ప్రపంచకప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఢాకా వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్ 33–21 పాయింట్ల తేడాతో ఇరాన్ జట్టును ఓడించింది. మరో సెమీఫైనల్లో చైనీస్ తైపీ 25–18 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.
నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది. మొత్తం 11 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్, చైనీస్ తైపీ అజేయంగా ఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ... గ్రూప్ ‘బి’లో చైనీస్ తైపీ తాము ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి.
చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా లక్ష్య సేన్


