ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ భరత్ హుడా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా పుణేరి పల్టన్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో కూడా తన రైడింగ్ స్కిల్‌తో అదరగొట్టాడు. ఓ డూ ఆర్ డై రైడ్‌లో హుడా అద్భుతం చేశాడు.
ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లో వరుసగా రెండు రైడ్స్‌లో పాయింట్లు రాకపోవడంతో టైటాన్స్ డూ ఆర్ డై రైడ్‌ను ఎదుర్కొవాల్సి వచ్చింది. అవతలి ఎండ్‌లో ముగ్గురు పుణేరి ప్లేయర్లు ఉన్నారు. ఈ సమయంలో డూర్ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన భరత్ హుడా.. ముగ్గురిని కూడా టచ్ చేసి తన ఎండ్‌కు వచ్చేశాడు. దీంతో పుణేరి పల్టన్ ఆలౌటైంది.
ఒకే దెబ్బకు టైటాన్స్‌కు ఐదు పాయింట్లు వచ్చాయి. సూపర్ టాకిల్ అవకాశమున్నప్పటికి చాకచాక్యంగా భరత్ డిఫెండర్ల నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో భరత్ 23 రైడ్ పాయింట్లు సాధించాడు.
టైటాన్స్ ఓటమి..
కాగా క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-2లో 50-45 తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి టైటాన్స్ ఇంటిముఖం పట్టింది. భరత్ హుడా అద్భుత పోరాటం వృథాగా మిగిలిపోయింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ తలపడనున్నాయి.


