ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. బుధవారం ఢిల్లీ వేదికగా పుణేరి పల్టన్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 50-45 తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి తెలుగు టైటాన్స్ నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్‌లో మొదటి నుంచి టైటాన్స్ ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆఖరిలో అనవసర తప్పిదాల వల్ల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.
భరత్ పోరాటం వృథా..
ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండర్ భరత్ హుడా సత్తాచాటాడు. మొత్తంగా 23 రైడ్ పాయింట్లతో హుడా మెరిశాడు. కానీ మిగితా రైడర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టైటాన్స్ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా టైటాన్స్ డిఫెండర్లు పుణేరి పల్టన్ రైడర్లను టాకిల్ చేయడంలో విఫలమయ్యారు. పుణేరి పల్టన్ రైడర్ ఆదిత్య షిండే 22 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.


