టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్‌ఎల్‌సీ నియమించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి శ్రీలంక జట్టును సన్నద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియమించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
రాథోర్ జనవరి 18న లంకతో జట్టుతో కలవనున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జట్టుతోనే ఉండనున్నాడు. విక్రమ్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. . 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅతడు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవల్ 3 కోచ్‌గా కొనసాగాడు.
అతడు ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్పటికే భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను తమ ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. రాథోర్ భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్ పనిచేశాడు.
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించనున్నాడు. కాగా ఈ పొట్టి ప్రపంచకప్‌కు శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. శ్రీలంక తమ లీగ్ మ్యాచ్‌లన్నింటని స్వదేశంలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.


