ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఛాంపియన్‌గా దబంగ్ ఢిల్లీ నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో పుణేరి పల్టన్‌ను 30-28 తేడాతో విజయం సాధించిన దబంగ్ ఢిల్లీ.. రెండో సారి పీకేఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ కంటే దబంగ్ 2 పాయింట్లు అధికంగా సాధించింది.
सुपर SE BHI ऊपर TACKLE! ⭐👏🏻#PKL12 Final 👉 Dabang Delhi K.C. 🆚 Puneri Paltan | LIVE NOW ➡ https://t.co/GqoflbVhyp pic.twitter.com/mA2twB1vDV
— Star Sports (@StarSportsIndia) October 31, 2025
నీరజ్ నర్వాల్ తొమ్మిది రైడ్ పాయింట్లతో దబంగ్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అజింక్య పవార్ కూడా 6 పాయింట్లు సాధించాడు. ఇక సీనియర్ డిఫెండర్ ఫజెల్ అట్రాచలి ఆఖరిలో అద్బుతమైన టాకిల్‌తో తన జట్టును విజేతగా నిలిపాడు.
మరోవైపు పుణేరి రైడర్ ఆదిత్య షిండే పోరాటం వృథా అయిపోయింది. ఆఖరిలో ఆదిత్య సూపర్ రైడ్‌తో పుణేరి విజయంపై ఆశలు రెకెత్తించాడు. కానీ తర్వాత రైడ్‌లో ఆదిత్య షిండే టాకిల్ కావడంతో పుణేరి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చదవండి: భారత హాకీ దిగ్గజం కన్నుమూత


