ఏడాది విరామం తర్వాత భారత నంబర్‌వన్ షట్లర్ లక్ష్య సేన్ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా అవతరించాడు.
38 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–11తో ప్రపంచ 26వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)పై నెగ్గాడు. గత ఏడాది నవంబర్‌లో సయ్యద్ మోడీ ఓపెన్ సూపర్–300 టోరీ్నలో టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్ ఆ తర్వాత మరో టైటిల్ సాధించలేకపోయాడు.
ఈ ఏడాది హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. విజేతగా నిలిచిన లక్ష్య సేన్‌కు 35,625 డాలర్ల (రూ. 31 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


