
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో బెంగళూరు బుల్స్ జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ 28–23 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 8 రెయిడ్ పాయింట్లతో సత్తా చాటగా... దీపక్ (5 పాయింట్లు), సత్యప్ప (4 పాయింట్లు) రాణించారు.
జైపూర్ జట్టు తరఫున నితిన్ కుమార్ 8 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 46–36 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా నేడు యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.