉత్త చేతులతో తిరిగిరాగా, అషు మాలిక్ తనదైన జోరు కొనసాగించాడు. మ్యాచ్ 13వ నిమిషంలో మంజీత్ స్థానంలో లోకేశ్ ముంబా జట్టులోకి వచ్చాడు. 11వ నిమిషంలో ముంబా రైడర్ జాఫర్దనేశ్..రింకూ నార్వల్ను ఔట్ చేసి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే 8వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన జాఫర్దనేశ్కు యోగేశ్ నుంచి చుక్కెదురైంది. ఇలా ఇరు జట్ల రైడర్లు, డిఫెండర్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రథమార్ధం ముగిసే సరికి యూ ముంబా 13-13 ఢిల్లీ దబాంగ్ సమవుజ్జీలుగా నిలిచాయి.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల ప్లేయర్లు అదే దూకుడు కొనసాగించారు. ఎక్కడా వెనుకకు తగ్గకుండా పాయింట్ల వేటలో దూసుకెళ్లారు. డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన ఢిల్లీ రైడర్ మోహిత్‌ను సోమ్భీర్ గట్టిగా పట్టుకోవడంతో ముంబా ఖాతాలో పాయింట్ చేరింది. అదే ఊపులో 17వ నిమిషంలో యోగేశ్, సందీప్‌ను ఔట్ చేసిన మంజీత్..ముంబాకు రెండు పాయింట్లు అందించాడు. నిమిషం తేడాతో జాఫర్దనేశ్..అశిష్, రింకూ నార్వల్ను ఔట్ చేయడంతో ఢిల్లీ తొలిసారి ఆలౌటైంది. ఈ క్రమంలో రెండు జట్లు సబ్స్టిట్యూషన్స్కు మొగ్గుచూపుతూ మార్పులు చేశాయి.ఓవైపు ఢిల్లీకి అషు మాలిక్ కీలకమైతే..మరోవైపు యూ ముంబాకు సునీల్ పెద్దదిక్కు అయ్యాడు. ఆట సాగుతున్నా కొద్ది యూ ముంబా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అషు మాలిక్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి ఢిల్లీకి పాయింట్ అందించడంలో సఫలమయ్యాడు. అయితే అతనికి రైడింగ్‌లో సహకరించే వారు కరువయ్యారు. మ్యాచ్ 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన రోహిత్ రాఘవ్‌ను బిజేంద్ర పట్టేయడంతో ఢిల్లీకి పాయిట్ దక్కింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఢిల్లీ గెలిచేందుకు ప్రయత్నించినా..పట్టు వదలకుండా పోరాడిన యూ ముంబా విజయం సొంతం చేసుకుంది. -
ఉత్కంఠ పోరులో జైపూర్‌దే పైచేయి
హైదరాబాద్, :ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో రెండు ఓటములు, ఒక టై తర్వాత మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగుతూ ఆధిపత్యం చేతులు మారిన పోరులో చివర్లో అద్భుతంగా ఆడిన జైపూర్... యూపీ యోధాస్‌కు చెక్ పెట్టి లీగ్‌లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ జట్టు 33–30 స్కోరుతో యూపీ యోధాస్‌పై గెలిచింది. జైపూర్ జట్టులో రెయిడర్ నీరజ్ నర్వాల్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. కెప్టెన్, మరో స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ ఐదు పాయింట్లతో రాణించాడు.ఈ క్రమంలో పీకేఎల్‌లో 1000 రెయిడ్ పాయింట్ల మైలురాయి చేరుకున్నాడు. యోధాస్ తరఫున ఆల్‌రౌండర్ భరత్ ఏడు, హితేశ్, సుమిత్ చెరో ఐదు పాయింట్లు రాబట్టినా తమ జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పించలేకపోయారు.హోరాహోరీ పోరుజైపూర్, యూపీ మధ్య ఆట ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్టు నడిచింది. ఇరు జట్లూ బలమైన డిఫెన్స్ ను ప్రదర్శించాయి. దాంతో ఆటలో ఆధిపత్యం కోసం శ్రమించాయి. బోనస్ ద్వారా అర్జున్ జైపూర్‌కు తొలి పాయింట్ అదించగా.. గగన్ యూపీ యోధాస్ ఖాతా తెరిచాడు. యూపీ డిఫెండర్లు రెండుసార్లు అర్జున్ను ట్యాకిల్ చేయగా.. రితిక్, భవానీ రాజ్‌పుత్ తెచ్చిన రైడ్ పాయింట్లతో ఆ జట్టు 6–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, జైపూర్ వెంటనే పుంజుకొని 6–6తో స్కోరు సమం చేసింది. ఇరు జట్లూ ఎక్కడా తగ్గకపోవడంతో స్కోరు బోర్డు 8–8, 11–11, 15–15తో సమంగా నడిచింది. తొలి అర్ధభాగానికి ముందు యూపీ జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలినా.. అర్జున్ను సూపర్ ట్యాకిల్ చేసి 17–15తో స్వల్ప ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.జైపూర్ జోరురెండో అర్ధభాగంలో యూపీ బలమైన డిఫెన్స్‌ను ప్రదర్శించింది. విరామం నుంచి వచ్చిన వెంటవెంటనే రెండు సూపర్ ట్యాకిల్స్‌తో నీరజ్, అర్జున్ను నిలువరించి 21–17తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. కానీ, జైపూర్ వెనక్కు తగ్గలేదు. ఆ జట్టు డిఫెండర్లు కూడా పుంజుకున్నారు. యోధాస్ కెప్టెన్ సురేందర్‌ను ట్యాకిల్ చేయడంతో పాటు కోర్టులో మిగిలిన సుమిత్‌ను నిలువరించిన పింక్ పాంథర్స్ 32వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 22–22తో స్కోరు సమం చేసింది. ఈ దశలో జైపూర్ కెప్టెన్ అర్జున్‌తో పాటు ఆ జట్టు మరో స్టార్ రెయిడర్ నీరజ్‌ను బెంచ్ మీదకు పంపించిన యూపీ 25–22తో తిరిగి ఆధిక్యం అందుకుంది. అయితే, చివరి పది నిమిషాల్లో జైపూర్ జోరు పెంచింది. నీరజ్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టగా.. డిఫెండర్లు కూడా ఆకట్టుకోవడంతో 36వ నిమిషంలో ప్రత్యర్థిని మరోసారి ఆలౌట్ చేసి 31–28తో మళ్లీ పైచేయి సాధించింది. ఆఖరి నిమిషాల్లో యూపీ యోధాస్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆధిక్యాన్ని కాపాడుకున్న జైపూర్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. -
పుణెరి పల్టాన్ మెరుపుల్
హైదరాబాద్, 3 నవంబర్ 2024 : పుణెరి పల్టన్ పీకెఎల్ సీజన్ 11లో నాల్గో విజయం సాధించింది. ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబాపై 35-28తో ఏడు పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ (10 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. మోహిత్ గోయత్ (9 పాయింట్లు), గౌరవ్ ఖత్రి (7 పాయింట్లు) ఆకట్టుకున్నారు. యు ముంబా తరఫున అజిత్ చవాన్ (9 పాయింట్లు), మంజిత్ (6 పాయింట్లు), ఆమిర్మొహమ్మద్ (4 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో రెండో ఓటమి తప్పలేదు. ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.పుణెరి పల్టాన్ మెరుపుల్యు ముంబా, పుణెరి పల్టన్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పుణెరి పల్టాన్ తొలి మూడు నిమిషాల్లో 4-0తో దూకుడు చూపించగా.. యు ముంబా నాల్గో నిమిషంలో పాయింట్ల ఖాతా తెరిచింది. యు ముంబా రెయిడర్లు మంజిత్, అజిత్ చవాన్‌లు రాణించటంతో ఆ జట్టు పుంజుకుంది. 10 నిమిషాల ఆట అనంతరం 8-7తో ఆధిక్యంలో నిలిచింది. చివరి పది నిమిషాల్లో పుణెరి పల్టన్ పుంజుకుంది. యు ముంబాను ఆలౌట్ చేసింది. అస్లాం ఇనాందార్, మోహిత్ గోయత్‌లు రెచ్చిపోవటంతో ప్రథమార్థంలో పుణెరి పల్టాన్ ఆరు పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. విరామ సమయానికి పుణెరి పల్టన్ 22-16తో యు ముంబాపై పైచేయి సాధించింది. రెయిడింగ్‌లో యు ముంబా 14 పాయంట్లతో మెరిసింది. పుణెరి పల్టన్ రెయిడింగ్‌లో 11 పాయింట్లే సాధించింది. డిఫెండర్లు రాణించటంతో పుణెరి పల్టన్ పైచేయి సాధించింది.విరామం తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్లు చెమటోడ్చాయి. చెరో ఆరు పాయింట్లు సాధించచటంతో 30 నిమిషాల అనంతరం 28-22తో పుణెరి పల్టన్దే పైచేయిగా నిలిచింది. పుణెరి పల్టన్‌ను ఆలౌట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని యు ముంబా వెనుకంజలోనే కొనసాగింది. ఆఖరు వరకు జోరు కొనసాగించిన పుణెరి పల్టన్ సీజన్లో నాల్గో విజయం సాధించింది -
PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్లో యూ ముంబా రెండో విజయం నమోదు చేసింది. జైపూర్ పింక్ పాంథర్స్‌పై 39-37తో గెలుపొందింది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో గురువారం మాజీ చాంపియన్లు యు ముంబా- జైపూర్ పింక్ పాంథర్స్ తలపడ్డాయి.ఈ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూ ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (14 పాయింట్లు) సూపర్ టెన్ షోతో అదరగొట్టాడు. మరోవైపు.. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆట తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజఇటు జైపూర్, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు సాధించారు. ఆట మొదలైన పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే, ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఆలౌట్ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది.ప్రథమార్థం ముగిసే సరికి యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా.. రెయిడింగ్‌లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్‌లో యూ ముంబా ఐదు, జైపూర్ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.ద్వితీయార్థం మరింత ఉత్కంఠఇక ఇరుజట్ల మధ్య ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను తిప్పలు పెట్టింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్ నర్వాల్ సూపర్ రెయిడ్‌తో 32-32తో జైపూర్ పింక్ పాంథర్స్.. యూ ముంబా స్కోరును సమం చేసింది.కానీ ఆ తర్వాతి రెయిడ్‌లోనే రోహిత్ రాఘవ్ సూపర్ రెయిడ్‌తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా మెరుపు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన జైపూర్‌కు ఇది రెండో ఓటమి.చదవండి: హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం -
PKL 11: తమిళ్ తలైవాస్ దూకుడు.. గుజరాత్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ జెయింట్స్‌పై తమిళ్ తలైవాస్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 44-25తో చిత్తు చేసింది. తద్వారా ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో గుజరాత్‌పై తమిళ్ తలైవాస్ గెలుపొందింది. సీజన్లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. మరోవైపు..ఈ సీజన్లోనాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం.కాగా గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్.. గుజరాత్‌తో తలపడింది అదరగొట్టింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్ (5 పాయింట్లు), డిఫెండర్ నితేశ్ కుమార్ (4 పాయింట్లు), ఆమీర్ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లలో గుమన్ సింగ్ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్ మూడు పాయింట్లతో మెరిశాడు.ఆకట్టుకున్న తలైవాస్..మ్యాచ్ప్రథమార్థం తొలి పది నిమిషాల్లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు గట్టిగా పోటీపడ్డాయి. అయితే, 11-9తో తమిళ్ తలైవాస్ పైచేయి సాధించింది. కానీ గుజరాత్ జెయింట్స్ రెట్టించిన ఉత్సాహంతో పోరాడింది. డిఫెన్స్‌లో తలైవాస్‌తో సమవుజ్జీగా నిలిచినా.. రెయిడింగ్‌లో జెయింట్స్ వెనుకంజ వేసింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్, సచిన్ మెరువగా.. గుజరాత్ జెయింట్స్ రెయిడర్లలో గుమన్ సింగ్ మాత్రమే మెప్పించాడు. దీంతో ప్రథమార్థం ఆట ముగిసేసరికి తమిళ్ తలైవాస్ 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.తలైవాస్ దూకుడు..విరామం అనంతరం తమిళ్ తలైవాస్ దూకుడు పెంచింది. తొలి 20 నిమిషాల్లో సాధించిన ఆధిక్యాన్ని.. ద్వితీయార్థంలో తొలి పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడిన గుజరాత్ జెయింట్స్ సెకండ్ హాఫ్‌లో చేతులెత్తేసింది.జెయింట్స్ కోర్టు ఖాళీ చేసిన తలైవాస్ విలువైన ఆలౌట్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆఖరు నిమిషంలో గుజరాత్ జెయింట్స్‌ను మరోసారి ఆలౌట్ చేసిన తమిళ్ తలైవాస్ ఏకపక్ష ప్రదర్శన చేసింది. చివరి 20 నిమిషాల ఆటలో తమిళ్ తలైవాస్ 26 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ కేవలం 11 పాయింట్లే సొంతం చేసుకుంది. -
ఎట్టకేలకు బెంగళూర్‌కు ఓ విజయం
హైదరాబాద్, 29 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి విజయం కావటం గమనార్హం. బెంగళూర్ బుల్స్ తరఫున 11వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌పై అడుగుపెట్టిన జై భగవాన్ (11 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్ (13 పాయింట్లు) సూపర్ టెన్తో మెరిసినా ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రథమార్థం దబంగ్‌దే : వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న బెంగళూర్ బుల్స్‌పై దబంగ్ ఢిల్లీ ధనాధన్ షో చేసింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలోనే 22-14తో ఏకంగా ఎనిమిది పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు ఆషు మాలిక్, వినయ్ అంచనాలు అందుకోవటంతో దబంగ్ ఢిల్లీకి ఎదురు లేకుండా పోయింది. కూతలో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ పోటీ ఇచ్చినా.. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది. మెరుపు ట్యాకిల్స్‌తో ప్రథమార్థంలో ఓసారి బెంగళూర్ బుల్స్‌ను ఆలౌట్ చేసింది. బుల్స్ సూపర్ షో : సెకండ్‌హాఫ్‌లో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ కూతలో ముందుండి నడిపించగా.. డిఫెండర్లు సైతం ట్యాకిల్స్‌తో మెరిశారు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ సైతం పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. దీంతో ద్వితీయార్థంలో సమవుజ్జీగా పాయింట్లు సాధించినా ప్రథమార్థంలో కోల్పోయిన ఆధిక్యం బెంగళూర్ బుల్స్‌ను వెంటాడింది. ఆఖరు పది నిమిషాల్లో అదరగొట్టే ప్రదర్శన చేసిన బెంగళూర్ బుల్స్ స్కోరు సమం చేసి ఏకంగా ఆధక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్‌ను దబంగ్ ఢిల్లీ నిలువరించినా.. జై భగవాన్ను ఆ జట్టు డిఫెండర్లు నిలువరించలేకపోయారు. 11 రెయిడ్ పాయింట్లతో మెరిసిన భగవాన్ బెంగళూర్ బుల్స్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆటలో మూడోంతుల భాగం ఆధిక్యంలో నిలిచిన దబంగ్ ఢిల్లీ.. ఆఖర్లో బోల్తా పడింది. -
PKL 11: నువ్వా- నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ ఎడిషన్‌లో మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠ రేపిన బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టాన్ పోరు 32-32తో టై అయ్యింది. మంగళవారం జరిగిన మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో బెంగాల్ వారియర్స్ లెక్క సరి చేసింది.ఇక ఈ సీజన్లో ఇది మూడో టై కావటం విశేషం. కాగా బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లలో రెయిడర్ సుశీల్ (10 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో మెరువగా.. నితిన్ కుమార్ (6 పాయింట్లు), నితేశ్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. పుణెరి పల్టాన్ తరఫున ఆకాశ్ షిండె (8 పాయింట్లు), పంకజ్ మోహిత్ (8 పాయింట్లు) రాణించారు. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,ఓ టైతో పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానం నిలుపుకోగా.. బెంగాల్ వారియర్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచింది.నువ్వా.. నేనా! అంటూ సాగిన సమరం బెంగాల్ వారియర్స్‌తో మ్యాచ్‌ను పుణెరి పల్టాన్ ఘనంగా ఆరంభించింది. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. ప్రతి కూతకు పాయింట్లు మారుతుండటంతో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ నడిచింది.తొలి పది నిమిషాల ఆట అనంతరం బెంగాల్ వారియర్స్ 7-6తో ఓ పాయింట్ ముందంజలో నిలిచింది. కానీ తర్వాతి పది నిమిషాల్లో పుణెరి పల్టాన్ పుంజుకుంది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి పుణెరి పల్టాన్ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. 15-12తో బెంగాల్ వారియర్స్‌పై పైచేయి సాధించింది.విరామం అనంతరం బెంగాల్ వారియర్స్ దూకుడు పెంచింది. రెయిడర్లు సుశీల్ సూపర్ టెన్ షోతో దూకుడు పెంచాడు. దీంతో బెంగాల్ వారియర్స్ వెనుకంజ నుంచి పుంజుకుని ఆధిక్యం కోసం పోటీపడింది. రెయిడింగ్‌లో నితిన్ కుమార్, డిఫెన్స్‌లో నితిన్ మెరవటంతో బెంగాల్ వారియర్స్ రేసులోకి వచ్చింది.చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలోఈ క్రమంలో.. 30-31తో ఓ పాయింట్ వెనుకంజలో ఉండగా విశ్వాస్ రెయిడ్ పాయింట్‌తో బెంగాల్ వారియర్స్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలో ఇరు జట్లు నిరాశపరిచాయి. ఆఖరు రెండు కూతల్లో ఎవరికీ పాయింట్ దక్కలేదు. దీంతో 32-32తో బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టాన్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమానంగా పంచుకున్నాయి. -
PKL 11: ఎదురులేని హర్యానా స్టీలర్స్
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్ అదరగొట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై హర్యానా స్టీలర్స్ పంజా విసిరింది. 41-34తో తిరుగులేని ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్ ఏడు పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ మహ్మద్రెజా (10 పాయింట్లు) సూపర్‌టెన్ షోతో మెరువగా.. శివమ్ (8 పాయింట్లు), జైదీప్ (5 పాయింట్లు) రాణించారు.దబంగ్ ఢిల్లీ తరఫున ఆషు మాలిక్ (13 పాయింట్లు), వినయ్ వీరేందర్ (8 పాయింట్లు) పోరాడినా ఫలితం దక్కలేదు. నాలుగు మ్యాచుల్లో దబంగ్ ఢిల్లీకి ఇది రెండో పరాజయం కాగా.. మూడు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్‌కు ఇది రెండో విజయం. స్టీలర్స్ దూకుడు : దబంగ్ ఢిల్లీతో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ ఆరంభం నుంచీ దూకుడు చూపించింది. రెయిడింగ్‌లో, ట్యాకిల్స్‌లో ఆధిపత్యం చూపించింది. ప్రథమార్థంలోనే దబంగ్ ఢిల్లీ కోర్టును ఖాళీ చేసిన హర్యానా స్టీలర్స్ విలువైన ఆలౌట్ పాయింట్లు సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ మహ్మద్రెజా, రెయిడర్ శివం, డిఫెండర్ జైదీప్ అంచనాలను అందుకున్నారు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ పాయింట్ల వేటలో తేలిపోయింది. కూతకెళ్లిన రెయిడర్లు నిరాశపర్చటం, ట్యాకిల్స్‌లో డిఫెండర్ల తడబాటు ప్రతికూలంగా మారాయి. తొలి 20 నిమిషాల ఆట ముగిసేసరికి హర్యానా స్టీలర్స్ ఏకంగా 11 పాయింట్ల ఆధిక్యం సాధించింది. 24-13తో ఏకపక్ష ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దబంగ్ ఢిల్లీ పోరాడినా.. : ద్వితీయార్థంలో దబంగ్ ఢిల్లీ ప్రదర్శన కాస్త మెరుగైనా.. హర్యానా స్టీలర్స్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఆ జట్టు పాయింట్లు సాధించలేదు. ప్రథమార్థంలో 11 పాయింట్ల లోటు భారీగా ఉండటంతో.. విరామం తర్వాత హర్యానా కంటే అధికంగా పాయింట్లు సొంతం చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. దబంగ్ ఢిల్లీ రెయిడర్ ఆషు మాలిక్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరువగా.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వినయ్ కూతకెళ్లి ఖతర్నాక్ షో చేశాడు. ఆషు మాలిక్, వినయ్ మెరువటంతో దబంగ్ ఢిల్లీ ఆఖరు వరకు పట్టు విడువలేదు. హర్యానా స్టీలర్స్ జోరు తగ్గినా.. ఆధిక్యం మాత్రం చేజార్చుకోలేదు. కీలక సమయంలో పాయింట్లు సాధించి ఎప్పటికప్పుడు పైచేయి నిలుపుకుంది. ద్వితీయార్థంలో దబంగ్ ఢిల్లీ 21 పాయింట్లు సాధించగా.. హర్యానా స్టీలర్స్ 17 పాయింట్లు మాత్రమే సాధించింది. -
టైటాన్స్ పరాజయాల ‘హ్యాట్రిక్’
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్ తర్వాత వరుసగా ఓడిపోతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37–41 స్కోరు తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో కంగుతింది. తెలుగు టైటాన్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి. కెప్టెన్ పవన్ సెహ్రావత్ జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటమే చేశాడు. 17 సార్లు కూతకెళ్లిన పవన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. 6 బోనస్ పాయింట్లు సహా మొత్తం 18 పాయింట్లు సాధించాడు. మరో రెయిడర్ ఆశిష్ నర్వాల్ (9) కూడా రాణించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 3, డిఫెండర్ సాగర్ 2 పాయింట్లు తెచ్చారు. అయితే ప్రత్యర్థి దబంగ్ ఢిల్లీ జట్టు తరఫున రెయిడర్లు కెపె్టన్ నవీన్ కుమార్, అశు మాలిక్ చెలరేగారు. ఇద్దరు చెరో 15 పాయింట్లతో జట్టు విజయానికి బాట వేశారు.వీళ్లిద్దరు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టడంతో తెలుగు టైటాన్స్ ఆఖరిదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో గెలిచి మూడింట ఓడింది. మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగే పోటీల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూపీ యోధాస్‌ను గుజరాత్ జెయింట్స్ ఢీకొంటుంది. బెంగాల్, యూ ముంబా మ్యాచ్ టై అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూ ముంబా, బెంగాల్ వారియర్స్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ 31–31 స్కోరు వద్ద టై అయ్యింది. వారియర్స్ జట్టులో రెయిడర్ మణిందర్ సింగ్ (8 పాయింట్లు), డిఫెండర్ మయూర్ కదం (6) అదరగొట్టారు. ఒకరు కూతకెల్లి పాయింట్లు తెస్తుంటే మరొకరు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్ చేసి పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో నితీశ్ కుమార్ (4), సుశీల్ కాంబ్రేకర్ (3), నితిన్ ధన్కర్ (3), కెప్టెన్ ఫజల్ అత్రాచలి (3) మెరుగ్గా ఆడారు. యూ ముంబా జట్టులో రెయిడర్ మన్జీత్ (7 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. -
PKL 11: తమిళ్ తలైవాస్ జోరు.. పుణెరి పల్టాన్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో తమిళ్ తలైవాస్ జోరు కొనసాగుతోంది. తొలుత తెలుగు టైటాన్స్‌ను ఓడించిన తలైవాస్.. తాజాగా మరో విజయం నమోదు చేసింది. రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు షాకిచ్చింది. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 35–30 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున రైడర్లు నరేందర్ కండోలా 9, సచిన్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్ నితేశ్ కుమార్ (5) హైఫైవ్ సాధించాడు.ఇక పుణెరి జట్టులో రైడర్ మోహిత్ గోయత్ (13) ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ను తలైవాస్ రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ ఆరంభం నుంచి జోరు కనబరిచింది. నరేందర్ వరుసగా రెండు టచ్ పాయింట్లు రాబట్టగా, పంకజ్, అస్లాంను తలైవాస్ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో ఆ జట్టు 4–0 ఆధిక్యంతో ఆటను ఆరంభించింది.అయితే, సచిన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి పల్టాన్ 5–6తో ముందుకొచ్చింది. మోహిత్ వరుసగా రెండు డబుల్ పాయింట్ల రైడ్లతో ఆకట్టుకోగా.. అస్లాం కూడా డబుల్ పాయింట్ రైడ్ చేయడంతో పుణెరి 10–11తో నిలిచింది. కానీ, కోర్టులో మిగిలిన అస్లాంను ట్యాకిల్ చేసిన తలైవాస్ 8వ నిమిషంలో పుణెరి ఆలౌట్ చేసి 14–11తో ముందంజ వేసింది. ఇక్కడి నుంచి పుణెరి డిఫెన్స్‌లో మెరుగైనా తమిళ జట్టు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. డూ ఆర్ డై రైడ్ కి వచ్చిన మోహిత్‌ను ట్యాకిల్ చేసి 19–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.సెకండాఫ్ మొదలైన వెంటనే సచిన్ ఓ టచ్ పాయింట్ తీసుకురాగా, ఆకాశ్‌ను నితేశ్ ట్యాకిల్ చేశాడు. డుబ్కితో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసిన అస్లాంను తలైవాస్ డిఫెండర్లంతా నిలువరించారు. దాంతో తలైవాస్ 22–15తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.ఈ దశలో పుణెరి డిఫెండర్లు సత్తా చాటారు. నరేందర్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి మరోసారి అతడిని నిలువరించింది. సాహిల్ ప్రత్యర్థికి దొరికిపోయినా సచిన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పల్టాన్ డిఫెండర్లు 21–24తో అంతరాన్ని తగ్గించారు. కానీ, తలైవాస్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నరేందర్ మళ్లీ రైడింగ్‌లో జోరు పెంచగా.. డిఫెండర్లు కూడా విజృంభించారు. ఈ క్రమంలో పుణెరిని రెండోసారి ఆలౌట్ చేసిన తలైవాస్ 30–22తో తన ఆధిక్యాన్ని భారీగా పెంచుకుంది. చివరి నిమిషాల్లో పుణెరి డిఫెండర్లు సూపర్ ట్యాకిల్స్ తో ఆకట్టుకోవడంతో ఓటమి అంతరం తగ్గింది. -
యూపీ యోధాస్ రెండో గెలుపు.. బెంగళూరు బుల్స్ హ్యాట్రిక్ ఓటమి
హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో యూపీ యోధాస్ రెండో విజయం సొంతం చేసుకోగా.. పర్దీన్ నర్వాల్ కెప్టెన్సీలోని బెంగళూరు బుల్స్ వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడి హ్యాట్రిక్ పరాజయం చవి చూసింది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 57-–36 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తుగా ఓడించింది. యూపీ యోధాస్ కెప్టెన్ సురేందర్ గిల్ 17 పాయింట్లతో విజృంభించాడు. ఆల్‌రౌండర్ భరత్ (14), డిఫెండర్ సుమిత్ (9) కూడా ఆకట్టుకున్నారు. బుల్స్ తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (16 ) సూపర్ టెన్ సాధించగా, జతిన్ (9) పోరాడాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను యూపీ మూడుసార్లు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆ జట్టు రైడర్లు ఆరంభం నుంచి కెప్టెన్ సురేందర్ గిల్, భరత్ వరుస రైడ్ పాయింట్లతో విజృంభించారు. జట్టుకు తొలి పాయింట్ అందించిన భరత్ ప్రత్యర్థి డిఫెండర్ల పట్టుకు చిక్కకుండా అలరించాడు. మరోవైపు సురేందర్ కూడా కోర్టులో పాదరసంలా కదులుతూ ఆకట్టుకున్నాడు. అదే సమయంలో యోధాస్ డిఫెండర్లు సైతం సత్తా చాటారు. బెంగళూరు తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్, జతిన్ పోరాడినా మిగతా రైడర్ల నుంచి వారికి సహకారం లభించలేదు.11వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్ చేసిన 15–9తో ముందంజ వేసింది. ఆపై, భరత్ వెంటవెంటనే రెండు సూపర్ రైడ్లతో అలరించాడు. రెండు ప్రయత్నాల్లో ముగ్గురేసి ఆటగాళ్లను ఔట్ చేశాడు. దాంతో నాలుగు నిమిషాల వ్యవధిలోనే బెంగళూరును రెండోసారి ఆలౌట్ చేసిన యూపీ యోధాస్ 24–10తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. ఇదే జోరుతో భరత్, సురేందర్ సూపర్ టెన్స్ పూర్తి చేసుకోగా.. యోధాస్ 33–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలోనూ భరత్, సురేందర్ జోరు కొనసాగింది. అటువైపు బుల్స్ కెప్టెన్ పర్దీప్ సూపర్ రైడ్ చేసి సూపర్ టెన్ పూర్తి చేసుకోగా జతిన్ కూడా మెప్పించాడు. కానీ, యూపీ ఏమాత్రం పట్టు విడవలేదు. ఇరు జట్లూ కొద్దిసేపు పోటాపోటీగా రైడ్ పాయింట్లు రాబట్టగా యోధాస్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లింది. 32వ నిమిషంలో మూడోసారి బెంగళూరును ఆలౌట్ చేసిన యూపీ 49–28తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పర్దీప్తో పాటు ఇతర ఆటగాళ్లు పోరాడినా అది బెంగళూరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. కాగా, బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో పుణెరి పల్టాన్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా పోటీ పడనుంది. -
గుజరాత్ జెయింట్స్ బోణీ
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు శుభారంభం చేసింది. గచ్చిచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ జెయింట్స్‌లో ప్రతీక్ దహియా 8, హిమాన్షు 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 39–34తో బెంగాల్ వారియర్స్ జట్టుపై విజయం సాధించింది. జైపూర్ జట్టు తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. 12 రెయిడింగ్ పాయింట్లతో సూపర్–10 ఖాతాలో వేసుకున్న అర్జున్ జట్టుకు కీలక సమయాల్లో ఆధిక్యం అందించాడు. అభిజిత్ మలిక్ 7 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ జట్టు తరఫున అత్యధికంగా నితిన్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. మణీందర్ సింగ్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8:00 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటల నుంచి) తలపడతాయి. -
బెంగాల్ వారియర్స్‌పై పింక్ పాంథర్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: కెప్టెన్, స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో ఆరంభించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 39–34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. అర్జున్‌తో పాటు రైడర్ అభిజీత్ మాలిక్ (7 పాయింట్లు) జైపూర్ విజయంలో కీలకంగా నిలిచాడు. బెంగాల్ జట్టులో నితిన్ ధాంకర్ (13) సూపర్ టెన్ సాధించగా, మణిందర్ సింగ్ (8), కెప్టెన్ ఫజెల్ అత్రాచలి (6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో జైపూర్ తన ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు బెంగాల్‌పై జైపూర్ పైచేయి సాధించింది. అర్జున్ దేశ్వాల్ను ట్యాకిల్ చేసిన నితేష్ కుమార్ జైపూర్‌కు తొలి పాయింట్ అందించగా.. వికాష్ ఖండోలా తన రైడ్‌లో నితేష్‌ను టచ్ చేసి బెంగాల్ ఖాతా తెరిచాడు. మరోసారి రైడ్‌కు వచ్చిన అర్జున్ను ఫజెల్ అత్రాచలి ట్యాకిల్ చేయగా.. మణిందర్ సింగ్ వరుసగా రెండు బోన్ పాయింట్లు తేవడంతో బెంగాల్ 5–2తో ఆరంభం ఆధిక్యం అందుకుంది. ఈ దశలో అర్జున్ దేశ్వాల్ ఒక్కసారిగా జోరు పెంచాడు.వరుసగా సక్సెస్ఫుల్ రైడ్లతో పాయింట్లు రాబట్టి 9–8తో పింక్ పాంథర్స్‌ను తొలిసారి ఆధిక్యంలోకి తెచ్చాడు. అతని దెబ్బకు బెంగాల్ కోర్టులో నితిన్ ధాంకర్ ఒక్కడే మిగిలిపోయాడు. నితిన్‌ను కూడా ట్యాకిల్ చేసి 11వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసిన జైపూర్ 12–9తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక్కడి నుంచి ఇరు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సుర్జీత్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చిన నితిన్ సూపర్ రైడ్ చేయడంతో బెంగాల్ 13–15తో ప్రత్యర్థిని అందుకునే ప్రయత్నం చేసింది. కానీ, మరోవైపు అర్జున్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు. జట్టును 21–15తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే, విరామానికి ముందు ఫజల్ అత్రాచలి సూపర్ ట్యాకిల్‌తో అర్జున్ను మరోసారి నిలువరించాడు. దాంతో తొలి అర్ధభాగాన్ని జైపూర్ 21–18తో మూడు పాయింట్ల ఆధిక్యంతో ముగించింది.రెండో భాగంలో బెంగాల్ డిఫెన్స్‌లో మెరుగైంది. ఆ జట్టు కెప్టెన్ ఫజల్ అత్రాచలి వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో సత్తా చాటడంతో 23–24తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, ఫజెల్ పోరాటం బెంగాల్‌ను మరో ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించలేపోయింది. 31వ నిమిషంలో బెంగాల్‌ను రెండోసారి ఆలౌట్ చేసిన జైపూర్ 29–25తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించుకుంది. కోర్టుపైకి పూర్తి జట్టు వచ్చిన తర్వాత బెంగాల్ పుంజుకుంది. రైడర్లు మణిందర్, నితిన్ తెలివిగా ఆడుతూ వరుసగా పాయింట్లు తీసుకొచ్చారు. అభిజీత్ మాలిక్‌ను ఔట్ చేసి నితిన్ సూపర్10 పూర్తి చేసుకోగా.. బెంగాల్ 30–32తో ముందుకొచ్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా నితిన్.. అర్జున్, లక్కీ శర్మను ఔట్ చేసి రెండు పాయింట్లు రాబట్టడంతో 34–35తో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. కానీ, మరోసారి రైడ్‌కు వచ్చిన నితిన్ సూపర్ ట్యాకిల్ చేసిన జైపూర్ విజయం సొంతం చేసుకుంది. -
PKL: తమిళ్ తలైవాస్ చేతిలో టైటాన్స్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ఆతిథ్య తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశ పరిచింది. తమిళ్ తలైవాస్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తలైవాస్ తరఫున నరేందర్ ఖండోలా, సచిన్ సూపర్ టెన్స్ విజృంభించడంతో టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు.హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 44–29 తేడాతో తెలుగు టైటాన్స్ ను చిత్తు చేసింది. ఆరంభంలో విజృంభించిన టైటాన్స్ ప్లేయర్ పవన్ సెహ్రావత్ (10) వరుసగా రెండో సూపర్ టెన్ సాధించినా.. ఆ తర్వాత తడబడ్డాడు. అనంతరం విజయ్ మాలిక్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో నరేందర్, సచిన్ చెరో పది పాయింట్లు తీసుకురాగా.. డిఫెండర్ సాహిల్ గులియా ఐదు పాయింట్లతో హై ఫైవ్ సాధించాడు.టైటాన్స్- తలైవాస్ పోరుసాగిందిలాతలైవాస్తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఆరంభంలో వరుస రైడ్ పాయింట్లతో చెలరేగాడు. మొదటి కూతలోనే సూపర్ రైడ్ చేయడంతో 3–0తో ఆటను ఆరంభించిన తెలుగు టైటాన్స్.. పవన్ డబుల్ రైడ్ పాయింట్‌తో 5–1తో ఆధిక్యం సాధించింది. కానీ,అభిషేక్ చేసిన ట్యాకిల్‌తో పవన్‌ను నిలువరించిన తలైవాస్ ఒక్కసారిగా జోరు పెంచింది. నరేందర్ ఖండోలా ముగ్గురు డిఫెండర్లను ఔట్ చేస్తూ సూపర్ రైడ్ చేయడంతో 7–6తో ఆధిక్యంలోకి వచ్చింది.ఆపై కోర్టులో మిగిలిన క్రిషన్, విజయ్ మాలిన్ ను సచిన్ అవుట్ చేశాడు. ఫలితంగా ఆరో నిమిషంలోనే తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సాహిల్, అభిషేక్ తృత్వంలోని డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో సెహ్రావత్ ను మరోసారి కోర్టు బయటికి పంపించిన తమిళ జట్టు తన ఆధిక్యాన్ని 14–9కి పెంచుకుంది.ఈ దశలో టైటాన్స్ రైడర్ విజయ్ మాలిక్ పోరాటంతో ఆతిథ్య జట్టు వెంటవెంటనే పాయింట్లు రాబట్టి 14–15తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, తలైవాస్ రైడర్ నరేందర్‌తో పాటు సచిన్ కూడా జోరు కనబరిచాడు.సెహ్రావత్ ఎక్కువ సేపు కోర్టు బయట ఉంచిన ఆ జట్టు 20–17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఓవైపు విజయ్ మాలిక్ రైడ్ పాయింట్లు రాబడుతున్నా.. కెప్టెన్ సెహ్రావత్ నిరాశ పరచడంతో మళ్లీ వెనకబడింది. ఇంకోవైపు సచిన్‌ను నిలువరించడంలో టైటాన్స్ డిఫెండర్లు పూర్తిగా విఫలమయ్యారు.31వ నిమిషంలో మరోసారి ఆలౌట్ చేసిన తలైవాస్ 31–21తో ఆధిక్యం సాధించింది. పూర్తి జట్టు కోర్టులోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు టైటాన్స్ తడబాటు మారలేదు. నరేందర్ తన సూపర్ టెన్ పూర్తి చేసుకుంటూ అంకిత్, అజిత్ పవార్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో మూడోసారి టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 40–24తో భారీ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి ఐదు నిమిమిషాల్లో తెలుగు జట్టు పోరాటం ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయింది. -
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. లీగ్‌లో ప్రతీ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన టైటాన్స్ ఈసారి శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించగా ... బెంగళూరు కెపె్టన్ ప్రదీప్ నర్వాల్ కేవలం 3 పాయింట్లే నమోదు చేసి విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–11తో 9 పాయింట్ల తేడాతో ముందంజలో నిలిచింది. అయితే ఆ తర్వాత కోలుకున్న బుల్స్ 18–11 పాయింట్లతో రెండో అర్ధభాగంలో ఆధిక్యం ప్రదర్శించింది. బుల్స్ తమ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయగా... టైటాన్స్ జట్టు బెంగళూరును రెండుసార్లు ఆలౌట్ చేసింది. పవన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 1200 రైడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 36–28 పాయింట్ల తేడాతో యు ముంబా జట్టును ఓడించింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
తొడగొట్టేందుకు సిద్ధం.. ప్రో కబడ్డీ లీగ్‌కు సర్వం సిద్దం
సాక్షి, హైదరాబాద్: పది సీజన్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడాది వ్యవధిలోపే మళ్లీ ముందుకు వచ్చింది. పీకేఎల్ 11వ సీజన్‌కు నేటితో తెర లేవనుంది. గత సీజన్కంటే భిన్నంగా ఈసారి మూడు వేదికలకే టోర్నీ లీగ్ దశను పరిమితం చేస్తున్నారు. సీజన్–10 ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే నేడు టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్ 9 వరకు ఇక్కడే పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత నోయిడా, పుణే తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. మరోసారి 12 టీమ్‌లతోనే పీకేఆల్ జరగనుండగా... లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) ఐదు మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు పీకేఎల్‌లో జరుగుతాయి. టోర్నీ తొలిరోజు జరిగే మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తలపడనుండగా... మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, యు ముంబా మధ్య రెండో మ్యాచ్ మ్యాచ్ (రాత్రి 9 గంటల నుంచి) జరుగుతుంది. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 24న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేస్తారు. భారీ వేలంతో మొదలు... సీజన్–11 కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లకు భారీ విలువ పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రూ. 1 కోటికి పైగా విలువతో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో ఏకంగా 8 మంది ఉండటం విశేషం. అత్యధికంగా తమిళ్ తలైవాస్ సచిన్ తన్వర్‌ను రూ.2 కోట్ల 15 లక్షలకు దక్కించుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు గురువారం హైదరాబాద్‌లో ట్రోఫీ ఆవిష్కరణ సహా లీగ్ ప్రచార కార్యక్రమం జరిగింది. పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. దశాబ్దకాలంగా తమ లీగ్‌కు మంచి ఆదరణ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన మున్ముందు టోర్నీని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. పీకేఎల్ రాకతో తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు వచ్చి0దని... డబ్బుతో పాటు గుర్తింపూ దక్కిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు పవన్ సెహ్రావత్, ప్రదీప్ నర్వాల్ వెల్లడించారు. టైటాన్స్ రాత మారేనా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైన నాటినుంచి లీగ్‌లో ఉన్న ఎనిమిది జట్లలో తెలుగు టైటాన్స్ కూడా ఒకటి. కానీ మిగతా ఏడు జట్లతో పోలిస్తే టైటాన్స్‌దే ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన. టైటాన్స్ మినహా మిగిలిన ఏడు జట్లు కనీసం ఒక్కసారైనా విజేతగా నిలవడం విశేషం. రెండో సీజన్లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటి వరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగానైతే మరీ చెత్త ప్రదర్శనతో చివరిదైన 12వ స్థానంలో నిలుస్తూ వచ్చి0ది. ఓవరాల్‌గా 10 సీజన్లలో కలిపి 192 మ్యాచ్‌లు ఆడితే 56 మాత్రమే గెలిచి 116 ఓడిపోయింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, లీగ్‌లో దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ కృషన్ కుమార్ హుడా ఈసారి టైటాన్స్ కోచ్‌గా రావడం జట్టుకు సానుకూలాంశం. అతని నేతృత్వంలో టీమ్ రాత మారుతుందా అనేది ఆసక్తికరం. వేలంలో ఎఫ్బీఎం ద్వారా రూ.1.72 కోట్లకు కెపె్టన్ పవన్ సెహ్రావత్‌ను టీమ్ కొనసాగించింది. విజయ్ మలిక్, అమిత్ కుమార్, సంజీవి వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే పవన్ మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి రైడర్ లేకపోవడం జట్టులో ఒక లోపం. ప్రఫుల్, ఓంకార్, మన్జీత్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. డిఫెన్స్‌లో కృషన్ ధుల్ రూపంలో కీలక ఆటగాడు ఉండగా... మిలాద్, అజిత్, సాగర్ నుంచి సహకారం అవసరం. పీకేఎల్–11లో పాల్గొనే జట్లు: తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్. -
నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. డిసెంబర్ 24 వరకు సాగే లీగ్ దశలో 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుణే ఇతర వేదికలుగా ఉన్నాయి. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో బెంగళూరు బుల్స్; ఢిల్లీ దబంగ్‌తో యు ముంబా ఆడతాయి. గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని జట్ల కెపె్టన్లు పాల్గొన్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడాలనుకునే కబడ్డీ అభిమానులు bౌౌజుఝyటజిౌఠీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. రూ.500, రూ.1000, రూ. 2500లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు నవంబర్ 9వ తేదీన ముగుస్తాయి. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలో... డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. -
PKL: షెడ్యూల్ పూర్తి వివరాలు.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే
Pro Kabaddi League Season 11: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆరంభ దశ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 18 నుంచి పీకేఎల్ ప్రారంభం కానుండగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగనున్న తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది.అదే రోజు జరగనున్న రెండో మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ పోటీపడుతుంది. మూడు వేదికల్లో పీకేఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించగా... అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లో పీకేఎల్ తొలి దశ సాగనుంది.ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో లీగ్ సాగనుంది. ఇక ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. గత నెలలో జరిగిన పీకేఎల్ వేలంలో మొత్తం 12 జట్లు తమ అస్త్రశ్రస్తాలకు పదును పెంచుకోగా... లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది మంది ప్లేయర్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)అక్టోబర్ 18, శుక్రవారం-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 19, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 20, ఆదివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు) అక్టోబర్ 21, సోమవారం- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 22, మంగళవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 23, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 24, గురువారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 25, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 26, శనివారం- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 27, ఆదివారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 28, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 29, మంగళవారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 30, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 31, గురువారం- పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 2, శనివారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 3, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 4, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 5, మంగళవారం- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 6, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 7, గురువారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 8, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 9, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)నవంబర్ 10, ఆదివారం- యూపీ యోధాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 11, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 12, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 13, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 14, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 15, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 16, శనివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 17, ఆదివారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 18, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 19, మంగళవారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 20, బుధవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 21, గురువారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 22, శుక్రవారంజైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 23, శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 24, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 25, సోమవారం- యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 26, మంగళవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 27, బుధవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 28, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 29, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 30, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 1, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)డిసెంబర్ 3, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 4, బుధవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 5, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 6, శుక్రవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 7, శనివారం- యూపీ యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 8, ఆదివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 9, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 10, మంగళవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 11, బుధవారంహర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 12, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 13, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 14, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 15, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 16, సోమవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 17, మంగళవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 18, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 19, గురువారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 20, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 21, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 22, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 23, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 24, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు) -
ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభ తేదీ ప్రకటన
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన మొదలవుతుంది. మూడు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబరు 18 నుంచి తొలి అంచె పోటీలు జరుగుతాయి. అనంతరం నవంబరు 10 నుంచి రెండో అంచె మ్యాచ్‌లకు నోయిడా నగరం ఆతిథ్యమిస్తుంది. చివరి అంచె పోటీలు డిసెంబరు 3 నుంచి పుణేలో జరుగుతాయని... పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. కాగా 2014లో ప్రొ కబడ్డీ లీగ్ మొదలైంది. ఇప్పటి వరకు 10 సీజన్లపాటు ఈ టోర్నీ జరిగింది. పుణేరి పల్టన్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యంపట్నా పైరేట్స్ జట్టు అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలువగా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రెండుసార్లు టైటిల్‌ను దక్కించుకుంది. బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, యు ముంబా, పుణేరి పల్టన్ జట్లు ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. తెలుగు టైటాన్స్ జట్టు రెండో సీజన్లో మూడో స్థానంలో, నాలుగో సీజన్లో నాలుగో స్థానంలో నిలిచింది. గత మూడు సీజన్లలో తెలుగు టైటాన్స్ జట్టు చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. -
PKL Auction: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ సహా పూర్తి వివరాలు
పది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆగష్టు 15, 16 తేదీల్లో ప్లేయర్ల వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో పీకేఎల్‌లో భాగమైన పన్నెండు ఫ్రాంఛైజీలు.. అంతా కలిపి 88 మంది ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.అయితే, అనూహ్య రీతిలో ప్రదీప్ నర్వాల్, పవన్ షెరావత్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా తదితర స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొననుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా, వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పర్సులో మిగిలి ఉన్న మొత్తం, వేలం ఆరంభ సమయం, లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడ తదితర వివరాలు మీకోసం..పన్నెండు జట్లు ఇవేతెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, యూ ముంబా, యూపీ యోధాస్.రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతెలుగు టైటాన్స్అంకిత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, సంజీవి ఎస్, నీల్, శంకర్ భీమ్రాజ్ గడాయ్, అజిత్ పాండురంగ పవార్.బెంగాల్ వారియర్స్శ్రేయాస్ ఉమర్దండ్, ఆదిత్య ఎస్ షిండే, దీపక్ అర్జున్ షిండే, మహరుద్ర గార్జే, నీల్, విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్.బెంగళూరు బుల్స్ఆదిత్య శంకర్ పవార్, అక్షిత్, అరుల్అనంతబాబు, ప్రతీక్, సౌరభ్ నందాల్, పొన్పార్తీబన్ సుబ్రమణియన్, సుశీల్, రోహిత్ కుమార్.దబాంగ్ ఢిల్లీఆశిష్, హిమ్మత్ అంతిల్, మనూ, యోగేశ్, నీల్, అన్షు మాలిక్, విక్రాంత్, నవీన్ కుమార్.గుజరాత్ జెయింట్స్నితిన్, ప్రతీక్ దహియా, రాకేశ్,బాలాజీ డి, జితేందర్ యాదవ్.హర్యానా స్టీలర్స్జయసూర్య ఎన్ఎస్, హర్దీప్, శివం అనిల్ పటారే, విశాల్ ఎస్ టాటే, జైదీప్, మోహిత్, వినయ్, రాహుల్ సేత్పాల్, ఘనశ్యామ్ రోకా మగర్.జైపూర్ పింక్ పాంథర్స్అభిజీత్ మాలిక్, అంకుశ్, అభిషేక్ కేఎస్, అర్జున్ దేశ్వాల్, రెజా మీరాఘెరిపట్నా పైరైట్స్అబినంద్ శుబాంశ్, కునాల్ మెహతా, సుధాకర్ ఎమ్, మనీశ్, అంకిత్, సందీప్ కుమార్.పుణెరి పల్టన్దదాసో శివాజీ పూజారి, నితిన్, తుషార్ దత్తాత్రేయ అధావడె, వైభవ్ బాలాసాహెబ్ కాంబ్లీ, ఆదిత్య తుషార్ షిండే, ఆకాశ్ సంతోశ్ షిండే, మోహిత్ గయత్, అస్లాం ముస్తఫా ఇనాందార్, పంకజ్ మోహితే, సంకేత్ సెహ్రావత్, అబినేశ్ నదరాజన్, గౌరవ్ ఖత్రీ.తమిళ్ తలైవాస్నితేశ్ కుమార్, నితిన్ సింగ్, రొనాక్, విశాల్ చహల్, నరేందర్, సాహిల్, మోహిత్, ఆశిష్, సాగర్, హిమాన్షు, ఎం. అభిషేక్, నీల్.యూ ముంబాబిట్టు, గోకులకన్నన్ ఎం, ముకిలన్ షణ్ముగం, సోంవీర్, శివం, అమీర్ మొహ్మద్ జఫార్దనేశ్, రింకూ.యూపీ యోధాస్గగన గౌడ హెచ్ఆర్, హితేశ్, శివం చౌదరి, సుమిత్, సురేందర్ గిల్, అశూ సింగ్, నీల్.ఒక్కో జట్టులో ఎంత మంది?కనీసం 18 నుంచి అత్యధిక 25 మంది ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉండవచ్చు. ఇప్పటికి 88 మందిని ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి గనుక 212 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.ఎంత మంది విదేశీ ఆటగాళ్లు?ఒక్కో జట్టులో కనీసం రెండు, అత్యధికంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు.టీమ్ పర్సు వివరాలుఒక్కో ఫ్రాంఛైజీ రూ. 5 కోట్ల మేర పర్సు వాల్యూ కలిగి ఉంటుంది. అయితే, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం చెల్లించిన మొత్తం పోగా.. మిగిలిన డబ్బుతో వేలంలో పాల్గొంటాయి.సీజన్-11 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీల పర్సులో మిగిలి ఉన్న మొత్తం👉బెంగాల్ వారియర్స్'- రూ. 3.62 కోట్లు👉బెంగళూరు బుల్స్- రూ. 3.02 కోట్లు👉దబాంగ్ ఢిల్లీ- రూ. 2.66 కోట్లు👉గుజరాత్ జెయింట్స్- రూ. 4.08 కోట్లు👉హర్యానా స్టీలర్స్- రూ. 2.32 కోట్లు👉జైపూర్ పింక్ పాంథర్స్- రూ. 2.29 కోట్లు👉పట్నా పైరేట్స్- రూ. 3.59 కోట్లు👉పుణెరి పల్టన్- రూ. 2.12 కోట్లు👉తమిళ్ తలైవాస్- రూ. 2.57 కోట్లు👉తెలుగు టైటాన్స్- రూ. 3.82 కోట్లు👉యు ముంబా- 2.88 కోట్లు👉యూపీ యోధాస్- 3.16 కోట్లు.నాలుగు కేటగిరీలు👉‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు👉‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. 👉‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు👉‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధర 👉ఈ సారి వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననున్నారు.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?ఆగష్టు 15 రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం(టీవీ). డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: అర్షద్ నదీమ్‌పై కానుకల వర్షం.. ఘన సత్కారం -
PKL: వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. తేదీలు ఖరారు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ నెల 15, 16తేదీల్లో ప్లేయర్ల వేలం జరగనుంది. పవన్ షెరావత్, ప్రదీప్ నర్వాల్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా వంటి పలువురు స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొంటున్నారు. 88 మంది ప్రధాన ప్లేయర్లను రీటెయిన్ చేసుకున్న 12 ఫ్రాంచైజీలు.. యువ ఆటగాళ్లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.నాలుగు కేటగిరీలువేలంలో పాల్గొంటున్న ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు కాగా.. ‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. ‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు, ‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధరగా నిర్ణయించారు. వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననుండగా.. ఒక్కో ఫ్రాంచైజీ ఐదు కోట్లు ఖర్చు చేయనుంది. -
PKL 10: పుణేరీ... తొలిసారి చాంపియన్‌గా
అద్భుతమైన ఆటతో లీగ్ దశలో అగ్ర స్థానం... 22 మ్యాచ్‌లలో 17 విజయాలు... స్కోరు తేడాలో ఎవరికీ అందనంత ఎత్తులో ముందంజ... ఈ సీజన్లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్ తమ జోరును తగ్గించకుండా అసలు పోరులోనూ సత్తా చాటి తమ స్థాయిని ప్రదర్శించింది... గత సీజన్లో త్రుటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా ఒడిసి పట్టుకుంది... ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తొలిసారి చాంపియన్‌గా సగర్వంగా నిలిచింది. మొదటిసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్ ఆరంభంలో ఆకట్టుకున్నా... ఒత్తిడిలో తలవంచి రన్నరప్‌కే పరిమితమైంది. సాక్షి, హైదరాబాద్: కబడ్డీ అభిమానులను 91 రోజుల పాటు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ అట్టహాసంగా ముగిసింది. అన్ని విధాలా ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్ మొదటిసారి లీగ్ చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో పల్టన్ 28–25 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 13–10తో ఆధిక్యంలో నిలిచిన పల్టన్ బలమైన డిఫెన్స్‌తో చివరి వరకు దానిని నిలబెట్టుకోవడంలో సఫలమైంది. గత సీజన్ ఫైనల్లో ఓడిన పుణేరీ వరుసగా రెండోసారి తుది పోరుకు అర్హత సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో ఇరు జట్లు ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చాయి. ఫలితంగా తొలి 10 నిమిషాల్లోనే 13 ఎంప్టీ రైడ్లు వచ్చాయి. ప్రతీ పాయింట్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... ఒకదశలో పుణేరీ 9–7తో స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. అయితే ఈ దశలో 19వ నిమిషంలో పంకజ్ మోహితే డు ఆర్ డై రెయిడ్ మ్యాచ్ దిశను మార్చింది. ఒకేసారి 4 పాయింట్లు సాధించి అతను పుణేను ముందంజలో నిలిపాడు. ఆ తర్వాత ఈ అంతరాన్ని తగ్గించడంలో స్టీలర్స్ విఫలమైంది. 23వ నిమిషంలో స్టీలర్స్‌ను పల్టన్ జట్టు ఆలౌట్ కూడా చేయడంతో ఆట పూర్తిగా వారివైపు మొగ్గింది. చివరి పది నిమిషాల్లో హరియాణా పుంజుకున్నా అది విజయానికి సరిపోలేదు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లూ 15 పాయింట్లు చొప్పున సమానంగా స్కోరు చేసినా... తొలి అర్ధ భాగంలో వెనుకబడిన 3 పాయింట్లే చివరకు స్టీలర్స్ ఓటమికి కారణమయ్యాయి. పల్టన్ తరఫున పంకజ్ మోహితే 9 పాయింట్లు సాధించగా... మోహిత్ 5, కెప్టెన్ అస్లమ్ 4 పాయింట్లు సాధించారు. స్టీలర్స్ ఆటగాళ్లలో అత్యధికంగా శివమ్ 6, సిద్ధార్థ్ దేశాయ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. విజేతగా నిలిచిన పుణేరీ జట్టుకు రూ. 3 కోట్లు, రన్నరప్ హరియాణా జట్టుకు రూ. 1 కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు. -
నేడే ‘ఫైనల్’ కూత...
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. గచ్చిబౌ లి ఇండోర్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ పోరుతో పదో సీజన్‌కు తెర పడనుంది. తొలిసారి తుది సమరానికి చేరుకున్న హరియాణా స్టీలర్స్‌తో గత ఏడాది రన్నరప్ పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ ఫైనల్‌కు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు జరగ్గా... పుణేరి పల్టన్ రెండోసారి... హరియాణా స్టీలర్స్ తొలిసారి ఫైనల్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమ సమరంలో ఏ జట్టు గెలిచినా తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడుతుంది. ఈ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్ జట్లు ముఖాముఖిగా 14 సార్లు తలపడ్డాయి. 8 సార్లు పుణేరి జట్టు... 5 సార్లు హరియాణా జట్టు గెలుపొందాయి. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. తాజా సీజన్లో నిర్ణీత 22 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పుణేరి జట్టు 17 మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండింటిలో ఓడి, మూడింటిని ‘టై’ చేసుకొని 96 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచి నేరుగా సెమీఫైనల్ చేరుకుంది. మరోవైపు హరియణా 70 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్–2లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి, సెమీఫైనల్ చేరిన హరియాణా ఈ కీలక పోరులో 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్ ఈ సీజన్లో అత్యధికంగా 117 రెయిండింగ్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్ విభాగంలో మొహమ్మద్ రెజా 97 ట్యాకిల్ పాయింట్లు సంపాదించాడు. పుణేరి పల్టన్ జట్టు కెపె్టన్ అస్లమ్ ఇనామ్దార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 164 పాయింట్లతో అదరగొట్టాడు. మరోవైపు హరియాణా స్టీలర్స్ రెయిడర్ వినయ్ ఏకంగా 160 పాయింట్లు కొల్లగొట్టాడు. డిఫెండర్ రాహుల్ 71 పాయింట్లు, కెపె్టన్ జైదీప్ 69 పాయింట్లతో ఆకట్టుకున్నారు. -
టైటిల్ పోరుకు పుణేరి, హరియాణా
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో కొత్త చాంపియన్ ఖాయమైంది. నిరుటి రన్నరప్ పుణేరి పల్టన్‌తో అమీతుమీకి తొలిసారి ఫైనల్‌కు చేరిన హరియాణా స్టీలర్స్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోనే ఫైన ల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జైపూర్ పింక్‌పాంథర్స్ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం చవిచూశాయి. తొలి సెమీస్‌లో పుణేరి పల్టన్ ధాటికి 37–21తో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పట్నా పైరేట్స్ నిలువలేకపోయింది. పుణేరి తరఫున కెపె్టన్, ఆల్‌రౌండర్ అస్లామ్ ముస్తఫా (7పాయింట్లు), రెయిడర్ పంకజ్ మోహితే (7) అదరగొట్టారు. మిగతా వారిలో మొహమ్మద్ రెజా చియనె 5, మోహిత్ గోయత్ 4, సంకేత్, అభినేశ్ చెరో 3 పాయింట్లు చేసి జట్టు విజయంలో భాగమయ్యారు. పట్నా జట్టులో రెయిడర్ సచిన్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు! మిగిలిన వారిలో మన్జీత్, సుధాకర్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో హరియాణా స్టీలర్స్ 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్‌ను కంగుతినిపించింది. స్టీలర్స్ రెయిడర్ వినయ్ 20 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. శివమ్ పతారే (7) కూడా అదరగొట్టాడు. మిగతావారిలో ఆల్‌రౌండర్ ఆశిష్ 4, డిఫెండర్లు రాహుల్ సేథ్‌పాల్ 3, మోహిత్ 2 పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేస్వాల్ (14) ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండర్ రెజా మిర్బగెరి 4, భవానీ రాజ్‌పుత్ 3 పాయింట్లు చేశారు. -
ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్’కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పదో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కీలక దశ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదికవుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి టోర్నీ విశేషాలను వెల్లడించారు. గత తొమ్మిదో సీజన్లతో పోలిస్తే ఈ సారి టోర్నీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చేరువైందని... 12 ఫ్రాంచైజీలకు చెందిన నగరాలు అన్నింటిలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన అన్నారు. గ్రూప్ దశలో టాప్–2లో నిలిచిన పుణేరీ పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో తలపడే ఇతర రెండు జట్లను ఖరారు చేసేందుకు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఢిల్లీని పటా్న, గుజరాత్‌ను హర్యానా ఢీకొంటాయి. ఈ నెల 26న ఎలిమినేటర్ మ్యాచ్‌లు, 28న సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్ నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర అభిమానులు ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 250 – రూ. 3000 మధ్య ‘బుక్‌మైషో’లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
PKL 10: ‘టాప్’ పుణెరి పల్టన్.. ప్లే ఆఫ్స్ సమరానికి సై
Pro Kabaddi League- పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధాస్‌పై గెలిచి ఓవరాల్‌గా 96 పాయింట్లుతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. A comeback of the 𝚑̶𝚒̶𝚐̶𝚑̶𝚎̶𝚜̶𝚝̶ 𝐏𝐚𝐥𝐭𝐚𝐧 order 💪 Aslam & Co. turned things around in style against Yoddhas to confirm their No. 1️⃣ spot 🫡#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL10 #PKL #HarSaansMeinKabaddi #PUNvUP #PuneriPaltan #UPYoddhas pic.twitter.com/wOG3cEARlu — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 హైదరాబాద్‌లో మిగిలిన మ్యాచ్‌లు మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 53–39తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్ టాప్–6లో నిలిచి ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించాయి. ఈనెల 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్లే ఆఫ్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ తాజా సీజన్లోనూ గత వైఫల్యాలు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. League stage ✅ Playoffs ⏳ Here’s what the points table looks like after the last league-stage game of #PKLSeason10 🤩#ProKabaddi #HarSaansMeinKabaddi #ProKabaddiLeague #PKL #PKL10 #PUNvUP #HSvBLR pic.twitter.com/KVfiBs14cS — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 -
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
PKL 10: బెంగాల్ వారియర్స్ అవుట్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్ని కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బెంగాల్ వారియర్స్ 26–29తో పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. దీంతో హరియాణా స్టీలర్స్‌కు నాలుగో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి రెయిడర్లు ఆకాశ్ షిండే 10, పంకజ్ మోహితే 6 పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ (5), మణిందర్ (4) రాణించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 45–43తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ (18) అదరగొట్టాడు. తలైవాస్ జట్టుల -
ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్ అర్హత
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో 21 మ్యాచ్‌లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్‌ను దాటే అవకాశం లేదు. ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. -
Pro Kabaddi League: సెమీస్‌లో పింక్ పాంథర్స్
Pro Kabaddi League 10-కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యూపీ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 67–30తో గెలిచింది. జైపూర్ ప్లేయర్ అర్జున్ 20 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో పింక్ పాంథర్స్ 82 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి రాగా... పుణేరి పల్టన్ 81 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు టాప్–2లో నిలవనున్నాయి. దాంతో ఈ రెండు జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 46–34తో యు ముంబాను ఓడించింది. చదవండి: Paris olympics: బ్రెజిల్‌కు బిగ్ షాక్.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్జెంటీనా -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ తెలుగు టైటాన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 55–35 స్కోరుతో టైటాన్స్‌పై విజయం సాధించింది. తెలుగు జట్టు తరఫున మిలాద్ జబారి 9, ప్రఫుల్ జవారే 8, పవన్ సెహ్రావత్ 6 పాయింట్లు సాధించగా...బెంగాల్ ఆటగాళ్ళలో నితిన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగాడు. టైటాన్స్‌కు ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లలో ఇది 17వ పరాజయం. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 44–23 స్కోరుతో యు ముంబాపై గెలుపొందింది. -
‘టాప్’లోకి జైపూర్ పింక్ పాంథర్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 27–22తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్‌లో పింక్ పాంథర్స్‌కిది 13వ విజయం కావడం విశేషం. ప్రస్తుతం పింక్ పాంథర్స్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. పుణేరి పల్టన్ 76 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 40–31తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో గుజరాత్ జెయింట్స్; హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. -
PKL 10: ‘ప్లే ఆఫ్స్’ చేరిన పుణేరి పల్టన్
PKL 10- న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. సోమవారం పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లూ 30–30 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి. పుణేరి తరఫున అస్లామ్ ముస్తఫా 10 పాయింట్లు స్కోరు చేయగా... దబంగ్ కెప్టెన్ అషు మలిక్ 8 పాయింట్లు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం 17 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 71 పాయింట్లు సాధించిన పుణేరి ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–33 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున కెప్టెన్ సచిన్, సుధాకర్ చెరో 10 పాయింట్లతో చెలరేగగా జైపూర్ ఆటగాళ్లలో అర్జున్ దేశ్వాల్ (12 పాయింట్లు) రాణించాడు. ఇదిలా ఉంటే.. జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో పాంథర్స్ తర్వాత టాప్-4కు చేరుకున్న రెండో జట్టుగా పుణేరి పల్టన్ నిలిచింది. అయితే, తెలుగు టైటాన్స్ మాత్రం ఈసారి కూడా కనీస ప్రదర్శన కనబరచలేక ఇప్పటికే పదహారు మ్యాచ్‌లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. చదవండి: Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్ సీరియస్ Admin's next task: Adding 𝐐 in the #PKLSeason10 Points Table graphic 😉@PuneriPaltan 🧡 join defending champions Jaipur Pink Panthers in confirming a #PKLPlayoffs spot 🔥#ProKabaddi #ProKabaddiLeague #PKL #HarSaansMeinKabaddi #PuneriPaltan pic.twitter.com/gBCs3zGJ6s — ProKabaddi (@ProKabaddi) February 5, 2024 సహజ సంచలన విజయం ముంబై: తెలుగమ్మాయి సహజ యమలపల్లి ముంబై ఓపెన్ (డబ్ల్యూటీఏ–125) టెన్నిస్ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్లో సహజ 6–4, 1–6, 6–4 స్కోరుతో వరల్డ్ నంబర్ 92, టాప్ సీడ్ కేలా డే (అమెరికా)ను ఓడించింది. మ్యాచ్‌లో 2 ఏస్‌లు కొట్టిన సహజ 4 డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. -
ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్ నిర్వాహకులైన మషాల్ స్పోర్ట్స్ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో పాయింట్ల పట్టికలో టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2 జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి. ఫిబ్రవరి 28న ఎలిమినేటర్–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్ ‘టాపర్’తో... ఎలిమినేటర్–2 విజేత లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్ మార్చి 1న జరుగుతుంది. -
PKL10: మనోళ్లు అట్టడుగున.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా పాంథర్స్
Pro Kabaddi League- పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–27తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ఈ టోర్నీలో పింక్ పాంథర్స్‌కిది 12వ విజయం కావడం విశేషం. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో పింక్ పాంథర్స్ 71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తలైవాస్‌తో మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. అట్టడుగున తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 29–29తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్; గుజరాత్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. ఈ జట్ల సంగతి ఇలా ఉంటే.. తెలుగు టైటాన్స్‌కు మాత్రం ఈ సీజన్ కూడా కలిసిరాలేదు. ఆడిన పదిహేడింట కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. Panthers first team through to the #PKLSeason10 playoffs 💥🤩 After some fiery action on the mat 🔥 Here’s how the standings look like after the final day of the Patna leg ⚡#ProKabaddiLeague #ProKabaddi #PKL #HarSaansMeinKabaddi #PATvBLR #JPPvCHE pic.twitter.com/t3zYwuCwl0 — ProKabaddi (@ProKabaddi) January 31, 2024 -
PKL 2024: తీరు మార్చుకోని తెలుగు టైటాన్స్.. మరో ఘోర ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ 15వ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం పట్నాలో పుణేరి పల్టన్‌తో జరిగిన పోరులో పవన్ సెహ్రావత్ నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ 29–60 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పుణేరి ఆల్‌రౌండ్ దెబ్బకు టైటాన్స్ జట్టు నాలుగుసార్లు ఆలౌటైంది. పల్టన్ తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ ప్లేయర్ సంజీవి అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (17 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు) టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. పుణేరి పల్టన్ 16 మ్యాచ్‌ల్లో 12 విజయలతో అగ్రస్థానంలో నిలిచింది. -
Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్‌కు ఎనిమిదో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్కిది ఎనిమిదో విజయం కావడం విశేషం. పట్నా తరఫున సందీప్ (7 పాయింట్లు), అంకిత్ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–36తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్ 12 పాయింట్లు, సిద్ధార్థ్ 11 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. -
తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పవన్ సెహ్రావత్ కెపె్టన్సీలోని తెలుగు టైటాన్స్ 29–54తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. బుధవారంతో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం పటా్నలో జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్; గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి. -
Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్ ‘టై’
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా ప్లేయర్ గుమన్ సింగ్ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
తీరు మారని తెలుగు టైటాన్స్.. 13వ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఖాతాలో 13వ పరాజయం చేరింది. హరియాణా స్టీలర్స్‌తో సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–37తో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున సంజీవి, ప్రఫుల్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–25తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. చదవండి: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం -
బెంగళూరుపై తమిళ్ తలైవాస్ విజయం..
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ 45–28 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ పోరులో తమిళ్ రెయిడర్లు నరేందర్ (14), అజింక్యా పవార్ (11) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చి పెట్టారు. డిఫెండర్లలో సాగర్ (5), సాహిల్ గులియా (4) రాణించారు. బెంగళూరు తరఫున రెయిడర్ అక్షిత్ (12) ఒంటరి పోరాటం చేశాడు. సుశీల్ 6 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. పుణేరీ తరఫున మొహమ్మద్ రెజా 9 పాయింట్లు మోహిత్ గోయత్ 7 పాయింట్లు సాధించారు. గుజరాత్ ఆటగాళ్లలో మొహమ్మద్ నబీబక్ష్ 7, ప్రతీక్ దహియా 5 పాయింట్లు నమోదు చేశారు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! -
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించి సొంత ప్రేక్షకుల్ని మురిపించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 49–32 స్కోరుతో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16 పాయింట్లు), ఓంకార్ (10) రాణించారు. అంతకుముందు జరిగిన తొలిపోరులో దబంగ్ ఢిల్లీ 39–33తో యు ముంబాపై నెగ్గింది. -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్‌కు షాక్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌కు షాక్ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు తమిళ్ తలైవాస్ చేతిలో 25-41 తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో పట్నాకు ఇది ఏడో పరాజయం. తలైవాస్ తరఫున అజింక్య పవార్ 10 పాయింట్లు, అభి 7 పాయింట్లు, నరేందర్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సుధాకర్ 8 పాయింట్లు సాధించాడు. -
PKL 2023-24: పుణేరీ పల్టన్‌కు షాక్
జైపూర్: సొంతగడ్డపై జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా రెండో విజయంతో సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 36–34 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను ఓడించింది. జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో చెలరేగాడు. పుణేరీ ఆటగాళ్ళలో కెప్టెన్ అస్లామ్ ముస్తఫా 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓడినా పుణేరీ పల్టన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సీజన్లో పల్టన్ 10 విజయాలు సాధించి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
PKL: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. పదకొండో పరాజయం
Pro Kabaddi League Telugu Titans 11th Defeat- జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–38తో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్‌కిది 11వ ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లు స్కోరు చేయగా... సందీప్ ధుల్, రాబిన్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 37–17తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. పుణేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ముస్తఫా 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్; యూపీ యోధాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. చదవండి: Ind vs Eng: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన -
PKL 2023: గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసిన దబంగ్ ఢిల్లీ
Pro Kabaddi League 2023- నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–28తో గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, మంజీత్ 9 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. రిత్విక్ జోడీ శుభారంభం థాయ్‌లాండ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) ద్వయం 6–3, 6–1తో సెచినాటో–ఫోనియో (ఇటలీ) జోడీని ఓడించింది. ఇదే టోర్నీలో ఆడుతున్న సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జంట తొలి రౌండ్లో 5–7, 6–3, 8–10తో రే హో (చైనీస్ తైపీ)–యున్ సేంగ్ చుంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
Pro kabaddi League 2023: మళ్లీ ఓడిన టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 18–54 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ జట్టు కెపె్టన్ పవన్ సెహ్రావత్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. పవన్ కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పవన్ ఒకసారి సఫలమై, మరోసారి బోనస్ పాయింట్ రాబట్టాడు. తొమ్మిదిసార్లు పాయింట్ సాధించకుండానే తిరిగి వచ్చాడు. టైటాన్స్ జట్టు మరో ప్లేయర్ సందీప్ ఐదు పాయింట్లు గెలిచాడు. మరోవైపు పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్, అస్లమ్ ముస్తఫా చెలరేగిపోయారు. మోహిత్ 13 పాయింట్లు, అస్లమ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. గౌరవ్ ఖత్రీ (6), అభినేశ్ (5), మొహమ్మద్ రెజా (5) కూడా రాణించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 48–41తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 21 పాయింట్లతో అదరగొట్టినా తన జట్టును గెలిపించలేకపోయాడు. చదవండి: సంజూ శాంసన్ భారీ సిక్సర్.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్ -
PKL 2024: టైటాన్స్‌కు ఏడో ఓటమి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–54తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. యు ముంబా తరఫున గుమన్ సింగ్ 10 పాయింట్లు, రింకూ 8 పాయింట్లు, సోంబీర్ 8 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున రజనీశ్ 8 పాయింట్లు, రాబిన్ చౌధరీ 7 పాయింట్లు, ప్రఫుల్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్; తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2023: స్టీలర్స్‌కు ఐదో విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 42–29తో తమిళ్ తలైవాస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ లీగ్‌లో స్టీలర్స్కిది ఐదో విజయం కావడం విశేషం. స్టీలర్స్ తరఫున శివమ్ ఎనిమిది పాయింట్లు సాధించగా... జైదీప్ దహియా, రాహుల్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. తలైవాస్ తరఫున సాహిల్ గులియా పది పాయింట్లు, హిమాన్షు సింగ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 38–29తో బెంగాల్ వారియర్స్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడుతుంది. 𝐒𝐚𝐠𝐚𝐫 - The captain of the Thalaivas' ship ⚓#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #CHEvHS #TamilThalaivas #HaryanaSteelers pic.twitter.com/tzFAzyje8j — ProKabaddi (@ProKabaddi) December 25, 2023 మెయిన్ ‘డ్రా’కు హుమేరా అర్హత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ హుమేరా బహార్మస్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో హుమేరా గెలిచి మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ‘బై’ పొందిన హుమేరా రెండో రౌండ్లో 6–1, 6–3తో అలెగ్జాండ్రా అజార్కో (రష్యా)పై, మూడో రౌండ్లో 3–6, 6–2, 6–4తో జెన్నిఫర్ లుఖమ్ (భారత్)పై విజయం సాధించింది. -
PKL 2023: పవన్ పోరాటం వృథా
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 -
PKL 2023: తలైవాస్‌పై పాంథర్స్ గెలుపు
Pro Kabaddi League 2023- చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్ 25–24తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. అర్జున్ దేశ్వాల్ (7 పాయింట్లు), రెజా మిర్బగెరి (5), సునీల్ కుమార్ (4), అజిత్ (3) రాణించారు. The Pink Panthers' 𝗿𝗲𝘇-son to 𝔹𝔼𝕃𝕀𝔼𝕍𝔼 🩷#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #CHEvJPP #TamilThalaivas #JaipurPinkPanthers pic.twitter.com/jCmyGWIsui — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 తలైవాస్ తరఫున హిమాన్షు నర్వాల్ 8 పాయింట్లు సాధించాడు. తద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది డేగా నిలిచాడు. ఇక తలైవాస్‌పై తాజా విజయంతో జైపూర్ పింక్‌పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు.. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 38–30తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. గుజరాత్ విజయంలో రెయిడర్ రాకేశ్ (14) కీలకపాత్ర పోషించాడు. Powerful Parteek with a Giant tackle 🤜🤛#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #GGvUP #GujaratGiants #UPYoddhas pic.twitter.com/My5I0MfTXS — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 బంగ్లా చేతిలో కివీస్ చిత్తు నేపియర్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న బంగ్లాదేశ్‌కు ఊరట విజయం దక్కింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాపై ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. యంగ్ (26) టాప్ స్కోరర్ కాగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తన్జీమ్ హసన్ (3/14), సౌమ్య సర్కార్, షరీఫుల్ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (51 నాటౌట్), అనాముల్ హక్ (37) రాణించారు. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్ 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. -
PKL: ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. ఉత్కంఠ పోరులో విజయం
Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–36తో హరియాణా స్టీలర్స్ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్ పవార్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx — ProKabaddi (@ProKabaddi) December 22, 2023 టాప్‌లో పుణెరి పల్టన్.. టైటాన్స్ చివర ఇక పీకేఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్ వారియర్స్ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్ పింక్ పాంథర్స్ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. చదవండి: విండీస్‌దే టి20 సిరీస్ తరూబా (ట్రినిడాడ్): సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్‌ను గెలుచున్న విండీస్ ఇప్పుడు టి20 సిరీస్‌నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుడకేశ్ మోతీ (3/24) ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ (43 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. -
జైపూర్ పింక్‌పాంథర్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 29–28తో గెలిచింది. జైపూర్ తరఫున అజిత్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేశాడు. -
PKL 2023: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ గెలుపు బోణీ
Pro Kabaddi League 2023- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 35–32తో గెలిచింది. విరామ సమయానికి 12–20తో వెనుకబడి ఉన్న జైపూర్ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుంది. రెయిడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 15 పాయింట్లు స్కోరు చేసి జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ సీజన్లో జైపూర్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. మరోవైపు.. గుజరాత్ జెయింట్స్ ఐదింట మూడు గెలిచి 17 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. 2️⃣4️⃣-carat magical raid ft. Sonu 😍#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #JPPvGG #JaipurPinkPanthers #GujaratGiants pic.twitter.com/vDrssOgxDi — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 బెంగళూరు బుల్స్ చేతిలో యూపీ యోధాస్ ఓటమి ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38–36తో యూపీ యోధాస్‌ను ఓడించి ఈ సీజన్లో ఐదో మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరు తరఫున వికాశ్, భరత్ 11 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మంగళవారం జరిగే మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. Announcing the yuddh in his style ⚔️ Pardeep Narwal for you 💪#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvUP #BengaluruBulls #UPYoddhas pic.twitter.com/HrUJXMKK3W — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 -
వారియర్స్ విక్టరీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ రెండో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 48–38 పాయింట్ల తేడాతో గెలిచింది. కెపె్టన్ మణీందర్ సింగ్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 13 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 35–33తో దబంగ్ ఢిల్లీ జట్టును ఓడించింది. -
దబంగ్ ఢిల్లీ బోణీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు గెలుపు బోణీ చేసింది. బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 38–31తో విజయం సాధించింది. ఢిల్లీ తరఫున నవీన్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేయగా... అశు మలిక్ తొమ్మిది పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున భరత్ 12 పాయింట్లు సంపాదించాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 43–32తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్; యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
గుజరాత్‌పై పట్నా పైచేయి
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ జెయింట్స్ జట్టుకు పట్నా పైరేట్స్ బ్రేక్ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 33–30 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో పట్నాకిది వరుసగా రెండో విజయంకాగా... గుజరాత్ జట్టుకిది తొలి పరాజయం. గుజరాత్‌తో మ్యాచ్‌లో పట్నా సమష్టి ఆటతో రాణించింది. పట్నా పైరేట్స్ తరఫున సుధాకర్ (6 పాయింట్లు), సచిన్ (4), నీరజ్ కుమార్ (4), అంకిత్ (4), సందీప్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. గుజరాత్ తరఫున రాకేశ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది. అంతకుముందు బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. బెంగాల్ తరఫున శ్రీకాంత్ జాదవ్ (7), నితిన్ కుమార్ (5), మణీందర్ సింగ్ (4)... జైపూర్ తరఫున భవాని రాజ్‌పుత్ (10) అర్జున్ దేశ్వాల్ (6) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ; పుణేరి పల్టన్‌తో యు ముంబా తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌కు నిరాశ
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెపె్టన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో రాణించాడు. పట్నా తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 57–27తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున సురేందర్ 13 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లు స్కోరు చేశారు. -
మాజీ ఛాంపియన్‌కు షాక్.. గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 39–37తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో గుజరాత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. రెయిడర్ సోనూ జగ్లాన్ 11 పాయింట్లు స్కోరు చేసి గుజరాత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. రాకేశ్ (9 పాయింట్లు), రోహిత్ గులియా (7 పాయింట్లు) కూడా రాణించారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్, అమీర్ మొహమ్మద్ పది పాయింట్ల చొప్పున స్కోరు చేసినా కీలకదశలో గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్; యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
Pro Kabaddi League 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గత సీజన్ రన్నరప్ పుణేరి పల్టన్ సంచలనంతో బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 37–33 పాయింట్ల తేడాతో గెలిచింది. తద్వారా గత సీజన్ ఫైనల్లో జైపూర్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. పుణేరి పల్టన్ జట్టు తరఫున కెప్టెన్ అస్లమ్ ముస్తఫా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పది పాయింట్లు సాధించాడు. రెయిడర్ మోహిత్ గోయట్ ఎనిమిది పాయింట్లతో... మొహమ్మద్ రెజా ఐదు పాయింట్లతో రాణించారు. జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా తన జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32–30తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. బెంగాల్ తరఫున రెయిడర్లు భరత్ (6 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (5 పాయింట్లు), విశాల్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగళూరు జట్టు కెపె్టన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. -
Pro Kabaddi League 2023: తలైవాస్ శుభారంభం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు శుభారంభం చేసింది. మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టుతో ఆదివారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 42–31 పాయింట్ల తేడాతో గెలిచింది. తలైవాస్ తరఫున రెయిడర్స్ అజింక్య పవార్ 21 పాయింట్లు, నరేందర్ 8 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. దబంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ నవీన్ కుమార్ 14 పాయింట్లు సాధించాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34–31తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ తరఫున సోను 12 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్; బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
PKL 2023: తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రో కబడ్డీ-2023 సీజన్‌ను ఓటమితో తెలుగు టైటాన్స్ ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జైంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38-32 పాయింట్ల తేడాతో టైటాన్స్ పరాజయం పాలైంది. ఫస్ట్‌హాఫ్‌లో తెలుగు టైటాన్స్ అధిక్యం కనబరచగా.. సెకెండ్ హాఫ్‌లో గుజరాత్ అనూహ్యంగా పుంజుకుని తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గుజరాత్ రైడర్ సోను జగ్లాన్ 5 పాయింట్ల రైడ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుజరాత్ రైడర్లలో సోనూతో పాటు రాకేష్ 5 పాయింట్లు, రోహిత్ గులియా 4 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్‌లో పవన్ సెహ్రావత్ ఆరు, రజనీష్ దలాల్ నాలుగు పాయింట్లు చేశారు. చదవండి: IND vs SA: 'నిజంగా సిగ్గు చేటు'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు -
సెప్టెంబర్ 8,9 తేదీల్లో ప్రొ కబడ్డీ వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ముంబైలో జరగనుంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లను ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న వారి కనీస ధర రూ. 30 లక్షలుగా... ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు కనీస ధర రూ. 20 లక్షలు... ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల కనీస ధర రూ. 13 లక్షలుగా... ‘డి’ కేటగిరీ క్రీడాకారుల కనీస ధర రూ. 9 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో 500కుపైగా క్రీడాకారులు బరిలో ఉన్నారు. తొమ్మిదో సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లలో ఆరుగురిని అట్టిపెట్టుకునే సౌలభ్యం ఆయా ఫ్రాంచైజీలకు ఉంది. మొత్తం 12 జట్లు ఈ లీగ్‌లో ఉన్నాయి. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి. -
మూడేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కబడ్డీ సందడి
-
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, 14 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్‌పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
PKL 2022: తొలిసారి చాంపియన్స్‌గా దబంగ్ ఢిల్లీ
Pro Kabaddi League 2022 Finals: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్ ఫైనల్లో దబంగ్ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్లో ఢిల్లీ తరఫున రెయిడర్లు నవీన్ కుమార్, విజయ్ మలిక్ అద్భుత ప్రదర్శన చేశారు. విజయ్ 14 పాయింట్లు, నవీన్ 13 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సచిన్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. పీకేఎల్ ఎనిమిదో సీజన్లో నవీన్ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా... మోహిత్ గోయట్ (పుణేరి పల్టన్; రూ. 8 లక్షలు) ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా... మొహమ్మద్ రెజా (పట్నా; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ డిఫెండర్’గా... పవన్ సెహ్రావత్ (బెంగళూరు బుల్స్; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ రెయిడర్’గా అవార్డులను సొంతం చేసుకున్నారు. -
PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్‌పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పర్దీప్ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్ సింగ్ (8), సచిన్ (7), రెజా (6), సునీల్ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగుతుంది. -
PKL 2022: సెమీఫైనల్స్‌కు యూపీ యోధ, బెంగళూరు బుల్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధ, బెంగళూరు బుల్స్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరాయి. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ యోధ 42–31తో పుణేరి పల్టన్‌పై గెలుపొందగా, బెంగళూరు బుల్స్ 49–29తో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో అస్లామ్, మోహిత్ గోయత్ రెయిడింగ్ పాయింట్లతో పుణేరి 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడో నిమిషంలో యూపీ ఆలౌటైంది. తర్వాత పర్దీప్ వరుసగా కూతకు వెళ్లి పాయింట్లు తెచ్చిపెట్టడంతో పుంజుకుంది. స్టార్ రెయిడర్ పర్దీప్ 18 పాయింట్లతో రాణించాడు. ప్రత్యర్థి పుణేరి జట్టులో అస్లామ్ ఇనామ్దార్ (10) మెరుగనిపించాడు. రెండో ఎలిమినేటర్ పోరులో బెంగళూరు సమష్టిగా రాణించింది. రెయిడర్లు పవన్ 13, భరత్ 6, రంజీత్ చంద్రన్ 7 పాయింట్లు సాధించగా, డిఫెండర్లు మహేందర్ సింగ్ 5, సౌరభ్ నందల్ 4, అమన్ 4 పాయింట్లు చేశారు. గుజరాత్ జట్టులో రాకేశ్ (8), మహేంద్ర రాజ్‌పుత్ (5) మెరుగనిపించారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో యూపీ... పట్నా పైరేట్స్‌తో, బెంగళూరు... దబంగ్ ఢిల్లీతో తలపడతాయి. -
రెండు జట్లకు చివరి అవకాశం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంది. నేడు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో యూపీ యోధతో పుణేరి పల్టన్; రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. నెగ్గిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఓడిన రెండు జట్లు నిష్క్రమిస్తాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. సెమీఫైనల్స్ 23న, ఫైనల్ 25న జరుగుతాయి. -
PKL 2022: 16వ పరాజయం.. మీరు ఆడడం దండగ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకు 16వ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–54 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్న తెలంగాణ ప్లేయర్ గల్లా రాజు రెడ్డి అద్భుత రెయిడింగ్‌తో ఆకట్టుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రాజు తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్‌లో నెగ్గి, నాలుగు మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 16 మ్యాచ్‌ల్లో ఓడి 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 52–21తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. -
ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్‌లు ఆడిన పట్నా 14 మ్యాచ్‌ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్‌లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
కబడ్డీ... కబడ్డీ...
‘కబడ్డీ.. కబడ్డీ’.. అని కూత పెట్టే ఆటగాళ్లు పాయింట్ కోసం బరిలో దిగుతారు. వేగం, ఒడుపు ఉండే ఆ ఆటలో తప్పొప్పులను ఎంచే రిఫరీ పని చాలా కష్టమైనది. నేడు ప్రో కబడ్డీ లీగ్‌లో పని చేస్తున్న పది మంది మహిళా రిఫరీలలో సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా, గృహిణిగా, తల్లిగా ఉంటూనే ఆమె కబడ్డీ రిఫరీగా ఆ ఉపాధి పట్ల యువతులకు కుతూహలం రేపుతోంది. కూత ఆపకూడదు. ప్రత్యర్థి శిబిరానికి చిక్క కూడదు. ఒకరినో ఇద్దరినో చిరుతలా తాకి సొంత శిబిరానికి చేరుకోవాలి. కబడ్డీ అసలు సిసలు భారతీయ పల్లె క్రీడ. ప్రధానంగా పురుష క్రీడ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆట ఆ తర్వాత క్రికెట్ దెబ్బకు చతికిల పడింది. తిరిగి కార్పొరేట్ అవసరాల కొద్దీ ప్రాణం పోసుకుంది. ఇసుక మైదానాల నుంచి ఖరీదైన ఇండోర్ స్టేడియంలలోకి, లైవ్ టెలికాస్ట్లలోకి, స్పాన్సరర్ల పూనికలోకి మారిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను అలరిస్తోంది. అందుకు కొత్త కొత్త మార్గాలను అవలంబిస్తోంది. 2014లో ‘ప్రో కబడ్డీ లీగ్’ మొదలైతే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఈ ఆటలో ఉపయోగిస్తున్నారు. అందుకు సాగిన సెలక్షన్లలో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన రిఫరీయే ఎంకె. సంధ్య. సీజన్ 6తో మొదలయ్యి ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి సాగుతున్న సీజన్ 8లో కూడా రిఫరీగా పని చేస్తున్న సంధ్య అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కబడ్డీ ప్లేయర్ ‘8వ తగతిలో ఉండగా మా స్కూల్ మైదానంలో కొంత మంది సీనియర్ అమ్మాయిలు కబడ్డీ ఆడటం చూశాను. నాకు ఆ ఆట నచ్చింది. అక్కా... నన్ను కూడా చేర్చుకోండి అని అడిగితే చిన్న పిల్లవు... వచ్చే సంవత్సరం టీమ్‌లోకి వద్దువులే అన్నారు. నేను వినలేదు. పీటీని అడిగి వెంటనే చేరిపోయాను’ అంటుంది సంధ్య. మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న సంధ్య తాను మాత్రమే ఈ ఆటను ఎంచుకున్నందుకు ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇంటర్లో చేరగానే సబ్ జూనియర్స్ నేషనల్ జట్టుకు ఆ తర్వాత జూనియర్స్ నేషనల్ జట్టుకు (2008) ఆడింది. ఆ తర్వాత కూడా ఆమె ఆట జోరుగా సాగేదేమో కాని జీవితం మారింది. ప్రేమ పెళ్లి సీనియర్ ఇంటర్లో ఉండగా సంధ్యకు కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్తో పరిచయమైంది. వెంటనే ప్రేమ ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. ‘మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. అందుకని మేము వెల్లూరు వదిలి చెన్నైకు వచ్చేశాము’ అంది సంధ్య. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు కొడుకు పుట్టాడు. జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంతివరన్కు సంధ్య టాలెంట్ తెలుసు. ‘మళ్లీ నువ్వు కబడ్డీ ఆడు’ అని ఆమెతో చెప్పాడు. ఆమెను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కాని వివాహం అయ్యి, బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి పూర్వపు ఫిట్నెస్తో ఆడటం అంత సులభం కాదు. ‘మేమిద్దం చాలా కష్ట పడ్డాం. ఉదయం 5 నుంచి ఆరున్నర వరకూ కబడ్డీ ఆడేదాన్ని. తిరిగి నా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఆడేదాన్ని. అతను నా కోసం స్పెషల్ డైట్ కూడా ఫిక్స్ చేశాడు. కొత్తల్లో ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. కాని పట్టుదలగా ఫిట్నెస్ సాధించి తిరిగి కబడ్డీ ప్లేయర్‌గా మారాను’ అంది సంధ్య. ఇప్పుడు సంధ్య దక్షిణ భారత మహిళ కబడ్డీ టీమ్‌లతో కలిసి కబడ్డీ ఆడటం మొదలెట్టింది. అంతే కాదు భర్త ప్రోత్సాహంతో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేసింది. 2015 వరకూ మహిళా కబడ్డీ ప్లేయర్‌గా ఉన్న సంధ్య వెల్లూరులో తల్లి అనారోగ్యం వల్ల కొంత, పిల్లాణ్ణి ఒక్కణ్ణే వదిలేసి టోర్నమెంట్లకు వెళ్లే వీలు లేక కొంత కబడ్డీ ఆటకు దూరమైంది. తిరిగి ఆ దంపతులు వెల్లూరు చేరుకున్నారు. పిఈటీగా... వెల్లూరులో స్ప్రింగ్ డేస్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరింది సంధ్య. వెల్లూరులో పని వెతుక్కున్న భర్త ‘కబడ్డీ రిఫరీలకు డిమాండ్ ఉంది. ఆ పరీక్షలు రాయి’ అని ప్రోత్సహించాడు. సంధ్య ‘అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే రిఫరీ పరీక్షను రాసి పాసైంది. ఆ వెంటనే ఆమెకు డిస్ట్రిక్ లెవల్, ఇంటర్ జోన్ మేచ్లకు రిఫరీగా ఉండే అవకాశాలు రావడం మొదలయ్యింది. స్కూల్లో పని చేస్తూనే, కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే, మేచ్ ఉన్నప్పుడు రిఫరీగా బయలుదేరి వెళుతోంది సంధ్య. ప్రొ కబడ్డీ లీగ్ రిఫరీగా ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ కోసం మహిళా రిఫరీల సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి వాటిలో పాల్గొని ఎంపికైంది సంధ్య. ఇది పెద్ద విజయమే. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ చాలా ప్రొఫెషనల్‌గా సాగుతాయి. స్పాన్సర్‌షిప్‌లతో ముడిపడిన వ్యవహారం. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కనుక రిఫరీలు తప్పులు చేయడానికి లేదు. ‘టోర్నమెంట్ సాగుతున్నన్ని రోజులు మేము ఉదయాన్నే మా ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ముందు రోజు ఆటను అవలోకించాలి. ఆ రోజు జరిగే ఆటను అంచనా వేయాలి. అప్పుడు మేము మేచ్‌కు రెడీ అవుతాం’ అంటుంది సంధ్య. ప్రతి మేచ్‌కు ఒక మెయిన్ రిఫరీ, ఇద్దరు అంపైర్లు, ఇద్దరు లైన్ రిఫరీలు, ఇద్దరు అసిస్టెంట్ రిఫరీలు ఉంటారు. మెయిన్ రిఫరీగా వీరిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యకు. ‘మేచ్లలో సిగ్నల్స్‌ను సాధన చేస్తాం మేము. అలాగే ఒక్కోసారి ఆటగాళ్లు పాయింట్స్ కోసం వాదనకు దిగుతారు. వారికి మా నిర్ణయం సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. వారు ఆగ్రహంలో ఉంటారు. మేము స్థిమితంగా మాట్లాడాలి. మేము కూడా కోప్పడితే అంతా రసాభాస అవుతుంది’ అంటుంది సంధ్య. మారుతున్న కాలానికి మారుతున్న మహిళా క్రీడా ప్రతినిధి సంధ్య. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా..
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు. చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్‌ని గెలిపించిన సచిన్
Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్‌లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్‌కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
Pro Kabaddi League: అయ్యో.. మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
Pro Kabaddi League: - బెంగళూరు: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ‘టై’ లేదంటే ఓటమితో పదేపదే నిరాశపరుస్తోన్న తెలుగు జట్టు గురువారం జరిగిన మరో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. తమిళ్ తలైవాస్‌తో జరిగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్ 25–43 స్కోరుతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో గల్లా రాజు (9 పాయింట్లు) రాణించాడు. తలైవాస్ జట్టులో రెయిడర్ అజింక్యా పవార్ 10 పాయింట్లు సాధించాడు. ఇంతవరకు ఒక్కటే మ్యాచ్ గెలిచిన టైటాన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
Pro Kabaddi League: ఎదురులేని బెంగళూరు బుల్స్.. తొమ్మిదో విజయం
Pro Kabaddi League 2021- 2022: Bengaluru Bulls Beat UP Yoddha: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ జట్టు తొమ్మిదో విజయం సాధించింది. యూపీ యోధతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 31–26 పాయింట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్ అమన్ ఏడు పాయింట్లు సాధించాడు. ఇక యూపీ యోధ తరఫున శ్రీకాంత్ జాదవ్, నితీశ్ కుమార్ ఆరు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 25–34 తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. -
తెలుగు టైటాన్స్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్, తెలుగు టైటాన్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ 39–39 వద్ద టైగా ముగిసింది. టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10, రోహిత్ కుమార్ 8, సందీప్, ఆదర్శ్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 22 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమ 11వ మ్యాచ్‌లో ఎట్టకేలకు తొలి గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–34తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ ఎనిమిది పాయింట్లు... మరో రెయిడర్ ఆదర్శ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ 13 పాయిం ట్లు స్కోరు చేశాడు. టైటాన్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–30తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. -
Pro Kabaddi League: దబంగ్ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి
Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఏడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 32–29తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ సందీప్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఈ లీగ్ చరిత్రలో సందీప్ రెయిడింగ్ పాయింట్ల సంఖ్య 250 దాటింది. గుజరాత్ జెయింట్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ 24–24తో ‘టై’ అయింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! -
Pro Kabaddi League: బెంగళూరు రికార్డు విజయం... ఏకంగా..
Bengaluru Bulls Record Breaking 39 Point Win: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ ఆరో విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 61–22తో ఘనవిజయం సాధించింది. 39 పాయంట్లతో గెలుపొంది రికార్డు సృష్టించింది. బెంగళూరు రెయిడర్ పవన్ సెహ్రావత్ ఏకంగా 27 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. హరియాణా స్టీలర్స్, యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 36–36తో ‘టై’గా ముగిసింది. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పరాజయం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం ముగిసింది. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రజ్నేశ్ 2–6, 6–7 (8/10)తో మాక్సిమిలాన్ మార్టెరర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. గంటా 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 23 అనవసర తప్పిదాలు చేశాడు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
Pro Kabaddi League: రాత మారలేదు.. మళ్లీ ఓడిన టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 22–40తో ఓడింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేసి 12 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్ -
జైపూర్, తలైవాస్ విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 30–28 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. మరో పోరులో తమిళ్ తలైవాస్ 45–26 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. రెండో రౌండ్‌కు ప్రజ్నేశ్ భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–4, 6–3తో మూడో సీడ్ డానియెల్ ఇలాహి గలాన్ (కొలంబియా)ను ఓడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6 ఏస్‌లు కొట్టాడు. తర్వాతి పోరులో అతను మ్యాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)తో తలపడతాడు. -
Pro Kabaddi League: 3 పరాజయాల తర్వాత ఎట్టకేలకు..
బెంగళూరు: వరుసగా మూడు పరాజయాల తర్వాత జైపూర్ పింక్‌పాంథర్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మళ్లీ విజయం రుచి చూసింది. పుణేరి పల్టన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 31–26తో గెలిచింది. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో జైపూర్, హరియాణా జట్లకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
Pro Kabaddi League: తమిళ్ తలైవాస్ విజయం
Pro Kabaddi League: Tamil Thalaivas Beat UP Yoddhas With 39- 33: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ రెండో విజయం నమోదు చేసింది. యూపీ యోధతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 39–33తో గెలిచింది. తలైవాస్ తరఫున మంజీత్ ఏడు పాయింట్లు, అజింక్య పవార్ ఆరు పాయింట్లు సాధించారు. హరియాణా స్టీలర్స్, యు ముంబా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 24–24తో ‘టై’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో గుజరాత్ జెయింట్స్; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా -
IPL 2022 Auction: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ మెగా వేలం వాయిదా..!
IPL 2022 Auction: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్- 2022 మెగా వేలం నిర్వహణ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా వేదిక సైతం బెంగళూరు నుంచి మార్చనున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వ తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేదిక మార్పు తప్పనిసరి అయితే... కోల్‌కతా, కొచ్చి, ముంబైలలో ఏదో ఒక నగరంలో వేలం నిర్వహించాలని భావించినా ఆయా చోట్ల కూడా కరోనా కేసుల్లో పెరుగదల కారణంగా ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించినట్లుగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో కాకుండా కొత్త తేదీలను ఖరారు చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. తాజా కోవిడ్ నిబంధనల కారణంగా హోటళ్లలో గదులు బుకింగ్ ఆలస్యమవుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయాల గురించి బీసీసీఐ సీనియర్ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘మన చేతుల్లో ఏమీ ఉండదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వేచిచూడక తప్పదు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల అధికారులతో మాట్లాడుతున్నాం. ఒకవేళ వేదిక మార్చాల్సి వస్తే తప్పక అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తాం’’అని పేర్కొన్నారు. కాగా ప్రొ కబడ్డి లీగ్ బెంగళూరులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వైట్‌ఫీల్డ్ హోటల్లోని షెరాటన్ గ్రాండ్‌ను నిర్వాహకులు ఉపయోగించుకుంటున్నారు. మిగతా హోటళ్లు అందుబాటులో ఉన్నా గురువారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో సామూహిక సమావేశాలకు అనుమతి కష్టంగానే మారనుంది. ఇక ఐపీఎల్ మెగా వేలం అంటేనే వందల సంఖ్యలో అధికారులు హాజరవుతారు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వేదిక మార్చాలా వద్దా అన్న అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. చదవండి: IPL 2022: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... వేలంలోనైనా! -
Pro Kabaddi League: సూపర్ వికాస్... హరియాణా స్టీలర్స్ అద్భుత విజయం
Pro Kabaddi League: చివరి సెకన్లలో కెప్టెన్ వికాస్ కండోలా అద్భుతంగా రెయిడింగ్ చేసి ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టును 38–36తో గెలిపించాడు. మ్యాచ్ చివరి నిమిషంలో వికాస్ రెండుసార్లు రెయిడింగ్‌కు వెళ్లి ఒక్కో పాయింట్ చొప్పున సాధించి హరియాణా ఖాతాలో విజయం చేర్చాడు. ఈ మ్యాచ్‌లో వికాస్ మొత్తం 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40–29 పాయింట్లతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
బెంగాల్ వారియర్స్‌కు పట్నా పైరేట్స్ షాక్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌కు షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్ మోనూ గోయట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్ సింగిల్ రెయిడ్‌లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు. మ్యాచ్ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ లీగ్ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్‌లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 36–26తో పుణేరి పల్టన్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు 39–37తో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున మీతూ 12 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ చెరో 9 పాయిం ట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–26తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. -
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
‘టై’తో మొదలుపెట్టిన టైటాన్స్
బెంగళూరు: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ‘టై’తో ఆరంభించింది. బుధవారం టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 స్కోరుతో సమంగా ముగిసింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ 11 పాయింట్లు సాధించగా, డిఫెండర్లలో సందీప్ 5, రుతురాజ్, అరుణ్ మూడేసి పాయింట్లు తెచ్చి పెట్టారు. మ్యాచ్‌లో తలైవాస్ రైడర్ మన్జీత్ సత్తా చాటాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 3 బోనస్ పాయింట్లు సహా 12 పాయింట్లు స్కోరు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ రైడర్ సిద్ధార్థ్, రజ్నీశ్ జట్టుకు వరుస పాయింట్లు సాధించిపెట్టారు. డిఫెండర్ సందీప్ కండోలా కూడా ప్రత్యర్థి రైడర్లను చేజిక్కించుకోవడంతో టైటాన్స్ జట్టు 8 నిమిషాల్లోనే తలైవాస్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం తలైవాస్ రైడర్ మన్జీత్ దీటుగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మన్జీత్ చేసిన సూపర్ రైడ్ ఏకంగా 3 పాయింట్లు తెచ్చిపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం మారిపోయింది. తొలి అర్ధ భాగం 23–21 వద్ద ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రమించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒక దశలో ఇరు జట్ల రైడర్లు విఫలమైతే డిఫెండర్ల హవా కొనసాగింది. తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేయడం ద్వారా తలైవాస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే సిద్ధార్ధ్ దేశాయ్ కీలక దశలో రైడింగ్‌కు వెళ్లినప్పుడల్లా పాయింట్లు సాధించడంతో టైటాన్స్ పుంజుకుంది. ఇంకో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తన రైడింగ్ పాయింట్‌తో తమిళ్ తలైవాస్ రెండోసారి ఆలౌటైంది. అక్కడే స్కోరు సమమైంది. టాకిల్‌తో సందీప్, రైడింగ్‌తో సిద్ధార్థ్ తెలుగు జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇతర మ్యాచ్‌లలో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్‌పై...బెంగాల్ వారియర్స్ 38–33తో యూపీ యోధపై గెలిచింది. సిద్ధార్థ్ దేశాయ్ -
Pro Kabaddi League Season 8: కబడ్డీ కూతకు వేళాయే..సరికొత్తగా రీఎంట్రీ..