 
													లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్ల మధ్య ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు రెండోసారి పీకేఎల్ విన్నర్స్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియం ఈ మెగా ఫైనల్‌కు వేదిక కానుంది.
ఈ సీజన్‌లో పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. మూడు సార్లూ మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో సమంగా ముగిసి ఫలితం ‘టైబ్రేక్’లో తేలింది. ‘టైబ్రేక్’లో దబంగ్ ఢిల్లీ రెండుసార్లు గెలుపొందగా... ఒకసారి పుణేరి పల్టన్ విజయాన్ని అందుకుంది.
ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున ఫజల్, సౌరభ్, నీరజ్, ఆశు మలిక్... పుణేరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే, అస్లామ్, పంకజ్ నిలకడగా రాణించారు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే టైటిల్ పోరును స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
